Crime Thriller Movie on OTT : పల్లెటూరి కథల్లో ఉండే ప్రత్యేకత, మట్టి వాసన, మనుషుల అమాయకత్వం, భూమితో వాళ్లకు ఉన్న అనుబంధం, అన్యాయం జరిగితే ఒక్కసారిగా ఎగిసిపడే ఆవేదన… ఇలాంటివన్ని విలేజ్ డ్రామాలంటే ఆడియన్స్ ఇష్టపడేలా చేస్తాయి. అలాంటి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన మూవీ Manithan Deivamagalam ఈరోజు మన మూవీ సజెషన్. ఇందులో గ్రామీణ రాజకీయాలు, భూమి కోసం జరిగే పోరాటం, ప్రజల నమ్మకాలను కాపాడే ఒక మనిషి కథను మనసుకు హత్తుకునే విధంగా చూపించారు.
Dennis Manjunath దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు K. Selvaraghavan ప్రధాన పాత్రలో నటించారు. విభిన్న కథలను తెరకెక్కించే డైరెక్టర్ సెల్వరాఘవన్ నటుడిగా కూడా ఆకట్టుకున్నారు. అయితే ఈసారి ఆయన పూర్తిగా సాధారణ పల్లెటూరి మనిషిగా కన్పించడం విశేషం. ఆయనకు జోడీగా Kushee Ravi నటించారు. అలాగే Kausalya, Mime Gopi, Y. G. Mahendran, Sathish ఇతర పాత్రలు పోషించారు. A. K. Priyan అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ సినిమాలో హైలెట్ గా నిలిచాయి.
2026 ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ప్రస్తుతం ఈ సినిమా రెండు ఓటీటీలలో అందుబాటులో ఉంది. Sun NXT, Airtel Xstream Play ఓటీటీలలో వీక్షించవచ్చు. ఇప్పటికైతే తమిళంలోనే అందుబాటులో ఉన్న ఈ మూవీ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో కూడా అందుబాటులో ఉంది. మరి మిగతా భాషల్లో ఎప్పుడొస్తుందో చూడాలి. దాదాపు 2 గంటల 5 నిమిషాల నిడివితో సాగే సినిమా ఇది.
రాఘవన్ అనే వ్యక్తి పాత్ర ఈ సినిమాలో కీలకం. అతను ఒక చిన్న గ్రామంలో సాదాసీదా జీవితం గడుపుతుంటాడు. భార్య సెల్వితో కలిసి సంతోషంగా ఉంటాడు. ఎవరికీ హాని తలపెట్టని మనస్తత్వం. తన పని తాను చూసుకుంటూ లైఫ్ ను నెట్టుకొస్తాడు. నిజానికి ఆ గ్రామంలో సరైన రోడ్లు ఉండవు. అయితేనేం ఆ ఊరి ప్రజలు మాత్రం ఇవేమీ పట్టించుకోరు. పైగా తమ భూమిని ప్రేమగా కాపాడుకుంటూ, ఉన్నదాంట్లోనే ప్రశాంతంగా బతుకుతారు. కానీ అదే గ్రామంపై ఒక రాజకీయ అండ ఉన్న వడ్డీ వ్యాపారి కన్ను పడుతుంది. అతను వడ్డీకి అప్పులు ఇస్తాడు. అక్కడితో ఆగకుండా అప్పులు తీర్చలేదని అమాయకుల భూములను లాక్కుంటాడు. ఇలా నెమ్మదిగా ఆ ఊరిని తన ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తాడు. అక్కడే కథ కీలక మలుపు తిరుగుతుంది.
స్టార్టింగ్ లో రాఘవన్ ఈ సమస్యలన్నింటికీ దూరంగానే ఉండాలని అనుకుంటాడు. కానీ పరిస్థితులు నెమ్మదిగా అతని కుటుంబాన్ని కూడా ప్రమాదంలో పడేస్తాయి. గ్రామంలోని పరిస్థితులు చూశాక అతనిలో తిరుగుబాటు మొదలవుతుంది. సాధారణ వ్యక్తి నాయకుడిగా ఎలా టర్న్ తీసుకున్నాడు ? గ్రామ ప్రజలను ఎలా ఏకం చేశాడు ? భూమి కోసం జరిగిన ఈ పోరాటంలో గెలిచింది ఎవరు ? అన్నదే సినిమా ప్రధాన కథాంశం.
Read Also : ప్రియురాలి చెల్లెలితో అలాంటి పాడు పని… బాయ్‌ఫ్రెండ్ కు చెమటలు పట్టించే ప్రియురాలి కథ