E-Paper
Advertisement

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 07: ఆ రాశి వారికి అకస్మిక ధన లాభం – వారికి వ్యాపారాలలో లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 07: ఆ రాశి వారికి అకస్మిక ధన లాభం – వారికి వ్యాపారాలలో లాభాలు
Advertisement

Today Horoscope: 

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన  మే 07వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

ధనవ్యయ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.  అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి. వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగాలలో చికాకులు మరింత పెరుగుతాయి. 

వృషభం

Advertisement

దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరు అందరినీ ఆకట్టుకుంటారు. ఇంటా బయట ఆశ్చర్యకర సంఘటనలు చోటుచేసుకుంటాయి. నూతన వస్తులాభాలు ఉంటాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. 

మిథునం

ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థుల అంచనాలు అందుకుంటారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. నూతన వాహన యోగం ఉన్నది. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. 

కర్కాటకం

Advertisement

వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలు ఎదుర్కొంటారు. చేపట్టిన పనులలో శ్రమ తప్పదు. బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి. గృహమున కొందరి ప్రవర్తన శిరో బాధ కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

సింహం

మానసిక సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఎంత శ్రమపడిన పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. 

కన్య

ఆపదల నుండి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపార వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగమున మీ విలువ మరింత పెరుగుతుంది.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

మిత్రులతో ఊహించని మాటపట్టింపులు కలుగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. ధన పరమైన చికాకులు పెరుగుతాయి. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వృశ్చికం

నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల చిరకాల స్వప్నం నెరవేరుతుంది. వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. 

ధనుస్సు

చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు. ఇంటా బయట శ్రమాధిక్యత పెరుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి.  

మకరం

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవచింతన పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది. 

కుంభం

విలువైన వస్త్ర ఆభరణలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహన అనుకూలత కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి.

మీనం

ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి.  ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు అధికమౌతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ తప్పదు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×