E-Paper
Advertisement

సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లలో ఇవి మాస్టర్ పీస్ లు మావా… ఒక్క సారి చూస్తే ఎప్పటికీ మర్చిపోలేం

సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లలో ఇవి మాస్టర్ పీస్ లు మావా… ఒక్క సారి చూస్తే ఎప్పటికీ మర్చిపోలేం
Advertisement

Best Science Fiction Movies : సినిమా అంటే కేవలం రెండున్నర గంటల కాలక్షేపం మాత్రమే కాదు… కొన్ని సినిమాలు చూస్తుంటే మనల్ని పూర్తిగా మరో లోకం లోకి తీసుకెళ్తాయి. ముఖ్యంగా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ జానర్‌కు ఉండే క్రేజే వేరు. టైమ్ ట్రావెల్, స్పేస్ మిస్టరీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మైండ్ బెండింగ్ కాన్సెప్ట్‌లతో మైండ్ బ్లాక్ చేసే ఆరు హాలీవుడ్ మాస్టర్ పీస్ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. Predestination (2014)

కథ: ఒక క్రిమినల్‌ను పట్టుకోవడానికి ఒక టైమ్ ట్రావెలింగ్ ఏజెంట్ గతం లోకి వెళ్తాడు. కానీ అక్కడ అతనికి ఎదురయ్యే ట్విస్టులు, ఆ పాత్రల మధ్య ఉండే కనెక్షన్ చూస్తే తల పట్టుకోవాల్సిందే. సినిమా చివరలో వచ్చే ఆ ఒక్క ట్విస్ట్ మీ బుర్రను క్రాష్ చేస్తుంది. ఈ సినిమా చూసేటప్పుడు కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే ఇది మైండ్ బెండింగ్ చిత్రం. ప్రస్తుతం Netflix, JioHotstar ప్లాట్‌ఫార్మ్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది ఇది. అలాగే Apple TV Store లో కూడా రెంట్‌కు లభిస్తుంది.

2. Moon (2009)

Advertisement

చంద్రునిపై ఒంటరిగా మూడేళ్లపాటు మైనింగ్ కాంట్రాక్ట్ పూర్తి చేసుకుని, తిరిగి భూమిపైకి రావడానికి సిద్ధమవుతున్న ఒక వ్యోమగామి కథ ఇది. అంతరిక్షంలో ఒంటరిగా ఉన్న అతనికి ఒకరోజు ఊహించని ప్రమాదం ఎదురవుతుంది. ఆ తర్వాత అతనికి తెలిసే కొన్ని నిజాలు చూసే ప్రేక్షకుడికి వెన్నులో వణుకు పుట్టిస్తాయి. తక్కువ బడ్జెట్‌తో, కేవలం ఒకే ఒక్క ప్రధాన పాత్రతో అద్భుతమైన సస్పెన్స్‌ను క్రియేట్ చేసిన మాస్టర్ పీస్ ఇది. ఈ స్పేస్ మిస్టరీ Amazon Prime Video లో సబ్‌స్క్రిప్షన్‌తో వీక్షించవచ్చు, Apple TV లో రెంట్‌కు అందుబాటులో ఉంది.

3. Donnie Darko (2001)

డోనీ డార్కో అనే ఒక టీనేజ్ అబ్బాయికి ఒక రాత్రి ఒక వింతైన కుందేలు రూపం కనిపిస్తుంది. లోకం మరో 28 రోజుల్లో అంతం కాబోతోందని ఆ రూపం అతనికి చెప్తుంది. అసలు ఆ కుందేలు ఎవరు? అది నిజమా లేక డోనీ భ్రమా? పారలల్ యూనివర్స్, టైమ్ లూప్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా మిమ్మల్ని ఆలోచనలో ముంచేస్తుంది. ఈ క్లాసిక్ చిత్రం Amazon Prime Video స్ట్రీమింగ్ అవుతోంది.

