E-Paper
Advertisement

మంచిగా బతకాలనుకునే మాజీ దొంగ… ఓటీటీలోకి ధనుష్ హీస్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్

మంచిగా బతకాలనుకునే మాజీ దొంగ… ఓటీటీలోకి ధనుష్ హీస్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్
Advertisement

Heist Thriller Movie on OTT : ఈ తరం యూత్ ఏం కొనాలన్నా, కావాలి అనుకున్నా లోన్లతోనే నెట్టుకొస్తున్నారు. అసలు ఈ బ్యాంకులు ప్రజల కలలను నెరవేరుస్తున్నాయా ? లేదంటే జీవితాలను కబళించడానికి ప్రయత్నిస్తున్నాయా ? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ మూవీని చూడాల్సిడ్నే. యాక్షన్, ఎమోషన్, రివెంజ్ డ్రామాతో తెరకెక్కిన ఈ చిత్రం పేరు Kara. ఒక సాధారణ మనిషి కోపం ఎంత ప్రమాదకరంగా మారుతుందో ఈ హీస్ట్ థ్రిల్లర్ లో ఆకట్టుకునేలా చూపించారు. మరి ఈ మూవీని ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు ? అనే విషయం తెలుసుకుందాం పదండి.

మరో 5 రోజుల్లో స్ట్రీమింగ్

ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన హీస్ట్ థ్రిల్లర్ ‘కర’. ఈ సినిమాకు Vignesh Raja దర్శకత్వం వహించారు. గతంలో Por Thozhil వంటి థ్రిల్లర్ హిట్ ఇచ్చిన విఘ్నేష్ రాజా..ఈసారి మాత్రం యాక్షన్ – ఎమోషన్ కలిసిన కథతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సినిమాలో ధనుష్‌కు జోడీగా Mamitha Baiju నటించారు. అలాగే K. S. Ravikumar, Jayaram, Suraj Venjaramoodu కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం 2026 ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఆశించిన రెస్పాన్స్ రాలేదు. కానీ, డిజిటల్ రిలీజ్‌ పై మాత్రం ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది, మరో నాలుగు రోజుల్లో మూవీ అధికారిక స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా ఓటీటీలో ఈ మూవీ అందుబాటులో ఉంటుంది. మే 28 నుంచి ‘కర’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

కథలోకి వెళ్తే…

Advertisement

కరస్వామి చిన్న దొంగ. ఒకప్పుడు చిన్న చిన్న దొంగతనాలు చేసిన అతను ఇప్పుడు మాత్రం పూర్తిగా మారిపోతాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న మల్లి కోసం నిజాయితీగా బతకాలని నిర్ణయించుకుంటాడు. అయితే బతకడానికి భార్యతో కలిసి చిన్న హోటల్ పెట్టాలని ప్లాన్ చేస్తాడు. దానికోసం లోన్ తీసుకోవాల్సి వస్తుంది. దీంతో అక్కడ తాకట్టు పెట్టడానికి ఎన్నో ఏళ్ల తర్వాత తన తండ్రి దగ్గరకు వెళ్తాడు. ఊరిలో ఉన్న పొలం పత్రాలు తీసుకురావాలని అనుకుంటాడు. తీరా అక్కడికి వెళ్ళాక అతనికి షాక్ తగులుతుంది.
.
గ్రామంలో పంచవన్ యూనియన్ బ్యాంక్ అనే బ్యాంకును ముత్తు సెల్వన్ నడుపుతాడు. అయితే ఆ బ్యాంక్ మోసపూరిత లెక్కలతో రైతుల భూములను కబ్జా చేస్తుంది. ఇలాంటి కుట్రతోనే కర ఫ్యామిలీ భూమి కూడా చిక్కుకుంటుంది. కొడుకు డబ్బుల కోసమే వచ్చాడని తెలుసుకున్న కర తండ్రి గుండెపోటుతో చనిపోతాడు. ఇక్కడే కథ కీలక మలుపు తీసుకుంటుంది. తండ్రి చివరి కోరిక ప్రకారం అతని మృతదేహాన్ని సొంత పొలంలో పూడ్చాలని హీరో అనుకుంటాడు. కానీ బ్యాంక్ అధికారులు అడ్డుకోవడంతో కరలోని మరో కోణం బయటకు వస్తుంది. ఇక్కడి నుంచి సినిమా పూర్తిగా హైస్ట్ థ్రిల్లర్ మోడ్‌ లోకి టర్న్ అవుతుంది. మరి హీరో ఆ బ్యాంక్ దోపిడీలు ఎలా చేశాడు ? చివరికి తండ్రి కోరికను తీర్చాడా లేదా ? అన్నది స్టోరీ.

Read Also : మగాళ్లు మాత్రమే ఉండే ఇంట్లో పెళ్లి తెచ్చిన గందరగోళం… నవ్వించి చంపేస్తున్న మలయాళం సినిమా ఓటీటీలోకి

Tags

Related News

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

14,000 ఏళ్ల వయసున్న టీచర్… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులున్న క్లాసిక్ సై-ఫై మూవీ

Big Stories

Advertisement
×