E-Paper
Advertisement

OTT Movie: ఇద్దరు మొగుళ్ళ ముద్దుల పెళ్ళాం… పగలు ఒకరు.. రాత్రి మరొకరు

OTT Movie: ఇద్దరు మొగుళ్ళ ముద్దుల పెళ్ళాం… పగలు ఒకరు.. రాత్రి మరొకరు
Advertisement

OTT Movie : ఒక భార్యకి ఇద్దరు భర్తలు టైటిల్ బాగా ఉంది కదూ. ఈ కాన్సెప్ట్ తో 1976 లో ఒక మూవీ వచ్చింది. ఇది బ్రెజిల్ సినిమా హిస్టరీలో ఎప్పటికీ మరచిపోలేని సినిమాగా గుర్తింపును కూడా తెచ్చుకుంది. ఒక్కసారి చూస్తే మైండ్ కూడా బ్లాస్ట్ అవుతుంది. ఇందులో ఒక భర్త జీవించి ఉంటాడు. మరొకడు దెయ్యం రూపంలో ఉంటాడు. భార్య మాత్రం ఇద్దరితోనూ సంతోషంగా ఉంటుంది. ఈ సినిమా గురించి బ్రెజిల్ లో ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. అంతలా ఇందులో ఏముంది ? ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలపై ఓ లుక్ వేద్దాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

1976లో వచ్చిన ఈ బ్రెజిలియన్ కల్ట్ క్లాసిక్ ‘డోనా ఫ్లోర్ అండ్ హెర్ టూ హస్బెండ్స్’ ఇప్పటికీ దక్షిణ అమెరికాలో టాప్-10 హిట్స్‌లో ఉంది. అప్పట్లో ఈ సినిమాని 1.2 కోట్ల మంది థియేటర్‌లో చూశారట! బ్రూనో బరెట్టో తెరకెక్కించిన ఈ సినిమాలో అప్పటి బ్రెజిల్ సెక్స్ సింబల్ సోనియా బ్రాగా, డోనా ఫ్లోర్ పాత్రలో నటించింది. మొదటి భర్తగా జోసే విల్కర్, రెండో భర్తగా మౌరో మెండోన్సా నటించారు. 110 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 7.9/10 రేటింగ్ పొందింది. ఇప్పుడు యూట్యూబ్, MUBI, Criterion Channelలో తెలుగు సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : భయం పోయేందుకు బొద్దింకలు తినే అమ్మాయి… ప్రియున్ని దారుణంగా… తండ్రిని ఘోరంగా

స్టోరీ ఏమిటంటే

బ్రెజిల్ లో డోనా ఫ్లోర్ అనే అందమైన యంగ్ టీచర్ ఉంటుంది. ఆమె వడిన్ అనే ఒక తిరుగుబోతుని పెళ్లి చేసుకుంటుంది. అతను రౌడీ, జూదగాడు, డ్రింకర్, వేశ్యలతో తిరిగే ఒక జూలాయి అని చెప్పుకోవచ్చు. అతను రాత్రి వేశ్యలతో గడిపి, ఉదయాన్నే డోనా ఫ్లోర్‌తో బెడ్‌రూమ్‌లో రెచ్చిపోతుంటాడు. ఆమెకి స్వర్గం చూపిస్తాడు కానీ రోజువారీ జీవితంలో సమస్యలు తెస్తుంటాడు. ఒక రోజు పార్టీలో డాన్స్ చేస్తూ చేస్తూ వడిన్ సడన్ హార్ట్ అటాక్ వచ్చి చస్తాడు. డోనా ఫ్లోర్ బాధపడుతుంది కానీ లోలోపల రిలీఫ్ ఫీల్ అవుతుంది. కొన్ని నెలల తర్వాత ఆమె టియోడోరో అనే ఫార్మసిస్ట్‌తో రెండో పెళ్లి చేసుకుంటుంది. టియోడోరో సాఫ్ట్, మంచివాడు, ఆమెకి గౌరవం ఇస్తాడు. కానీ బెడ్‌రూమ్‌లో బోరింగ్, మ్యాటర్ అంతగా ఉండదు.

Advertisement

ఇక్కడే మెయిన్ ట్విస్ట్ వస్తుంది. డోనా ఫ్లోర్ కోరికలు తీర్చుకోలేక రాత్రిపూట బాధపడుతుంటే… చచ్చిపోయిన మొదటి భర్త వడిన్ ఘోస్ట్ (దెయ్యం)గా వచ్చేస్తాడు. అయితే అతను ఎవరికీ కనిపించడు, డోనా ఫ్లోర్‌కి మాత్రమే కనిపిస్తాడు. రాత్రి టియోడోరో నిద్రపోతే, వడిన్ ఘోస్ట్ వచ్చి డోనా ఫ్లోర్‌తో కి కావాల్సినంత రొమాన్స్ ఇస్తాడు. ఒకడు పగలు, మరొకడు రాత్రి అన్నట్టు ఉంటుంది వ్యవహారం. ఇక డోనా ఫ్లోర్ ఎలా రెండు భర్తలతో సంతోషంగా జీవిస్తుంది, ఎవరికీ తెలియకుండా బ్యాలెన్స్ చేస్తుంది. ఈ సినిమా కథ ఇలా ముగుస్తుంది.

 

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×