E-Paper
Advertisement

OTT Movie : పూర్వీకుల ఇంట్లో పిల్ల మిస్సింగ్… తల్లిని టెన్షన్ పెట్టే టైం లూప్… ఫ్యూజులు అవుటయ్యే హర్రర్ మూవీ

OTT Movie : పూర్వీకుల ఇంట్లో పిల్ల మిస్సింగ్… తల్లిని టెన్షన్ పెట్టే టైం లూప్… ఫ్యూజులు అవుటయ్యే హర్రర్ మూవీ

OTT Movie : హాంటెడ్ హౌస్, సైన్స్ ఫిక్షన్ స్టోరీలు చాలా థ్రిల్ ని ఇస్తుంటాయి. ఈ రెండు థీమ్స్ తో ఒక సిరీస్ అదరగొడుతోంది. ఈ థాయ్ సిరీస్ ఒక మాన్షన్ చుట్టూ తిరుగుతుంది. ఆ ఇంట్లో ఒక అమ్మాయి మిస్సింగ్ తో స్టోరీ ఉత్కంఠంగా సాగుతుంది. అసలు ఎలా మిస్ అయిందనేది తెలిస్తే వచ్చే షాక్ కరెంట్ కాన్నా గట్టిగానే కొడుతుంది. మరి అలాంటి షాకింగ్ ట్విస్టులున్న సిరీస్ ఎక్కడ ఉంది ? దాని పేరు ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌

2024లో వచ్చిన థాయ్ హారర్ మిస్టరీ మినీ సిరీస్ ‘డౌంట్ కమ్ హోమ్’ (Don’t Come Home). వూట్టిదానై ఇంటరకాసెట్ డైరెక్షన్లో వోరానుచ్ భిరోమ్భక్ది, పిచ్చపా పంతుమ్చిందా, సిండీ సిరిన్యా బిషప్ లీడ్ రోల్స్ లో నటించారు. 6 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ 2024 అక్టోబర్ 31 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఐయండిబిలో 7.2/10 రేటింగ్ కూడా దీనికి ఉంది.

స్టోరీ ఏమిటంటే

వరీ అనే ఒక మహిళ తన 5 ఏళ్ల చిన్న పాప మిన్‌తో బ్యాంకాక్ నుంచి ఒక్కసారిగా పారిపోతుంది. ఏదో పెద్ద డేంజర్‌లో ఉన్నట్టు భయంతో, ఎవరికీ చెప్పకుండా రాత్రి రాత్రి బయల్దేరుతుంది. ఆ ఇద్దరూ వెళ్లి చేరేది వరీ పుట్టిన గ్రామంలోని తల్లిదండ్రుల పాత మాన్షన్‌కి. ఆ ఇల్లు 20 ఏళ్ల నుంచి ఖాళీగా ఉంది. ఇక్కడ ఎవరూ మమ్మల్ని వెతక్కుండా ఉంటారు అని మొదట్లో వరీకి ఊరటగా అనిపిస్తుంది. మిన్ కూడా ఇంట్లో ఆడుకుంటూ సంతోషంగా ఉంటుంది.కానీ మూడు-నాలుగు రోజులు గడిచాకే వింతలు మొదలవుతాయి. రాత్రి గోడల్లోంచి ఏడుపు సౌండ్స్, ఇంట్లో పాత ఫోటోల్లో కనిపించని వాళ్లు కనిపించడం వంటి సంఘటనలు జరుగుతాయి.

Read Also : హైకింగ్ కోసం వెళ్లి అమ్మాయిలు మిస్సింగ్… క్షణక్షణం ఉత్కంఠ… అదిరిపోయే సస్పెన్స్ థ్రిల్లర్

అంతేకాకుండా మిన్ ఇంట్లోంచి మిస్సింగ్ అవుతుంది. ఎంత వెతికినా దొరకదు. వరీ ఫుల్ పానిక్ అయి లోకల్ పోలీస్ స్టేషన్‌కి వెళ్తుంది. అక్కడ ఫా అనే మహిళా ఆఫీసర్ కేస్ తీసుకుని, ఇంటికి వచ్చి ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడుతుంది. ఆ మాన్షన్‌లో 30-40 ఏళ్ల క్రితం జరిగిన భయంకరమైన ట్రాజెడీలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. చివరి రెండు ఎపిసోడ్‌లలో ఒక భారీ ట్విస్ట్ వస్తుంది. టైమ్ ట్రావెల్ హింట్, ఫ్యామిలీ సీక్రెట్స్ అన్నీ ఒక్కసారిగా వచ్చి ఫుల్ షాక్ ఇస్తాయి. ఆ సీక్రెట్స్ ఏమిటి ? వరీ చిన్నప్పుడు ఆ ఇంట్లో ఏమైనా జరిగిందా? ఆమె ఫ్యామిలీ ఏదో దాచిపెట్టిందా? బ్యాంకాక్ నుంచి వరీ ఎందుకు భయంతో పారిపోయింది ? మిన్‌ మిస్సింగ్ వెనుక సీక్రెట్ ఏమిటి ? అనే ప్రశ్నలకు సమాధానాలను, ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

 

Related News

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

క్రైమ్ నుంచి రొమాన్స్ వరకు… ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే

ఓటీటీలోకి 7,000 కోట్ల మూవీ… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Big Stories

×