E-Paper
Advertisement

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా
Advertisement

Ek Din OTT: ప్రేమించిన అమ్మాయి కళ్లముందే ఇంకొకరితో లవ్ అంటూ తిరిగితే… అందులోనూ పెళ్ళయిన వాడితో… కోరుకున్న క్షణమే ఆమె వాడిని వదిలేసి వచ్చేస్తే… ఎలా ఉంటుందో తెలియాలంటే ‘ఏక్ దిన్’ (Ek Din) అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఒక్కరోజు కోరుకున్న అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ గా ఉంటే చాలని కోరుకున్న ఆ బాయ్ ఫ్రెండ్ కు దక్కిన వరం ఏంటి ? అసలు ఈ మూవీ తెలుగులో ఉందా ? ఎక్కడ చూడవచ్చు ? వంటి వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

ఈ సినిమాలో మన హీరో పేరు దినేష్ అలియాస్ డినో. ఐటీ కంపెనీలో పనిచేసే నార్మల్ అబ్బాయి. కాకపోతే బాగా ఇంట్రోవర్ట్. అందరితో త్వరగా మోహమాటస్తుడు. అదే ఆఫీసులో పనిచేసే అందమైన అమ్మాయి మీరాని అతను ప్రాణంగా ప్రేమిస్తుంటాడు. కానీ తన ప్రేమను ఆమె దగ్గర చెప్పే ధైర్యం అతనికి అస్సలు ఉండదు. ఆఫీస్ పని మీద కంపెనీ ఉద్యోగులంతా కలిసి జపాన్‌లోని సప్పోరో ప్రాంతానికి వెళతారు.

Advertisement

అక్కడ ఒక ‘ఫార్చ్యూన్ బెల్’ దగ్గర డినో మనసులో ఒక కోరిక కోరుకుంటాడు. కనీసం ఒక్క రోజైనా మీరా తనకు గర్ల్‌ఫ్రెండ్‌గా ఉండాలని, ఆమెతో గడపాలని అనుకుంటాడు. అంతే అనుకున్నదే తడవుగా అతని కోరిక నెరవేరుతుంది. కాకపోతే ఊహించని ట్విస్ట్ వస్తుంది. జపాన్‌లో జరిగిన ఒక ప్రమాదం వల్ల మీరాకు ‘ట్రాన్సియంట్ గ్లోబల్ అమ్నీషియా’ అనే అరుదైన మానసిక సమస్య వస్తుంది. ఈ వ్యాధి వల్ల ఆమె గడిచిన కొన్ని సంవత్సరాల జ్ఞాపకాలను, ప్రస్తుత జీవితాన్ని మర్చిపోతుంది. అయితే ఈ జ్ఞాపకశక్తి కోల్పోవడం అనేది కేవలం ఒక రోజు మాత్రమే ఉంటుంది.

మీరాకు ఏమీ గుర్తులేకపోవడాన్ని గమనించిన డినో, తానే ఆమె ప్రియుడినని అబద్ధం చెప్పి నమ్మిస్తాడు. ఆ ఒక్క రోజూ ఆమెను ఎంతో సంతోషంగా చూసుకుంటూ, ఆమెకు ఇష్టమైనవన్నీ చేస్తాడు. మీరా కూడా అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది. ఇద్దరూ కలిసి జపాన్ అందాలను చూస్తారు, ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, ప్రేమలో మునిగిపోతారు. మరుసటి రోజు ఉదయానికి మీరాకు పాత జ్ఞాపకాలన్నీ తిరిగి వచ్చేస్తాయి. కానీ డినోతో గడిపిన ఆ ఒక్క రోజు జ్ఞాపకం మాత్రం పూర్తిగా తుడిచి పెట్టుకుపోతుంది. మరి తన ప్రేమ ఆమెకు ఎప్పటికీ గుర్తుండదని తెలిసినా, ఆమె సంతోషం కోసం డినో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు ? ఆ ఒక్క రోజు వాళ్ళ జీవితాలను ఎలా మార్చింది ? చివరికి సినిమాలో వచ్చే ఎమోషనల్ క్లైమాక్స్ ఏంటి ? అన్నది తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

తెలుగులోనూ స్ట్రీమింగ్

Advertisement

సాయి పల్లవి, ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ డ్రామా ‘ఏక్ దిన్’. థాయ్ సూపర్ హిట్ సినిమా ‘One Day’కు ఇది అధికారిక రీమేక్. సాయి పల్లవి నటించిన మొట్టమొదటి హిందీ సినిమా ఇదే. కానీ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. Amazon Prime Videoలో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా హార్ట్ టచింగ్ గా ఉంటుంది. బిగ్ స్క్రీన్ పై డిజాస్టర్ గా నిలిచిన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి అడుగు పెట్టింది. మరి ఓటీటీలో దీనికి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.

Read Also: క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×