Chief Secretary: స్వేచ్చ బ్యూరో: సీఎస్ పదవిని దక్కించుకోలేక పోయిన సీనియర్ ఐఏఎస్ లు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. ఐఏఎస్ గా కేరీర్ స్టార్ట్ చేసిన అధికారులకు తప్పనిసరిగా సీఎస్ కావాలనే కలం ఉంటుంది. ఈ నేపథ్యంలో సీనియారిటీ లిస్టులో ఉంటూ చివరి వరకు రేసులో నిలిచి షాక్ కు గురైన అధికారులు ఇప్పుడు డైలమాలో ఉన్నారు. సీఎస్ కుర్చీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినా.. లక్కీ ఛాన్స్ లభించడకపోవడంతో ఆవేదనను దింగమింగుకుంటున్నారు. అప్పటి వరకు తమలోనే ఒక అధికారికి వస్తుందని భావించిన ఆ అధికారులకు సంజయ్ జాజు షాక్ ఇచ్చారు. సడన్ గా ఢిల్లీ నుంచి ఎంట్రీ ఇచ్చి ఆయా అధికారుల లైఫ్ గోల్ పాయింట్ కు చెక్ పెట్టినట్లు చేశారు.
సుమారు రెండేళ్ల పాటు సంజయ్ జాజు సీఎస్ పోస్టులో కంటిన్యూ కానున్నారు. ఆయన హయంలోనే రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగే ఛాన్స్ ఉన్నదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. దీంతో సర్కార్ లో టాప్ పోస్టు కోసం తీవ్ర ప్రయత్నాలు చేసిన సదరు అధికారులు అదృష్టాన్ని మిస్సాయ్యాం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగానే సీఎస్ కు ఆయా అధికారులకు మధ్య సయోధ్య కూడా కుదరడం లేదని టాక్ .అడ్మినిస్ట్రేషన్ అంశంపై పరస్పర సహకారాలు, సమన్వయం వంటివి లేనట్లు కనిపిస్తుందని సచివాలయంలోని కొందరు ఆఫీసర్లు ఆఫ్ ది రికార్డులో చెబుతున్నారు.
గత ప్రభుత్వంలో ఐటీ శాఖ ముఖ్య అధికారిగా పనిచేసిన జయేష్ రంజన్ ..తప్పనిసరిగా తనకే సీఎస్ పదవి లభిస్తుందని భావించారు.1992 బ్యాచ్ కు చెందిన ఈ అధికారి పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శిగా సుదీర్ఘ అనుభవం కలిగి ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తర్వాత కూడా జయేష్ రంజన్ కు ప్రాధాన్యత శాఖలే కేటాయించారు. ప్రభుత్వం నుంచి కూడా సంపూర్ణమైన మద్ధతు లభించడంతో సీఎస్ పదవిపై తీవ్ర ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం మారినా తన పట్టు నిలుపుకుంటూ వచ్చి…ఆఖరి నిమిషంలో సీఎస్ అవకాశం చేజారడం మింగుడుపడని అంశంగా మారింది. మరోవైపు 1992 బ్యాచ్ కు చెందిన మరో కీలక అధికారి వికాస్ రాజ్ కూడా సీఎస్ పోస్టు కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా పంచాయతీ రాజ్ తదితర కీలక శాఖలలో సుదీర్ఘంగా సేవలు అందించారు. సర్వీస్ అంతా తెలంగాణ రాష్ట్రంలోనే అందించి, పరిపాలనా అనుభవం పుష్కలంగా ఉన్నా, సమీకరణలు తలకిందులయ్యాయి.
Also read: Lorry Accident: రోడ్డుపై లారీ బోల్తా.. వెల్లుల్లి సంచులను ఎత్తుకెళ్లిన స్థానికులు.. ఎక్కడంటే?
ఇక 1991 బ్యాచ్ కు చెందిన అరవింద్ కుమార్‌కు కూడా సీఎస్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పవర్‌లోకి వచ్చి తర్వాత ఫార్ములా ఈ రేసు అంశంపై ఆయనపై నోటీసులు జారీ కావడంతో ఆ రేసు నుంచి పక్కకు జరగాల్సి వచ్చింది. శశాంక్ గోయల్ కొంత కాలం సీఎస్ రేసులో నిలిచారు. వీరంతా కంప్లీట్ గా తెలంగాణ రాష్ట్రంలోనే తమ సర్వీస్ ను అందించి, సీఎస్ కుర్చీ కోసం పోటీ పడగా, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే ఢిల్లీకి వెళ్లిపోయిన ప్రస్తుత సీఎస్ కు అదృష్టం వరించిందని ఐఏఎస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. జీవిత ఆశయమైన “చీఫ్ సెక్రటరీ” హోదాను సాధించేందుకు అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ, రాజకీయ సమీకరణాలు ,కేంద్ర-రాష్ట్ర స్థాయి నిర్ణయాల నేపథ్యంలో తమ లైఫ్ గోల్ పాయింట్‌కి చెక్ పడిందనే వేదన ఆయా అధికారులలో స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రస్తుత సీఎస్ కు ఆ సీనియర్ ఐఏఎస్ ల నుంచి సరైన సపోర్టు లభించడం లేదనే చర్చ సచివాలయంలో జరుగుతూనే ఉన్నది. తమకు దక్కాల్సిన కుర్చీ మరోక అధికారికి దక్కకపోవడంతోనేనా? ఆ సీనియర్లు ఈ తరహాలో వ్యవహరిస్తున్నారనే చర్చ కూడా ఉన్నది. పైగా తెలంగాణ భౌగోళిక పరిస్థితులపై పట్టు లేని అధికారి అంటూ ఈ సీనియర్ ఐఏఎస్ ల వర్గంలో చర్చ జరుగుతుంది. తమకు పూర్తి స్థాయిలో తెలంగాణ సిచ్వేషన్, ఆర్ధిక పరిస్థితులు పై అవగాహన ఉన్నప్పటికీ, ప్రభుత్వాలు ఎందుకు కన్సీడర్ చేయలేదనే సందిగ్థంలో వికాస్ రాజ్, జయేష్ రంజన్ లు ఉన్నట్లు టాక్ వినిపిస్తున్నది. ఏదేమైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రస్తుత సీఎస్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు కంటిన్యూ కానున్నారు. దీంతో సీనియారిటీలో ఉన్న సీనియర్ ఐఏఎస్ లు లకు సీఎస్ అయ్యే అదృష్టాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
Also Read: Rain Prayers: వర్షాల కోసం కుకుట్లపల్లి విద్యార్థుల వినూత్న ప్రార్థన!