Maruva Tarama Review : ఈ శుక్రవారం బోలెడు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి మరువతరమా.. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం ప్రేక్షకులను అలరిస్తుంది.. గతంలో ప్రేమ ఇష్క్ కాదల్, వైశాఖం వంటి సినిమాలలో హీరోగా నటించిన హరీష్ ధనుంజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ మరువ తరమా.. ఇందులో అవంతిక, అతుల్య చంద్ర హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి RX100 వంటి సినిమాకు పాటల రచయితగా చేసిన చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వం వచ్చారు.. గిడుతూరి రమణ మూర్తి, ఎన్వి విజయ్ కుమార్ రాజు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి బయటకు వచ్చిన ట్రైలర్లు, టీజర్లు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. గురువారం రాత్రి ప్రీమియర్స్ తో రిలీజ్ అయింది. థియేటర్లోకి వచ్చేసిన ఈ సినిమా టాక్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం..
ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది.. ఇందులో రిషి ( హరీష్ ధనుంజయ్) , సింధు( అవంతిక ), అన్వీ (అతుల్య) ముగ్గురు ఓకే ఆఫీస్ లో పని చేస్తుంటారు. సింధును చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు రిషి. అటు అన్వీ కూడా రిషిని వన్ సైడ్ లవ్ చేస్తుంది. నిజానికి రిషికి సింధు అంటేనే చాలా ఇష్టం.. హిందూ ప్రేమలో మునిగి తేలుతున్న ఈ హీరో ఎందుకు ఆమె నుండి దూరంగా విడిపోయాడు. విడిపోయిన ఈ జంట మళ్ళీ ఒకటవుతారు.. అయితే అటు అన్వీ తన మనసులోని ప్రేమను రిషికి చెప్పిందా? రిషి తల్లి తన కొడుకుకి ఏమని చెప్తుంది? ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎక్కడ ఎండ్ అవుతుందనేది తెలుసుకోవాలంటే మాత్రం కచ్చితంగా సినిమాలో చూడాల్సిందే..
లవ్ స్టోరీ సినిమాలకు యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందన్న విషయం తెలిసిందే. క్యూట్ లవ్ స్టోరీ తో వచ్చే సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ ని అందుకుంటున్నాయి.. ఇలాంటి సినిమాలు తీసే దర్శకులు ఆడియన్స్ ని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆకట్టుకోవాలో అన్నది తెలుసుకొని అలా స్టోరీని మలుపు తిప్పితే చాలు. సినిమా హిట్ అవుతుంది దర్శకుడు సక్సెస్ అవుతాడు. ఈ మూవీలో కూడా డైరెక్టర్ ఎక్కడ బోరింగ్ సీన్స్ పెట్టకుండా కథను ట్విస్టు లతో తీసుకొని వెళ్ళాడు. సినిమా మొత్తం యూత్ని ఆకట్టుకునే సీన్లు ఉండడంతో మంచి టాక్ ను అందుకుంది. ఇందులో తల్లి పాత్రలో నటించిన రోహిణి చెప్పే డైలాగులు ‘అనుకున్నట్లు జరిగితే అది ప్రేమ ఎందుకు అవుతుంది’ దర్శకుడి కలానికి ఎలాంటి పదును ఉందో చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇందులో నటించిన ప్రతి ఒక్క యాక్టర్ కూడా తమ నటనకి 100 శాతం న్యాయం చేశారు.. కెమెరామెన్ పనితీరు సినిమాకు హైలెట్ గా నిలిచింది. హరీష్, అలాగే హీరోయిన్లు చాలా న్యాచురల్ గా నటించారు. ప్రతి అంశం సినిమాకు పాజిటివ్ టాక్ ను అందించింది.. ఇక మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ నార్మల్ గా ఉన్నా.. సెకండాఫ్ ట్విస్టులతో ఆకట్టుకుంటోంది.. సినిమాను చక్కగా నిర్మించారు..
హీరో హరీష్ ధనుంజయ్ చూడడానికి చాలా అందంగా పక్కింటి కుర్రాడు లాగా కనిపించాడు. అటు హీరోయిన్లు కూడా హీరోకి పోటీనిస్తూ బాగానే నటించారు. తల్లి పాత్రలో నటించిన రోహిణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎమోషనల్ డైలాగులతో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. మ్యూజిక్, పాటలు, అదే విధంగా స్టోరీ బాగానే ఉన్నాయని పబ్లిక్ రెస్పాన్స్ ను బట్టి చూస్తే స్పష్టమవుతుంది..
మొత్తంగా... కొద్దిపాటి లోపాలు ఉన్నప్పటికి గుండెల్లో గుర్తిండిపోయే ట్రయాంగిల్ లవ్ స్టోరీ ‘మరువ తరమా’..