Venkatesh : టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.. ఈ సినిమా తర్వాత ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తారని ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనిలో ఉంది. గురూజీ ఈ సినిమాలలో హీరోయిన్లకు ప్రత్యేకత ఉంటుంది. అయితే ఈ సినిమాలో కూడా హీరోయిన్గా ఎవరిని సెలెక్ట్ చేస్తారు అన్న ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ టాపిక్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఈ మూవీకి హీరోయిన్ని ఫైనల్ చేసినట్లు సమాచారం. ఆ హీరోయిన్ ఎవరు కాస్త వివరంగా తెలుసుకుందాం..
హీరో వెంకటేష్ సినిమాలకు ప్రత్యేకత ఉంటుంది. ఈ సినిమాలలో నటించే నటీనటులతో పాటుగా హీరోయిన్ పై కూడా జనాలు ఎక్కువగా ఫోకస్ పెడతారు. ప్రస్తుతం త్రివిక్రమ్ కాంబినేషన్లో వెంకటేష్ సినిమా చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా గురూజీ కేజీఎఫ్ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్ గా నటించబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.. ఆమె బర్త్ డే సందర్బంగా శ్రీనిధి శెట్టి పోస్టర్‌ను ట్విటర్ ద్వారా పంచుకున్నారు. కేజీఎఫ్ తర్వాత టాలీవుడ్‌లో నాని హిట్- 3, ఇటీవలే విడుదలైన సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా సినిమాలతో మెప్పించింది.. మరి ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి..
Also Read : క్యాబ్ డ్రైవర్ గా ధీరజ్.. ప్రేమ నమ్మకమే నిజం అవుతుందా..? శ్రీవల్లికి టెన్షన్.. టెన్షన్..
మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలలో హీరోయిన్లకు చాలా స్పెషల్ అప్పియరెన్స్ ఉంటుంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నిటిలో కొత్త హీరోయిన్లతో చేసిన సినిమాలు మంచి సక్సెస్ ను అందుకున్నాయి. ఇక వెంకీ కూడా యంగ్ హీరోయిన్లతో జత కడుతూ సక్సెస్ఫుల్ చిత్రాలలోని నటిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.. వాళ్లు వయసులో చిన్నవాళ్ళైనా సరే వెంకటేష్ తో పోటీపడి మరి నటించారు. మరి శ్రీనిధి శెట్టి వెంకటేష్ కి జోడిగా ఎలా మెప్పిస్తుందో అని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే గురూజీ ఈ సినిమాకు డిఫరెంట్ టైటిల్ ని ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రెండు మూడు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. మరి వాటిలో అందరికీ క్యాచీగా అనిపించే టైటిల్ ని గురూజీ ఫిక్స్ చేస్తారేమో చూడాలి. వెంకటేష్ 77వ సినిమాగా ఈ సినిమా రాబోతుంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పై ఈ మూవీని నిర్మిస్తున్నారు.. త్వరలోనే ఈ సినిమా గురించి పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.