E-Paper
Advertisement

చరిత్రలోనే అత్యధిక పాపులారిటీ సాధించిన మహిళా సింగర్‌… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ డాక్యుమెంటరీ

చరిత్రలోనే అత్యధిక పాపులారిటీ సాధించిన మహిళా సింగర్‌… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ డాక్యుమెంటరీ
Advertisement

Documentary Series: ప్రపంచవ్యాప్తంగా 80 మిలియన్లకు పైగా మ్యూజిక్ ఆల్బమ్స్ అమ్ముడై, ఆస్ట్రేలియా చరిత్రలోనే అత్యధిక పాపులారిటీ సాధించిన మహిళా సింగర్‌గా కైలీ మినోగ్ ప్రభంజనాన్ని సృష్టించింది. ఆమె 40 ఏళ్ల సంగీత ప్రయాణం ఆధారంగా రూపొందించబడిన మూడు భాగాల డాక్యుమెంటరీ సిరీస్ ‘కైలీ’ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మూడు ఎపిసోడ్లతో సాగే ఈ సిరీస్, ఒక మహిళ తక్కువ స్తాయి నుంచి ఉన్నత శిఖరాలకు ఎలా ఎదిగిందనేది కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది.

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

‘కైలీ’ (KYLIE) డాక్యుమెంటరీ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్ సంస్థ ‘వెంచర్‌ల్యాండ్’ ప్రొడక్షన్‌తో కలిసి భారీ స్థాయిలో నిర్మించింది. దీనికి ఆస్కార్ నామినేట్ అయిన ప్రొడ్యూసర్ జాన్ బాట్‌సెక్ పెట్టుబడి పెట్టగా, గతంలో ఫుట్‌బాల్ లెజెండ్ డేవిడ్ బెక్హామ్ బయోపిక్‌ను అద్భుతంగా తెరకెక్కించిన మైఖేల్ హార్ట్ దర్శకత్వం వహించారు. మూడు ఎపిసోడ్‌ల ఈ లిమిటెడ్ సిరీస్‌లో కేవలం కైలీ మాత్రమే కాకుండా, ఆమె సోదరి డానీ మినోగ్, ఒకప్పటి కో-స్టార్ జేసన్ డొనోవన్, ప్రముఖ మ్యుజీషియన్ నిక్ కేవ్ వంటి స్టార్ సెలబ్రిటీలు ప్రత్యేక ఇంటర్వ్యూలలో పాల్గొని ఆమె గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ సిరీస్ కైలీ సాధించిన రికార్డులను కూడా కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. 2005లో క్యాన్సర్ ట్రీట్‌మెంట్ తీసుకునే ముందు ఆమె ఐవీఎఫ్ (IVF) ప్రక్రియను ఎంచుకోవాల్సి రావడం, ఆ తర్వాత పిల్లలు కలగకపోవడం వల్ల ఆమె అనుభవించిన మానసిక వేదనను ఇందులో మొదటిసారిగా ఎంతో ఓపెన్‌గా మాట్లాడారు. ఈ సిరీస్ 2026 మే 20న విడుదలైంది. ఈ డాక్యుమెంటరీ సక్సెస్ తర్వాత మే 27న ఆమెకు సంబంధించిన ‘టెన్షన్ టూర్ లైవ్’ కన్సర్ట్ ఫిల్మ్‌ను కూడా నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

కైలీ మినోగ్ అనే ఒక సాధారణ ఆస్ట్రేలియన్ అమ్మాయి, టీవీ సీరియల్స్ లో నటిస్తూ ఎలాగోలా పాప్ మ్యూజిక్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదట్లో అందరూ ఆమెను ఒక మామూలు సింగర్ అనుకున్నారు, కానీ తన అద్భుతమైన డాన్స్ పాటలతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకుని గ్లోబల్ పాప్ క్వీన్‌గా ఎదిగింది. ఈ 2026 నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో ఆమె 40 ఏళ్ల మ్యూజిక్ జర్నీని, స్టేజ్ వెనుక ఆమె పడిన కష్టాలను, ఇప్పటివరకు ఎవరూ చూడని ఆమె చిన్ననాటి హోమ్ వీడియోల ద్వారా చాలా క్లియర్ గా చూపించారు. అయితే కైలీ జీవితం అంత ఈజీగా సాగలేదు. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు తెలిసింది. ఆ టైంలో ఆమె మానసికంగా ఎంతో కుంగిపోయింది. కానీ ఆ ప్రాణాంతక వ్యాధితో ధైర్యంగా పోరాడి గెలవడమే కాకుండా, మళ్లీ స్టేజ్ పైకి వచ్చి అంతకంటే పెద్ద హిట్ సాంగ్స్ తో దుమ్ములేపింది. ప్రేమ బంధాలు, అలాగే మీడియా పెట్టిన టార్చర్ తట్టుకుని ఒంటరిగా ఒక లెజెండ్‌లా ఎలా నిలబడింది అనేదే ఈ సిరీస్ అసలు కథ.

Read Also : జంప్ అయ్యి ప్రేమ పెళ్లి… మిస్ అవ్వకుండా చూడాల్సిన బెస్ట్ మలయాళం లవ్ స్టోరీ

Related News

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×