4. 12 Monkeys (1995)

Advertisement

భయంకరమైన వైరస్ వల్ల ప్రపంచ జనాభా అంతా తుడిచిపెట్టుకుపోతే… బతికిన కొద్దిమంది భూగర్భంలో దాక్కుంటారు. ఆ వైరస్ మూలాలను కనుగొని, ప్రపంచాన్ని కాపాడటానికి ఒక ఖైదీని గతం లోకి (పాస్ట్ లోకి) పంపుతారు శాస్త్రవేత్తలు. బ్రూస్ విల్లీస్, బ్రాడ్ పిట్ యాక్ట్ చేసిన ఈ మిస్టరీ థ్రిల్లర్, చూస్తున్నంత సేపు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్ ఉన్న ఈ అద్భుత చిత్రం JioHotstar లో అందుబాటులో ఉంది.

5. Ex Machina (2014)

ఈ రోజుల్లో మనం మాట్లాడుకుంటున్న AI ఎంత ప్రమాదకరంగా మారుతుందో పదేళ్ల క్రితమే చూపించిన సినిమా ఇది. ఒక బిలియనీర్ ఇన్వెంటర్ తయారు చేసిన ‘అవా’ అనే హ్యూమనాయిడ్ రోబోను టెస్ట్ చేయడానికి ఒక ప్రోగ్రామర్ వస్తాడు. మనుషుల కంటే తెలివిగా ఆలోచించే ఆ రోబో, తన తెలివితేటలతో ఎలాంటి మైండ్ గేమ్స్ ఆడిందనేదే కథ. విజువల్స్, క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయి.
ఈ ఇంటెలిజెంట్ AI థ్రిల్లర్ ను మీరు Netflix, JioHotstarలో చూడవచ్చు.

6. Alien (1979)

అంతరిక్షంలోకి వెళ్లిన ఒక రీసెర్చ్ షిప్‌ లోకి ఊహించని విధంగా ఒక ఏలియన్ ప్రవేశిస్తే ఎలా ఉంటుంది? చీకటిగా ఉండే స్పేస్ షిప్ లో, ఆ అజ్ఞాత జీవి నుండి ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ టీమ్ పడే శ్రమ ఊపిరి సలపనివ్వకుండా చేస్తుంది. 1979 లోనే గ్రాఫిక్స్, సౌండ్ ఎఫెక్ట్స్ తో హాలీవుడ్ ను ఊపేసిన ఈ సినిమా, ఇప్పటికీ స్పేస్ సర్వైవల్ సినిమాలకు ఒక బెంచ్‌మార్క్. Jio Hotstar, Amazon Prime Video Store లో రెంట్ రూపంలో దీనిని చూడచ్చు.

Read Also : నెట్ ఫ్లిక్స్ టాప్ సినిమాలు… ట్రెండింగ్ లో దుమ్మురేపుతున్న 2 యానిమేటెడ్ మూవీస్

Tags

Related News

వీళ్ళకు చావులేదు… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న హై-వోల్టేజ్ ఫాంటసీ యాక్షన్ సీక్వెల్

సముద్రం ఎడారిగా మారితే ? మనిషి మాంసం కోసం అగాధపు జీవుల అరాచకం… థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్

ZEE5లో సెప్టెంబర్ సినిమాల జాతర… మైండ్ బ్లాక్ చేసే మల్టీ-లాంగ్వేజ్ మూవీస్ సిరీస్ల లిస్ట్

1300 కోట్ల థ్రిల్లర్ తెలుగులో… కేక పుట్టిస్తున్న మైండ్ బ్లాక్ క్రైమ్ కామెడీ

2600 కోట్ల కలెక్షన్లు… 7.9 IMDb రేటింగ్… తెలుగులో అందుబాటులో ఉన్న ఆల్ టైమ్ క్లాసిక్ మిస్టరీ థ్రిల్లర్

ఈ వారం ఓటీటీలో పండగే పండగ… తెలుగులో ఏకంగా 6 సూపర్ హిట్ సినిమాలు

ఫ్రెండ్స్‌తో చూస్తే పొట్టచేక్కలవ్వాల్సిందే… పిచ్చి పిచ్చి గొడవలతో నవ్వించే కామెడీ డ్రామా

ఎఫైర్ ను అడ్డం పెట్టుకుని ఇదేం పాడుపని ? ప్రతీ నిమిషం నెయిల్ బైటింగ్ సస్పెన్స్

Big Stories

Advertisement
×