E-Paper
Advertisement

Romantic Thriller OTT : డబ్బులిచ్చి అమ్మాయితో అలాంటి పని… తమిళ రొమాంటిక్ డ్రామా ఓటీటీలోకి…ఎక్కడ చూడచ్చు అంటే ?

Romantic Thriller OTT : డబ్బులిచ్చి అమ్మాయితో అలాంటి పని… తమిళ రొమాంటిక్ డ్రామా ఓటీటీలోకి…ఎక్కడ చూడచ్చు అంటే ?
Advertisement

Romantic Thriller OTT : ఓటీటీలోకి ఒక కొత్త తమిళ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. థియేటర్లలో రిలీజ్ అయిన రెండు నెలలకు ఇది డిజిటల్ ఆడియన్స్ ని పలకరిస్తోంది. ఈ మూవీ అమ్మాయిలతో మాట్లాడడానికి తెగ భయపడిపోయే ఒక యువకుడి చుట్టూ తిరుగుతుంది. తన భయాన్ని పోగొట్టుకోవడానికి, ఒక రోజు అమ్మాయిని కూడా అద్దెకు తీసుకుంటాడు. అయితే ఇక్కడినుంచే స్టోరీ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఈ సినిమా థియేటర్లలో మంచి టాక్ తో నడిచింది. అయితే ఇప్పుడు ఏకంగా మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్ కి వచ్చింది.

మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్

ప్రవీణ్ కె మణి దర్శకత్వం వహించిన ఈ తమిళ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ పేరు ‘డియర్ రాధి’ (Dear Radhi). ఇందులో శరవణ విక్రమ్ (మదన్), హస్లీ అమన్ (రాధీ) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2026 జనవరి 2న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా 2026 మార్చి 6 నుండి Sun NXT, Simply South, Tentkotta ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ సినిమా తమిళ భాషలో మాత్రమే ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

మదన్ అనే కుర్రాడు ఐటీ ఉద్యోగం చేస్తున్నా, అతనికి ఆడపిల్లలంటే తెగ భయం. గైనోఫోబియా(మహిళల భయం)తో ఎవరితోనూ సరిగ్గా మాట్లాడలేక, బిక్కుబిక్కుమంటూ బతికేస్తుంటాడు. దీంతో ఒక రోజు మధన్ స్నేహితుడు స్పా లో పనిచేసే రాధిక అనే అమ్మాయిని అతనికి పరిచయం చేస్తాడు. ఈ భయాన్ని పోగొట్టుకోవాలని మదన్ కూడా ఆమెకు డబ్బులిచ్చి, తనతో ఒక రోజంతా గడపమని అడుగుతాడు. అయితే శారీరకంగా కాకుండా, తన భయాలను ఎదుర్కోవడానికి మాత్రమే ఆమెతో 24 గంటలు మాట్లాడమని మధన్ అడుగుతాడు. ఏదో సరదాగా గడిచిపోతుందనుకుంటే, అసలు కథ అక్కడే మొదలవుతుంది. ఆ అమ్మాయి గతం అంత ఈజీగా ఉండదు. తన వెనుక ఒక పెద్ద క్రిమినల్ గ్యాంగ్ పడుతుంది.

ఇక ఆ ఒక్క రోజులో మదన్ జీవితం మొత్తం రివర్స్ అయిపోతుంది. ఇటు రాధీని చంపాలని చూసే గ్యాంగ్, అటు వెంటాడే పోలీసులు.. వీరిద్దరి మధ్య మదన్ ఎలా ఇరుక్కుపోయాడు ? తన భయాన్ని మర్చిపోయి ఆ అమ్మాయిని ఎలా కాపాడాడు ? అనేదే సినిమా. లవ్, కామెడీ కంటే కూడా ఈ సినిమాలో వచ్చే ఆ ఛేజింగ్ సీన్లు, ఆ అమ్మాయి వెనకున్న సీక్రెట్ చాలా రఫ్ అండ్ టఫ్ గా ఉంటాయి.

Advertisement

Read Also : తండ్రిని జైలుకు పంపే కూతురు… భర్త కోసం భార్య ఎదురుచూపులు… ఏడిపించే ఎమోషన్స్ కూడా

Tags

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×