E-Paper
Advertisement

Documentary Series OTT : 8.5 IMDb రేటింగ్… 18 శక్తి పీఠాల కథ… ఆదిశక్తి అవతారాలు చూస్తే పూనకాలే

Documentary Series OTT : 8.5 IMDb రేటింగ్… 18 శక్తి పీఠాల కథ… ఆదిశక్తి అవతారాలు చూస్తే పూనకాలే
Advertisement

Documentary Series OTT : భారతదేశంలో హిందూ సంస్కృతి సంప్రదాయాలకు ఎంతటి ప్రత్యేకత ఉందో అందరికీ తెలిసిందే. సనాతన ధర్మం, దేవుళ్ళ పురాణాలు వంటి విషయాలు జనాలపై ఎంతగానో ఎఫెక్ట్ చూపిస్తాయి. అయితే ఇలాంటి విషయాలను తెరపైకి తీసుకొచ్చి ఆడియన్స్ ను మెప్పించడం అన్నది మామూలు విషయం కాదు. కానీ అలాంటి ఛాలెంజ్ ను అవలీలగా దాటేసిన ఒక క్రేజీ సిరీస్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. మరి ఈ డాక్యుమెంటరీ సిరీస్ పేరు ఏంటి?; దీన్ని ఎక్కడ చూడొచ్చు ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్

ఈ సిరీస్ పేరు ‘సర్వం శక్తిమయం’. 10 ఎపిసోడ్లుగా వచ్చిన ఈ సిరీస్ ఓటిటిలోనూ సంచలనం సృష్టించింది. ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో రూపొందగా, బివిఎస్ రవి నిర్మించారు. ఆధ్యాత్మికత, తర్కం మధ్య సంఘర్షణను ఆకట్టుకునేలా చూపించిన ఈ సిరీస్లో ఓ నాస్తికుడు, రచయిత ఫ్యామిలీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని అద్భుతంగా చూపించారు. ఇది జీ5 ఓటీటిలో 2023 జూన్ 9న ప్రీమియర్ కి అందుబాటులోకి వచ్చింది. ఐఎమ్డిబి లో ఈ సిరీస్ కు 8.8 రేటింగ్ ఉండడం చెప్పుకోదగ్గ విషయం. ఈ సిరీస్లో సంజయ్ సూరి మాధవ్ పాత్రలో నటించగా, నాస్తికుడి నుంచి ఆధ్యాత్మికుడిగా మారే అతని ప్రయాణం స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ప్రియాగా ప్రియమణి, సమీర్, సోనీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఆశ్లేష ఠాకూర్, సుబ్బరాజు, అఖిల్ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Advertisement

Also Read : ఓటీటీలో ఉన్న మతిపోగొట్టే మరాఠీ సినిమాలు… ఇందులో మీరెన్ని చూశారు ?

కథలోకి వెళ్తే…

హిందూ పురాణాల ప్రకారం శివుని భార్య సతి ఆదిశక్తి మొదటి అవతారం. ఆమె ప్రజాపతి దక్షుని కూతురు. కానీ తండ్రికి ఇష్టం లేకుండానే ఆమె శివుడిని పెళ్లి చేసుకుంటుంది. ఇది తెలుసుకున్న దక్షుడు ఆగ్రహంతో శివుడిని అవమానిస్తాడు. అందరి ముందే కట్టుకున్న భర్తను ఇంత ఘోరంగా తండ్రి అవమానించడం చూసిన సతి తట్టుకోలేక యజ్ఞ వేదికపైనే ఆత్మహత్య చేసుకుంటుంది. దీంతో శివుడు కోపంతో తాండవం చేస్తూ సతి శరీరాన్ని భూమిపైకి తీసుకెళ్తాడు. అలా వెళ్తున్న క్రమంలో పడిన ఆమె శరీర భాగాలు 18 శక్తి పీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. దక్షిణ భారతదేశంలోని 18 మహా శక్తి పీఠాలు కామాక్షి, కామరూప, శ్రీ క్షేత్రం లాంటివి ఈ లిస్టులో ఉన్నవే. దీని ఆధారంగానే ‘సర్వం శక్తిమయం’ సిరీస్ ని తెరకెక్కించారు. ఇక సిరీస్ లో ప్రధాన పాత్ర పోషించిన మాధవ్ ముందుగా ఈ పురాణాలను మొత్తం తప్పు పడతాడు. కానీ అక్కడికి వెళ్లాక ఆధ్యాత్మిక వాతావరణం, భక్తుల అనుభవాలు, అద్భుతాలు అతని ఆలోచన విధానాన్ని మార్చేస్తాయి. మరి దేవుడు అంటేనే నమ్మని మాధవ్ ఆ తర్వాత భక్తులుగా ఎలా మారాడు ? అసలు ఈ జర్నీలో అతని జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి ? అనేది ఈ సిరీస్ కథ.

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×