E-Paper
Advertisement

మనిషి మాంసంతో బిజినెస్… వంద నిమిషాల పాటు వెన్నులో వణుకు పుట్టించే సినిమా

మనిషి మాంసంతో బిజినెస్… వంద నిమిషాల పాటు వెన్నులో వణుకు పుట్టించే సినిమా
Advertisement

Comedy horror Thriller on OTT : ఓటీటీలో ఒక డిఫరెంట్ కామెడీ హారర్ థ్రిల్లర్ ను ఆడియన్స్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో దెయ్యాలు లేకపోయినా సీట్ ఎడ్జ్ కి తీసుకెళ్ళే సీన్స్ చాలానే ఉన్నాయి. ఇది అమెరికాలోని వలసదారుల సమస్యలను ఎత్తిచూపే ఒక పొలిటికల్ సటైర్. అమెరికాలో వలస వచ్చిన వాళ్ళను అక్కడి ప్రభుత్వం ఎంత దారుణంగా వాడుకుంటుందో చూపిస్తూ, దానికి కొంచెం కామెడీ, మరికొంత భయాన్ని జోడించి తీశారు. సినిమాలో కుర్రాళ్లు సడన్‌గా ముసలివాళ్లు అయిపోవడం, ఆ వెనుక ఉన్న మెడికల్ మాఫియా చేసే పనులు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. కొత్త రకం కథలు, కాస్త డార్క్ గా ఉండే సినిమాలు ఇష్టపడే వాళ్లకి ఇది ఖచ్చితంగా ఒక వెరైటీ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

ఎక్కడ చూడచ్చు అంటే 

2022లో వచ్చిన ఈ అమెరికన్ కామెడీ హారర్ సినిమా పేరు ‘అమెరికన్ కార్నేజ్’ (American Carnage). దీనికి డియెగో హాలివిస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రధానంగా అమెరికాలోని వలసదారుల హక్కులు, జాతి వివక్ష వంటి సోషల్ అంశాలను ఒక హారర్ కామెడీ రూపంలో చూపిస్తుంది. 2017లో డోనాల్డ్ ట్రంప్ తన ప్రసంగంలో వాడిన “American Carnage” అనే పదం నుండి సినిమా టైటిల్ తీసుకోబడింది. ఇందులో జెన్నా ఒర్టెగా, జార్జ్ లెండెబోర్గ్ నటనకు మంచి గుర్తింపు లభించగా, క్లైమాక్స్ లో వచ్చే కొన్ని మలుపులు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఈ సినిమా సుమారు 101 నిమిషాల నిడివితో సాగుతుంది. దీనికి డియెగో హాలివిస్ దర్శకత్వం వహించగా, ఉనాక్స్ మెండియా సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా Prime Video లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. ఇది Apple TV లో కూడా లభిస్తుంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

అమెరికాలో ఒక రాష్ట్ర గవర్నర్ అకస్మాత్తుగా వలసదారుల పిల్లలందరినీ అరెస్టు చేయాలని ఆదేశిస్తాడు. ఈ క్రమంలో జేపీ అనే యువకుడు, అతని స్నేహితులతో కలిసి పోలీసులకు చిక్కుతాడు. అయితే ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఒక ప్రతిపాదన పెడుతుంది. ఒక పెద్ద వృద్ధాశ్రమంలో వాలంటీర్లుగా పని చేస్తే, వారిపై ఉన్న కేసులను తొలగిస్తామని చెబుతారు. జైలు శిక్ష తప్పించుకోవడానికి వాళ్ళు ఆ ఒప్పందానికి సరే అని ఆశ్రమానికి వెళ్తారు. అయితే ఆశ్రమంలో మాత్రం వింత పరిణామాలు జరుగుతాయి. ఆ వృద్ధాశ్రమంలో అడుగుపెట్టిన కొద్దిరోజులకే అక్కడ ఏదో తేడాగా ఉందని జేపీ గమనిస్తాడు. అక్కడ ఉండే వృద్ధులు చాలా వింతగా ప్రవర్తిస్తుంటారు.

అసలు విషయం ఏమిటంటే, అక్కడ ఉన్న డాక్టర్లు ఈ యువకులకు పెట్టే ఆహారంలో ఒక రకమైన రసాయనాన్ని కలుపుతారు. దానివల్ల వీళ్ళు చాలా తొందరగా వృద్ధాప్యానికి గురవుతారు. నిజానికి అక్కడ ఉన్న వృద్ధులంతా ఒకప్పుడు ఇలాగే వాలంటీర్లుగా వచ్చిన యువకులేనని తెలిసి జేపీ షాక్ అవుతాడు. అంతేకాకుండా, చనిపోయిన వాళ్ళ శరీరాలతో మాంసం తయారు చేసి బయట అమ్ముతున్నారనే దారుణమైన నిజాన్ని జేపీ కనిపెడతాడు. రాజకీయ ప్రయోజనాల కోసం గవర్నర్ చేస్తున్న ఈ మాంసం వ్యాపారాన్ని అడ్డుకోవాలని జేపీ నిర్ణయించుకుంటాడు. చివరికి ప్రాణాలకు తెగించి ఆ నరకం నుండి వీళ్ళు ఎలా తప్పించుకున్నారు ? ఆ కుట్రను బయట ప్రపంచానికి ఎలా తెలియజేశారు ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : ఆత్మల కేసులు ఇన్వెస్టిగేట్ చేసే దెయ్యాలు… అదిరిపోయే ఫాంటసీ అడ్వంచర్ భయ్యా

Related News

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

Big Stories

Advertisement
×