E-Paper
Advertisement

కిడ్నాప్ తర్వాత గతం మర్చిపోయే అమ్మాయి… షాకింగ్ ట్విస్టులతో అదిరిపోయే రొమాంటిక్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

కిడ్నాప్ తర్వాత గతం మర్చిపోయే అమ్మాయి… షాకింగ్ ట్విస్టులతో అదిరిపోయే రొమాంటిక్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో
Advertisement

Romantic Thriller on OTT : ఓ అమ్మాయి కిడ్నాప్‌ కు గురవుతుంది… కానీ కొంతకాలం తర్వాత ప్రాణాలతో బయటపడిన ఆమె తన గతం మొత్తం మర్చిపోతే ? తనను కాపాడుతున్న బాడీగార్డ్ ఎవరో కూడా పూర్తిగా తెలియని పరిస్థితిలో అతనిపైనే ప్రేమ పెరిగితే ? అసలు తన గతంలో ఏం జరిగింది, తనను ఎవరు కిడ్నాప్ చేశారు, ఇప్పుడు తన చుట్టూ జరుగుతున్న వింత సంఘటనలకు కారణం ఏంటి ? ఇలాంటి ప్రశ్నలతో సాగే రొమాంటిక్ థ్రిల్లర్ ‘Drawn Together’. కిడ్నాప్ తర్వాత గతాన్ని మర్చిపోయిన ఓ యువతి, ఆమెకు రక్షణగా ఉండే మిస్టరీ బాడీగార్డ్ చుట్టూ కథ తిరుగుతుంది. మొదట భద్రత కోసం దగ్గరైన వీరిద్దరి మధ్య క్రమంగా ప్రేమ మొదలవుతుంది. కానీ ఆమె గతానికి సంబంధించిన ఒక్కో నిజం బయట పడుతున్న కొద్దీ ఆ ప్రేమకథలోకి ప్రమాదం కూడా అడుగు పెడుతుంది. మరి ఆ తరువాత ఏం జరుగుతుంది ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్ళాల్సిందే.

కథలోకి వెళ్తే…

కిడ్నాప్ ఘటన తర్వాత యువతి జీవితం పూర్తిగా మారిపోతుంది. గతాన్ని గుర్తుపట్టలేకపోవడంతో తన చుట్టూ ఉన్న వ్యక్తులను, జరిగిన సంఘటనలను అర్థం చేసుకోవడం ఆమెకు కష్టంగా మారుతుంది. ఈ సమయంలో ఆమె భద్రత బాధ్యతను ఓ బాడీగార్డ్ తీసుకుంటాడు. అతనితో కలిసి ఉండే కొద్దీ ఇద్దరి మధ్య పరిచయం కాస్తా అనుబంధంగా, ఆ తర్వాత ప్రేమగా మారుతుంది. అయితే ఈ ప్రేమ ప్రయాణం అంత సాఫీగా సాగదు. యువతికి గతానికి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలు మెల్లగా తిరిగి రావడం మొదలవుతుంది.

Advertisement

ఒక్కో జ్ఞాపకం బయటపడుతున్న కొద్దీ ఆమె జీవితంలో జరిగిన విషయాలపై అనుమానాలు పెరుగుతాయి. తనను కిడ్నాప్ చేసినవాళ్లు ఎవరు, వాళ్ల ఉద్దేశం ఏంటి, తనను కాపాడుతున్న వ్యక్తిని పూర్తిగా నమ్మొచ్చా అనే ప్రశ్నలు వెంటాడుతుంటాయి. బాడీగార్డ్‌ కి అసలు ఆమె గతం గురించి ఎంత తెలుసు ? ఆమెను కాపాడుతున్నాడా, లేక ఏదైనా రహస్యాన్ని దాచి పెడుతున్నాడా ? జ్ఞాపకాలు పూర్తిగా తిరిగి వస్తే ఈ ప్రేమకథ పరిస్థితి ఏమవుతుంది ? చివరికి ఆమె గతం వెనుక దాగి ఉన్న అసలు నిజం ఏంటి ? అనేదే సినిమాలో అసలు ట్విస్ట్. ఆమె గుర్తుపట్టలేని గతంలో ఈ బాడీగార్డ్‌కు ఏదైనా సంబంధం ఉందా ? లేక అతనే ఆమె జీవితాన్ని మార్చబోయే వ్యక్తా ? మరి ఆమె జ్ఞాపకాలు తిరిగి వస్తే అసలు ఎలాంటి నిజాలు బయటపడతాయి ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Also Read : అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా జరిగిన దారుణం… నరనరాల్లో భయం పుట్టించే మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్

తెలుగులో చూడొచ్చా ?

Advertisement

‘డ్రాన్ టుగెదర్’ ఇంగ్లీష్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. Prime Videoలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను రొమాన్స్‌తో పాటు మిస్టరీ, థ్రిల్, ఊహించని ట్విస్టులు ఇష్టపడేవారు ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ సినిమా తెలుగులోనే ఉంది కాబట్టి ఈ వీకెండ్ కి డోంట్ మిస్.

Related News

ప్రేమికులపై కన్నేసిన మాస్క్‌డ్ కిల్లర్… వీడి కంట్లో పడ్డారా డైరెక్ట్ నరకానికే… భయపెడుతూనే నవ్వించే రొమాంటిక్ స్లాషర్ ఫిల్మ్

భార్యాభర్తల మధ్య రగిలిన గొడవలు… కడుపుబ్బా నవ్వించే ఫ్యామిలీ డ్రామా

బహుమతుల బాక్సుల్లో నరికేసిన మనుషుల చేతులు… కళ్లు తిప్పుకోనివ్వని సైకో కిల్లర్ వేట

ఓటీటీలోకి సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. అఫీషియల్ అనౌన్స్మెంట్ వైరల్!

నగరం నడిబొడ్డున రగిలిన ప్రజా విప్లవం… టాక్సీ డ్రైవర్ సాహసానికి గూస్‌బంప్స్ గ్యారెంటీ… వరల్డ్ క్లాస్ కల్ట్ హిట్

అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా జరిగిన దారుణం… నరనరాల్లో భయం పుట్టించే మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్

పాత జ్ఞాపకాల మధురమైన కాన్వాస్… సతీష్ వేగేశ్న మార్క్ ఫ్యామిలీ ఈవెంట్ విజువల్ ట్రీట్

Big Stories

Advertisement
×