E-Paper
Advertisement

Devagudi movie OTT : ఓటీటీలోకి వచ్చేసిన రఘు కుంచె ప్లాఫ్ సినిమా… ఎక్కడ చూడచ్చు అంటే ?

Devagudi movie OTT : ఓటీటీలోకి వచ్చేసిన రఘు కుంచె ప్లాఫ్ సినిమా… ఎక్కడ చూడచ్చు అంటే ?
Advertisement

Devagudi movie OTT : గత కొంత కాలంగా తక్కువ బడ్జెట్ సినిమాలు ఒకదాని తర్వాత ఒకటిగా తెరపైకి వస్తున్నాయి. కానీ ఇవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా గుర్తింపు పొందలేదు. ఈ నేపథ్యంలోనే థియేటర్లలోకి వచ్చిన అలాంటి మరో సినిమా ‘దేవగుడి’ (Devagudi). ప్రముఖ సంగీత దర్శకుడు రఘు కుంచె ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు కూడా. అయితే ఫ్యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా బజ్ లేకపోవడం వల్ల సినిమాహాళ్లలో ప్రేక్షకులే కరువయ్యారు. ఈ చిత్రం డిజిటల్ హక్కులను చాలా తక్కువ ధరకు వెళ్ళినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ లోకి ఎంట్రీ కూడా ఇచ్చింది.

 ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ ఏడాది జనవరి 30న థియేటర్లలో విడుదలైన ‘దేవగుడి’ సినిమా బెల్లం రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది. దీని డిజిటల్ హక్కులను Sun NXT సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా 2026 మార్చి 3 నుండి ఓటీటీ ఆడియన్స్ ని పలకరిస్తోంది. ఇందులో అభినవ్ శౌర్య, తోషి అలహరి, అనుశ్రీ ప్రధాన పాత్రల్లో నటించారు. అంతేకాకుండా ప్రముఖ సంగీత దర్శకుడు రఘు కుంచె ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. ఆయన నటన విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అయితే ఈ సినిమా థియేటర్లలో నిరాశపరచినా, గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ సినిమా కావడంతో ఓటీటీలో ఆకట్టుకునే అవకాశం ఉందని మేకర్స్ ఎదురుచూస్తున్నారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ధర్మ అనే కుర్రాడు రాయలసీమలోని ఒక పలుకుబడి ఉన్న వీరారెడ్డి (రఘు కుంచె)అనే పెద్దాయన దగ్గర నమ్మకస్తుడైన డ్రైవర్‌ కొడుకు. ఆ పెద్దాయన ఇంట్లోనే ధర్మ కూడా పెరుగుతాడు. వాళ్లంతా ఒకే ఇంట్లో ఉన్నా, ధర్మను చూసే విధానంలో మాత్రం ఏదో ఒక తేడా చూపిస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఆ ఊరిలో ఉండే కుల వివక్ష ధర్మకు ఎప్పుడూ అడ్డు తగులుతుంటాయి. అయినా సరే తన తండ్రి ఆ యజమానికి ఇచ్చే గౌరవం కోసం ధర్మ అన్నిటినీ భరిస్తూ, ఆ కుటుంబానికి అండగా నిలబడతాడు. కానీ ధర్మ ఆ పెద్దాయన కూతురు ప్రేమలో పడటంతో అసలు గొడవ మొదలవుతుంది. వీళ్ల ప్రేమ విషయం తెలిశాక ఊరిలో ఉండే పాత పగలు, కులాల గొడవలు ఒక్కసారిగా పెద్దవవుతాయి. చివరికి ఆ ఊరి పెద్దల నుంచి ఎదురైన ఇబ్బందులను ధర్మ ఎలా ఎదుర్కొన్నాడు? తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : తుప్పు పట్టిన కత్తులతో కాలక్షేపం … కట్ చేస్తే మైండ్ బ్లోయింగ్ మిషన్… దుమ్ము లేపే ఫైట్స్

Tags

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×