E-Paper
Advertisement

వానలో ఆఫీస్‌కి వెళ్తున్నారా? రూ.300 లోపున్న ఈ గ్యాడ్జెట్స్ లేకపోతే.. రూ.వేలల్లో నష్టపోవాల్సిందే!

వానలో ఆఫీస్‌కి వెళ్తున్నారా? రూ.300 లోపున్న ఈ గ్యాడ్జెట్స్ లేకపోతే.. రూ.వేలల్లో నష్టపోవాల్సిందే!
Advertisement

Rainproof Gadgets: వర్షాకాలం వచ్చిందంటే చాలు.. వాన చినుకులకంటే చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, ఇయర్‌బడ్స్ వంటి విలువైన పరికరాల గురించే ఎక్కువ భయపడాల్సి వస్తుంది. కాస్త నీటి బొట్టు లోపలికి వెళ్లిన రిపేర్లకు రూ.వేలల్లో వదిలే ప్రమాదం ఉంటుంది. అయితే వర్షం నుంచి వీటిని కాపాడుకోవడానికి తక్కువ ధరలోనే 3 చిన్న గ్యాడ్జెట్స్ అందుబాటులో ఉన్నాయి. వాటివల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో ఈ కథనంలో చూద్దాం.

వాటర్‌ప్రూఫ్ పౌచ్‌

వర్షాకాలంలో ప్రతి ఒక్కరి వద్ద తప్పనిసరిగా ఉండాల్సిన పరికరం ఇది. ఇది ఫోన్‌ను నీటి చుక్కలు కాపాడుతుంది. ఈ పౌచ్ పారదర్శకంగా ఉండటం వల్ల ఫోన్‌ను బయటకు తీయకుండానే టచ్ స్క్రీన్ ఉపయోగించవచ్చు. ఫొటోలు కూడా తీసుకోవచ్చు. బైక్ పై వెళ్లేటప్పుడు ఆకస్మికంగా వర్షం పడినప్పుడు ఫోన్‌ను ఇందులో పెట్టి జిప్ వేస్తే సరిపోతుంది. ఇవి మార్కెట్‌లో కేవలం రూ.100 నుండి రూ.200 కే లభిస్తాయి.

సిలికాన్ కీబోర్డ్ కవర్, డస్ట్ ప్లగ్స్

Advertisement

ల్యాప్‌టాప్ వాడేవారికి వర్షం అతిపెద్ద శత్రువుని చెబుతుంటారు. వాతావరణంలోని తేమ.. కీబోర్డ్ సంధుల ద్వారా, యూఎస్‌బీ (USB) పోర్టుల ద్వారా లోపలికి వెళ్లి ల్యాప్ టాప్ పనితీరును దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సిలికాన్ కీబోర్డ్ కవర్ తీసుకుంటే.. నీరు కీబోర్డ్ లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటుంది. మరోవైపు డస్ట్ ప్లగ్స్.. ఛార్జింగ్, యూఎస్‌బీ పోర్టులను లాక్ చేసి తేమ చేరకుండా ప్రొటెక్షన్ అందిస్తాయి. వర్షంలో ల్యాప్‌టాప్‌ను తీసుకెళ్లేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా నిలవనున్నాయి. ఇవి ఆన్‌లైన్‌లో రూ.150 నుండి రూ.250 కే దొరుకుతాయి.

Also Read: 20,000mAh బ్యాటరీ.. 67W ఫాస్ట్ ఛార్జింగ్.. షావోమీ నుంచి మైండ్ బ్లోయింగ్ పవర్ బ్యాంక్!

ల్యాప్ బ్యాగ్‌కు రెయిన్ కవర్

Advertisement

ల్యాప్ టాప్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా.. వర్షంలో వెళ్లేటప్పుడు దాన్ని తీసుకెళ్లే బ్యాగ్ తడిసిపోతుంటుంది. బ్యాగ్ లోపల ఉన్న ల్యాప్‌టాప్ తో పాటు ట్యాబ్, పవర్ బ్యాంక్ వంటి పరికరాలు కూడా తడిచి.. దెబ్బతినే ప్రమాదముంది. కాబట్టి ఈ రెయిన్ కవర్లతో చెక్ పెట్టొచ్చు. వీటిని బ్యాగ్‌కు తొడిగితే చుక్క నీరు కూడా లోపలికి వెళ్లదని నిపుణులు అంటున్నారు. ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఫోన్‌తో పాటు ల్యాప్‌టాప్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటికీ ఒకేసారి ఇవి రక్షణ కల్పిస్తాయని పేర్కొంటున్నారు. ఇవి నాణ్యతను బట్టి రూ.150 నుండి రూ.300 మధ్యలో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

Also Read: SanDisk సంచలనం.. సరికొత్త USB-C డ్రైవ్‌లు లాంచ్.. ఇక డేటా ట్రాన్స్‌ఫర్ మరింత ఈజీ!

Related News

10000mAh బ్యాటరీ, 4K కెమెరాతో POCO X8 Series.. రూ.3,000 డిస్కౌంట్ ఆఫర్!

6000mAh బ్యాటరీ, IP68 రేటింగ్.. ఈ ప్రైజ్ రేంజ్‌లో ఇలాంటి ఫోన్ రావడం ఇదే తొలిసారి!

గూగుల్ పిక్సెల్ ఫ్యాన్స్‌కి పండగే.. ఆ ఫోన్ ధర రూ.13,300 తగ్గింది, ఈ డీల్ మిస్ అవ్వొద్దు!

హెల్దీగా తినాలని ఉందా? బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్ ఇవే!

4K డిస్‌ప్లే, 12700mAh బ్యాటరీతో Lenovo Yoga Tab Gen 2.. ధరెంతో తెలుసా?

హైదరాబాద్‌లో TCS భారీ ఏఐ ప్రాజెక్ట్.. రూ.57,600 కోట్లతో HyperVault డేటా సెంటర్!

బడ్జెట్‌లో బెస్ట్ క్యాసియో అనలాగ్ వాచ్.. ఇలాంటి వాచ్ ఒక్కటైనా ఉండాలి

గూస్‌బంప్స్ తెప్పిస్తున్న యాపిల్ ఈవెంట్.. iPhone 18 Proతో పాటు వచ్చే కొత్త డివైజ్‌లు ఇవే!

Big Stories

Advertisement
×