E-Paper
Advertisement

IMDbలో బెస్ట్ రేటింగ్ ఉన్న బయోపిక్స్… అన్నీ ఒకే ఓటీటీలో

IMDbలో బెస్ట్ రేటింగ్ ఉన్న బయోపిక్స్… అన్నీ ఒకే ఓటీటీలో
Advertisement

Best Biopic Movies OTT : బాలీవుడ్ అయినా, దక్షిణాది సినిమా అయినా.. బయోపిక్‌లకు ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇవి కేవలం వినోదం ఇవ్వడం మాత్రమే కాదు, నిజ జీవితంలో కష్టాలు పడి, కన్న కలలు సాధించిన వ్యక్తుల కథలను మన ముందుకు తెస్తాయి. ఇలాంటి సినిమాలు చూస్తే మనలో కూడా ఒక ఉత్సాహం, ధైర్యం వస్తుంది. జియో హాట్‌స్టార్‌లో ఇప్పుడు ఇలాంటి అద్భుతమైన బయోపిక్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ సినిమాలన్నీ IMDbలో 8 పైనే రేటింగ్‌లు సాధించాయి. మీరు ఇంకా చూడకపోతే.. తప్పక చూడండి.

1. 12th Fail (IMDb 8.7)

ఈ సినిమా చూస్తే నిజంగా కళ్లు చెమ్మగిల్లుతాయి. పేద కుటుంబం నుంచి వచ్చిన మనోజ్ కుమార్ శర్మ UPSC పరీక్షకు ఎలా సిద్ధమయ్యాడు ? ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు ? అనేది మనసుకు హత్తుకునే విధంగా చూపించారు. విక్రాంత్ మాస్సే అద్భుతంగా నటించాడు. ఒక్కసారి చూస్తే మళ్లీ చూడాలనిపిస్తుంది.

2. ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ (IMDb 8.0)

Advertisement

భారత క్రికెట్ హీరో మహేంద్ర సింగ్ ధోని జీవితం ఆధారంగా తెరకెక్కింది ఈ మూవీ. చిన్న పట్టణం నుంచి భారత కెప్టెన్ అయ్యే వరకు అతని ప్రయాణం చాలా ఇన్‌స్పైరింగ్‌ గా ఉంటుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ధోని పాత్రలో బాగా నటించాడు. క్రికెట్ ఫ్యాన్స్‌ ఇది తప్పక చూడాల్సిన సినిమా.

3. రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ (IMDb 8.6)

భారత అంతరిక్ష కార్యక్రమానికి ఎంతో సేవ చేసిన శాస్త్రవేత్త నంబి నారాయణన్ కథ ఇది. తప్పుడు ఆరోపణలు, కష్టాలు ఎదుర్కొన్నా దేశం కోసం తనను తాను అంకితం చేసుకున్న అతని ప్రయాణం చాలా బలంగా ఉంటుంది. ఇందులో మెయిన్ లీడ్ గా ఆర్. మాధవన్ అద్భుతంగా నటించాడు.

4. సూపర్ 30 (IMDb 8.0)

Advertisement

గణిత శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ కథ ఇది. పేద విద్యార్థులను ఐఐటీలోకి తీసుకురావడం కోసం అతను చేసిన కృషి చాలా స్ఫూర్తిదాయకం. హృతిక్ రోషన్ ఈ పాత్రలో అద్భుతంగా నటించారు. చదువు పవర్ ని ఈ సినిమా చాలా అందంగా చూపించింది.

5. పాన్ సింగ్ తోమర్ (IMDb 8.3)

జాతీయ స్థాయి అథ్లెట్ పాన్ సింగ్ తోమర్ కథ ఇది. క్రీడల నుంచి తిరుగుబాటు వైపు అతని ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇర్ఫాన్ ఖాన్ అద్భుతమైన నటనతో ఈ సినిమాను ఇప్పటికీ ప్రత్యేకంగా నిలిపాడు.

Also Read : ఒకే ఓటీటీలో 15 సినిమాలు… తెలుగులో 8… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

6. కౌన్ ప్రవీణ్ తాంబే ? (IMDb 8.3)

క్రికెటర్ ప్రవీణ్ తాంబే కథ ఈ బయోపిక్. తన కెరీర్ ముగిసిన సమయంలో కూడా కొత్త దిశను ఏర్పరచుకున్న అతని ప్రయాణం చాలా మందికి స్ఫూర్తి. ఈ సినిమా కూడా స్పోర్ట్స్ లవర్స్ కి బాగా నచ్చుతుంది. ఈ బయోపిక్‌లు కేవలం సినిమాలు కాదు.. నిజ జీవితాల నుంచి తీసుకున్న పాఠాలు. జియో హాట్‌స్టార్‌లో ఉచితంగా లేదా సబ్‌స్క్రిప్షన్‌తో చూడవచ్చు.

Tags

Related News

వీళ్ళకు చావులేదు… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న హై-వోల్టేజ్ ఫాంటసీ యాక్షన్ సీక్వెల్

సముద్రం ఎడారిగా మారితే ? మనిషి మాంసం కోసం అగాధపు జీవుల అరాచకం… థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్

ZEE5లో సెప్టెంబర్ సినిమాల జాతర… మైండ్ బ్లాక్ చేసే మల్టీ-లాంగ్వేజ్ మూవీస్ సిరీస్ల లిస్ట్

1300 కోట్ల థ్రిల్లర్ తెలుగులో… కేక పుట్టిస్తున్న మైండ్ బ్లాక్ క్రైమ్ కామెడీ

2600 కోట్ల కలెక్షన్లు… 7.9 IMDb రేటింగ్… తెలుగులో అందుబాటులో ఉన్న ఆల్ టైమ్ క్లాసిక్ మిస్టరీ థ్రిల్లర్

ఈ వారం ఓటీటీలో పండగే పండగ… తెలుగులో ఏకంగా 6 సూపర్ హిట్ సినిమాలు

ఫ్రెండ్స్‌తో చూస్తే పొట్టచేక్కలవ్వాల్సిందే… పిచ్చి పిచ్చి గొడవలతో నవ్వించే కామెడీ డ్రామా

ఎఫైర్ ను అడ్డం పెట్టుకుని ఇదేం పాడుపని ? ప్రతీ నిమిషం నెయిల్ బైటింగ్ సస్పెన్స్

Big Stories

Advertisement
×