E-Paper
Advertisement

కిరణ్ అబ్బవరం సినిమాకు ఓటీటీ కష్టాలు… ఏమైందంటే ?

కిరణ్ అబ్బవరం సినిమాకు ఓటీటీ కష్టాలు… ఏమైందంటే ?
Advertisement

Dilruba OTT Delay: జీవితంలోనే కాదు ప్రేమలో కూడా ఒక చిన్న పొరపాటు చేసినా జీవితం ఎంతగా మారుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రేమను నిరూపించుకోవడానికి మనం చేసే చిన్న చిన్న తప్పులే లైఫ్ ను దారుణంగా మారుస్తాయి. ఆ మార్పులు ఏంటో తెలియాలంటే రొమాంటిక్ యాక్షన్ డ్రామా ‘దిల్‌రూబా’ (Dilruba 2025)ను చూడాల్సిందే. కానీ ఈ సినిమా థియేటర్లలోకి వచ్చి ఏడాది గడిచినా, ఇంకా ఓటీటీలోకి రాలేదు. మరి ఈ సినిమాకు వచ్చిన ఓటీటీ కష్టాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

హీరో సిద్ధు చిన్ననాటి స్నేహితురాలు, ప్రేయసి మ్యాగీ. ఆమెతో గాఢమైన ప్రేమలో ఉంటాడు. సిద్ధు తన స్నేహితుడిని నమ్మి వ్యాపారంలో భాగస్వామిగా చేర్చుకుంటాడు. ఆ స్నేహితుడు సిద్ధును దారుణంగా మోసం చేస్తాడు. ఈ ఆర్థిక నష్టం, షాక్ భరించలేక సిద్ధు తండ్రి మరణిస్తాడు. అదే సమయంలో కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల మ్యాగీ కూడా సిద్ధుకు బ్రేకప్ చెప్పి అమెరికా వెళ్ళిపోతుంది. వరుస విషాదాలు, గుండెకోతతో తీవ్రంగా గాయపడిన సిద్ధు ఇకపై తన జీవితంలో ఎవరికీ “సారీ”, “థాంక్యూ” చెప్పకూడదని నిర్ణయం తీసుకుంటాడు.

Advertisement

ఆ పాత జ్ఞాపకాలను వదిలేసి, కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి బెంగళూరులోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చేరతాడు. కాలేజీలో సిద్ధుకు అంజలి పరిచయమవుతుంది. ఒక సందర్భంలో అంజలిని ఒక ఆకతాయి నుండి సిద్ధు కాపాడటంతో, ఆమె సిద్ధు క్యారెక్టర్‌కు ముగ్ధురాలై అతనితో ప్రేమలో పడుతుంది. సిద్ధు మొదట్లో నిరాకరించినప్పటికీ, కాలక్రమేణా అంజలి ప్రేమను అంగీకరిస్తాడు. అంతా సజావుగా సాగుతుందనుకున్న సమయంలో, కాలేజీలో జరిగే ఒక చిన్న గొడవ పెద్దదై పోలీసుల వరకు వెళ్తుంది.

ఆ సమస్య పూర్తి కావాలంటే పోలీసులకు లేదా కాలేజీ యాజమాన్యానికి క్షమాపణ చెప్పమని అంజలి సిద్ధును బ్రతిమాలుతుంది. కానీ తన జీవితంలో సారీ అనే పదమే వాడనని శపథం చేసిన సిద్ధు, అందుకు అస్సలు ఒప్పుకోడు. ఈ పట్టింపుల వల్ల ఇద్దరి మధ్య పెద్ద వివాదం జరిగి, అంజలి కూడా సిద్ధుకు బ్రేకప్ చెప్పి దూరం అవుతుంది. అదే సమయంలో కథలోకి జోకర్ అనే ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా క్రిమినల్ ప్రవేశిస్తాడు.

Advertisement

సిద్ధు వల్ల జోకర్ వందల కోట్ల విలువైన డ్రగ్స్‌ను నష్టపోవాల్సి వస్తుంది. దీనితో జోకర్ సిద్ధును, అతని చుట్టూ ఉన్నవారిని టార్గెట్ చేస్తాడు. డ్రగ్ మాఫియాను సిద్ధు ఎలా ఫేస్ చేశాడు ? సిద్ధు మళ్లీ తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు ? అనేదే ‘దిల్‌రూబా’ సినిమా కథ.

ఏడాది దాటినా దక్కని ఓటీటీ మోక్షం

కిరణ్ అబ్బవరం, రుక్షర్ థిల్లాన్, క్యాథరిన్ డేవిసన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘దిల్‌రూబా’. విశ్వ కరణ్ దర్శకత్వంలో తెరకెక్కింది. మార్చి 2025లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ ఓటీటీలోకి రాలేదు. ఇది కిరణ్ అబ్బవరం ఇటీవలి చిత్రాలలో ఓటీటీలో విడుదల కాని ఏకైక సినిమా ఇదే కావడం గమనార్హం. ఆయన తాజాగా నటిస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ రిలీజ్ నేపథ్యంలో ‘దిల్‌రూబా’ ఓటీటీ రిలీజ్ గురించి చర్చ మొదలైంది. మరి ఈ మూవీ ఎప్పుడు డిజిటల్ గా రిలీజ్ అవుతుందో చూడాలి.

Read Also: పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

Related News

3024 కోట్లు కొల్లగొట్టిన హర్రర్ థ్రిల్లర్… ఓటీటీలోకి తెలుగులో వచ్చేసిన వణికించే వైరల్ హిట్

అండర్‌వరల్డ్‌ని షేక్ చేసిన గ్యాంగ్‌స్టర్ కథ… సీట్-ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కన్నడ యాక్షన్ ధమాకా

26 మంది పిల్లలు మిస్సింగ్… ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్

మనుషుల నిజస్వరూపాలను కళ్లకు కట్టే కథ… హృదయాలను తాకే డాక్యుమెంటరీ స్టైల్ ఎమోషనల్ ఫిల్మ్

క్షణం కూడా కన్ను మూయనివ్వని ఫైట్లు… ఓటీటీలో సందడి చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా

అడవిలో చిక్కుకున్న పైలట్ సాహసం… నవ్వులతో పాటు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ట్రీట్

వీరభద్రుని రహస్యం’ క్లైమాక్స్ ప్రశ్నలకు సమాధానం… ఒళ్ళు గగుర్పొడిచే మలుపులతో వస్తున్న మైండ్ బెండింగ్ థ్రిల్లర్

నెత్తురు ఏరులై పారించే ఊరమాస్ రివేంజ్ డ్రామా… లోకేష్ కనగరాజ్ 100 కోట్ల యాక్షన్ థ్రిల్లర్ తెలుగులోనే స్ట్రీమింగ్

Big Stories

Advertisement
×