BigTV English

Dude OTT : ‘డ్యూడ్’ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Dude OTT : ‘డ్యూడ్’ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
Advertisement

Dude OTT : తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ గురించి ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలో తెగ మాట్లాడేసుకుంటున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఈ హీరో ఈమధ్య నటిస్తున్న చిత్రాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. డైరెక్టర్ నుంచి హీరోగా మారిన ప్రదీప్ రంగనాథన్ ఇప్పటివరకు చేసిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటుగా కలెక్షన్లతో వరుసగా రికార్డులను బ్రేక్ చేశాయి. డ్యూడ్ చిత్రము థియేటర్లలో సక్సెస్ఫుల్ టాక్ తో రన్ అవుతుంది. అలాగే రిలీజ్ అయిన కేవలం ఐదు రోజుల్లోనే ఈ సినిమా బొంద కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశం కూడా ఉందని సినీ వర్గాల్లో అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న ఈ సినిమా ఓటీటీ లోకి ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది..


డ్యూడ్ ఓటీటీ డేట్ లాక్..? 

దీపావళి సందర్భంగా బోలెడు సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలలో ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ మూవీ కూడా ఒకటి. ప్రస్తుతం ఈ సినిమానే దీపావళి విన్నర్ గా నిలిచింది. అతి త్వరలోనే వంద కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశం కూడా ఉంది.. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా యూత్‌ను ఈ మూవీ కట్టిపడేస్తుంది. ఇక ఈ సినిమాను దర్శకుడు కీర్తిశ్వరన్ తెరకెక్కించిన తీరు ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. ఇక మూవీ ఓటీటీ డేట్ పై ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ భారీ రేటుకు దక్కించుకుంది. దీంతో ఈ సినిమాను నవంబర్ 14న ఓటీటీ స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చేందుకు నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ రిలీజ్ డేట్ పై ఒక ప్రకటన రాబోతుందని సమాచారం..

Also Read : వెంకీకి జోడిగా స్టార్ హీరోయిన్… గురూజీ ప్లాన్ అదిరింది బాసూ..


డ్యూడ్ కలెక్షన్స్ విషయానికొస్తే.. 

ప్రేమలు హీరోయిన్ మమిత బైజు, ప్రదీప్ రంగనాథన్ హీరో, హీరోయిన్లు గా నటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వై రవిశంకర్, నవీన్ యెర్నెనీ ఈ సినిమాను నిర్మించారు. ఇందులో శరత్ కుమార్, హ్రిదు హరూన్, డ్రావిడ్ సెల్వమ్, సత్య, రోహిణి, ఐశ్వర్య శర్మలు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.. 120 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన డ్యూడ్ చిత్రానికి కలెక్షన్ల వర్షం కురుస్తుంది. బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ఈ సినిమాకి ప్లస్ గా మారింది. రోజురోజుకీ కలెక్షన్లు పెరుగుతూనే వస్తున్నాయి. ఇదే జోరును కొనసాగిస్తే అతి త్వరలోనే 150 కోట్లు వసూలు చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు.. మరి ఓటీటీలోకి వచ్చేలోపు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి..

Related News

OTT Movie : ఏం సీన్లు గురూ… చలికాలంలోనూ చెమటలు పట్టించే స్టోరీ… పెద్దలకు మాత్రమే మావా

OTT Movie : హైస్కూల్ అమ్మాయిల వెంటపడే పిశాచి… ఈ మూవీని చూడాలంటే హనుమాన్ చాలీసా పక్కనుండాల్సిందే

OTT Movie : ఎనిమీతోనే బెడ్ షేర్ చేసుకునే అరాచకం… అల్టిమేట్ డేర్… ట్విస్టులతో పిచ్చెక్కించే సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : ఆ రూమ్ లోకి అడుగు పెడితే రెచ్చిపోయే అమ్మాయిలు… ప్రాణాంతకమైన ఉచ్చులోకి లాగే మిస్టరీ… స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : నెక్స్ట్ డోర్ క్రైమ్స్… ప్రతీ మర్డర్ కేసులో ఊహించని టర్నులు, ట్విస్టులు… నరాలు తెగే ఉత్కంఠ

OTT Movie : హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయి అరాచకం… ఆ సీన్లే హైలెట్ భయ్యా… దిమాక్ కరాబ్ క్లైమాక్స్

OTT Movie : రియాలిటీ షోలో ఛాన్స్… ఎంత మోసం చేస్తే అంత డబ్బు… ప్రతీ 5 నిమిషాలకు ట్విస్ట్ ఉన్న థ్రిల్లర్

Big Stories

×