E-Paper
Advertisement

ఇక్కడ చీకట్లోకి వెళ్తే చావే… మిస్ అవ్వకుండా చూడాల్సిన హార్రర్ మూవీ

ఇక్కడ చీకట్లోకి వెళ్తే చావే… మిస్ అవ్వకుండా చూడాల్సిన హార్రర్ మూవీ
Advertisement

Horror Movie OTT  : చీకటిలోనే మనం ఎక్కువగా దెయ్యాలను తలచుకుని భయపడుతుంటాం. ఇదే కాన్సెప్ట్ తో ఒక హారర్ మూవీ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇందులో దెయ్యం మన రక్తం తాగడం కంటే, మనల్ని చీకట్లోకి లాక్కెళ్లి చంపడానికే ఎక్కువ చూస్తుంది. ఆ దెయ్యం వెలుతురులో మనల్ని ఏం చేయలేదు కాబట్టి, సినిమా చూస్తున్నంత సేపు అమ్మో! ఎక్కడ కరెంట్ పోతుందో.. ఎక్కడ టార్చ్ లైట్ ఆరిపోతుందో అని గుండెలు చేతిలో పట్టుకుని కూర్చోవాలి. ఇది గాలిలో తేలే దెయ్యాల కథ కాదు, ముఖం కాలిపోయి పగతో రగిలిపోయే ఒక రాక్షస ఆత్మ కథ. నిశ్శబ్దంగా ఉంటూనే ఒక్కసారిగా మీద పడి భయపెట్టే సీన్లు ఇందులో చాలా ఉంటాయి. మొత్తానికి గట్టి గుండె ఉన్నోళ్లు, రాత్రిపూట చీకట్లో థ్రిల్ కావాలనుకునేవాళ్లు చూడాల్సిన పక్కా మాస్ హారర్ సినిమా ఇది.

ఎందులో చూడచ్చు అంటే

జోనాథన్ లైబ్స్‌మన్ దర్శకత్వం వహించిన ఈ అమెరికన్ సూపర్ నేచురల్ హారర్ సినిమా పేరు ‘డార్క్నెస్ ఫాల్స్’ (darkness falls). 2003లో వచ్చిన ఈ సినిమా కథ “టూత్ ఫెయిరీ” అనే పురాణ కథ ఆధారంగా రూపొందింది. ఈ సినిమాను కేవలం 11 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తీస్తే, బాక్సాఫీస్ వద్ద ఏకంగా 47 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి పెద్ద హిట్ అయింది. అంతేకాదు హాలీవుడ్ లెజెండరీ మేకప్ ఆర్టిస్ట్ స్టాన్ విన్‌స్టన్ (జురాసిక్ పార్క్, టెర్మినేటర్ ఫేమ్) ఈ సినిమాలో టూత్ ఫెయిరీ దెయ్యం రూపాన్ని డిజైన్ చేశారు. దర్శకుడు జోనాథన్ లైబ్స్‌మన్ ఈ సినిమాతోనే తన కెరీర్‌ను ప్రారంభించి, తర్వాత పెద్ద పెద్ద యాక్షన్ సినిమాలకు దర్శకత్వం వహించే స్థాయికి వెళ్లారు. ఈ సినిమా కథ అమెరికా నేపథ్యంలో సాగినా, షూటింగ్ మాత్రం పూర్తిగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ పరిసరాల్లో జరిగింది. దీనిని నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో సబ్‌స్క్రిప్షన్‌తో చూడవచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెెంట్‌కు అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

డార్క్నెస్ ఫాల్స్ అనే ఊర్లో మటిల్డా అనే ఒక ముసలామె ఉండేది. పిల్లల పళ్ళు ఊడిపోతే అవి తీసుకుని వాళ్ళకి చాక్లెట్లు, నాణేలు ఇచ్చేది, అందుకే అందరూ ఆమెను “టూత్ ఫెయిరీ” అని ముద్దుగా పిలుచుకునేవారు. ఒకసారి ఆమె ఇంట్లో అగ్నిప్రమాదం జరిగి ముఖమంతా కాలిపోయి వికారంగా తయారవుతుంది. అప్పటినుంచి ఎండ తగిలినా, వెలుతురు చూసినా ఆమె చర్మం మంట పుట్టేది. అందుకే ఎప్పుడూ ముఖానికి మాస్కు వేసుకుని చీకట్లోనే ఉండేది. కానీ ఊర్లో ఎవరో ఇద్దరు పిల్లలు కనిపించకుండా పోతే, అందరూ కలిసి ఈ ముసలామే ఏదో మంత్రాలు చేసి చంపేసిందని నింద వేసి, ఆమెను దారుణంగా ఉరి తీసి చంపేస్తారు. చచ్చేముందు ఆమె ఊర్లో ఎవడినీ వదలనని శపించి పోతుంది.

Also Read : మనిషి మాంసంతో బిజినెస్… వంద నిమిషాల పాటు వెన్నులో వణుకు పుట్టించే సినిమా

Advertisement

కొన్నాళ్లకి కైల్ అనే కుర్రాడికి చివరి పాల పన్ను ఊడిపోతుంది. ఆ రాత్రి మటిల్డా ఆత్మ వాడి దగ్గరికి వస్తుంది. కానీ తెలివిగా వెలుతురులో దాక్కుని తప్పించుకుంటాడు. అయితే వాడు వెలుతురులో ఉన్నాడని కోపంతో ఆమె వాడి తల్లిని చంపేస్తుంది. ఆ ఊరి జనం కైల్‌ మాటలు నమ్మకుండా వాడికి పిచ్చి పట్టిందని ఊరి నుంచి పంపించేస్తారు. వాడు ఎక్కడికి వెళ్ళినా తన వెంట టార్చ్ లైట్లు, బ్యాటరీలు, కొవ్వొత్తులు మోస్తూ ఎప్పుడూ వెలుతురులోనే బతుకుతుంటాడు. ఎందుకంటే చీకటి పడితే ఆ దెయ్యం వచ్చి తన ప్రాణం తీస్తుందని వాడికి తెలుసు. పన్నెండేళ్ల తర్వాత కైల్ మళ్ళీ తన ఊరికి తిరిగి వస్తాడు. తన స్నేహితురాలు తమ్ముడు కూడా ఇప్పుడు అదే సమస్యతో బాధపడుతుంటాడు. మటిల్డా ఆత్మ ఆ పిల్లాడి ప్రాణం తీయడానికి ఊరి మీద పడుతుంది. ఇక సినిమా అంతా ఆ చీకటి దెయ్యం నుంచి వీళ్ళు ఎలా తప్పించుకున్నారు ? లైట్లు ఆరిపోకుండా ఎలా పోరాడారు ? చివర్లో ఆ దెయ్యాన్ని ఎలా అంతం చేశారు ? అనే విషయాలతో చాలా ఉత్కంఠంగా సాగుతుంది.

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×