BigTV English

OTT Movie : జుట్టు పట్టుకుని కొట్టుకునే తల్లీకూతుర్లు… అపర కుబేరులే కానీ అంతులేని వింతలున్న ఫ్యామిలీ

OTT Movie : జుట్టు పట్టుకుని కొట్టుకునే తల్లీకూతుర్లు… అపర కుబేరులే కానీ అంతులేని వింతలున్న ఫ్యామిలీ

OTT Movie : ఒక అమెరికన్ వెబ్ సిరీస్ యూత్ ని తెగ అట్రాక్ట్ చేస్తోంది. ఇది అట్లాంటాలోని రెండు బిలియనీర్ కుటుంబాల చుట్టూ తిరుగుతుంది. కుట్రలు, కుతంత్రలు, ప్రేమ, మోసాలతో ఉన్న ఈ సిరీస్ ని చూడటానికి, ఆడియన్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 5 సీజన్లు, 108 ఎపిసోడ్స్ తో ఇది కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తోంది. మరెందుకు ఆలస్యం, ఈ సుదీర్ఘమైన సిరీస్ ని చూసి ఎంజాయ్ చేయండి. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


ఏ ఓటీటీలో ఉందంటే

‘డైనస్టీ’ (Dynasty) అమెరికన్ సోప్ ఓపేరా డ్రామా వెబ్ సిరీస్. దీనిని సాలీ ప్యాట్రిక్, స్టెఫానీ సేవేజ్, జాష్ ష్వార్ట్జ్ రూపొందించారు. ఇది మొత్తం 5 సీజన్లు, 108 ఎపిసోడ్స్ తో వచ్చింది.  ప్రతి ఎపిసోడ్ 42 నిమిషాలతో, ఈ సిరీస్ IMDbలో 7.4/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ ల్ లో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

ఈ సిరీస్ క్యారింగ్టన్ కుటుంబంతో మొదలవుతుంది. బ్లేక్ క్యారింగ్టన్ ఒక బిలియనీర్. తన కంపెనీలో పని చేసే క్రిస్టల్ ఫ్లోరెస్ ను వివాహం చేసుకోవడానికి సిద్ధపడతాడు.అయితే అతని కూతురు ఫాలన్ ఈ వివాహాన్ని వ్యతిరేకిస్తుంది. క్రిస్టల్‌ డబ్బుకోసమే ఈ పెళ్లి చేసుకుంటోందని భావిస్తుంది. ఫాలన్ తన తండ్రి కంపెనీలో CEO పదవి కోరుకుంటుంది. కానీ బ్లేక్ ఆమెకు బదులు మరో వ్యక్తిని ఎంచుకుంటాడు. ఫాలన్ కోపంతో బ్లేక్ శత్రువు జెఫ్ కాల్బీతో చేతులు కలిపి, తన తండ్రి కంపెనీపై రివెంజ్ ప్లాన్ వేస్తుంది. ఇదే సమయంలో బ్లేక్ కొడుకు స్టీవెన్, క్రిస్టల్ మేనల్లుడు సామ్ తో ప్రేమలో పడతాడు. అంటే స్టీవెన్ ఒక గే అన్నమాట. ఇప్పుడు ఈ కుటుంబంలో రహస్యాలు బయటపడతాయి. బ్లేక్ అవినీతి, క్రిస్టల్ గతం గురించి ట్విస్ట్‌లు వస్తాయి.


సీజన్ 1లో ఫాలన్ తన సొంత కంపెనీ స్టార్ట్ చేస్తుంది. కానీ ఆమె ప్లాన్‌లు కుటుంబాన్ని ఇబ్బంది పెడతాయి. సీజన్ 2లో బ్లేక్ మాజీ భార్య అలెక్సిస్ తిరిగి వచ్చి కుటుంబంలో గందరగోళం సృష్టిస్తుంది. ఆమె ఫాలన్, స్టీవెన్‌లతో గొడవ పడుతుంది. బ్లేక్‌తో మళ్లీ సంబంధం కోరుకుంటుంది. ఇప్పుడు క్రిస్టల్ గత రహస్యాలు (డ్రగ్ డీలర్స్‌తో లింక్) బయటపడతాయి. దీంతో ఆమెను బ్లేక్‌ కాస్త దూరంగా ఉంచుతాడు. ఫాలన్ తన కొత్త బాయ్‌ఫ్రెండ్ లియామ్ రిడ్లీతో ప్రేమలో పడుతుంది. కానీ అతని గురించి కూడా కథలో ట్విస్ట్‌లు వస్తాయి. ఇక జెఫ్ కాల్బీ తన సోదరి మోనికా కలిసి క్యారింగ్టన్ ఎంపైర్‌ను దెబ్బతీయాలని ప్లాన్ చేస్తాడు.

స్టీవెన్, సామ్ పెళ్లి చేసుకుంటారు. కానీ స్టీవెన్ మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ కుటుంబాన్ని వదిలిపెడతాడు. ఈ సీజన్‌లో బ్లేక్ కంపెనీ ఫైనాన్షియల్ సమస్యలు, మర్డర్ మిస్టరీలు, బ్లాక్‌మెయిల్‌లు ఉంటాయి. సీజన్ 3-5లో డ్రామా మరింత ఇంటెన్స్ అవుతుంది. బ్లేక్ ఒక మర్డర్ కేస్‌లో జైలుకు వెళతాడు. కానీ తన పలుకుబడితో బయటకు వస్తాడు. కాల్బీ కుటుంబం క్యారింగ్టన్ ఎంపైర్‌ను టేకోవర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఇప్పుడు ఫాలన్ తన తెలివితో ఈ కుట్రను అడ్డుకుంటుంది. ఈ సిరీస్ ముగింపులో ఫాలన్ కంపెనీ CEO అవుతుంది. బ్లేక్ తన కుటుంబాన్ని గాడిలో పెట్టుకుంటాడు. ఈ సిరీస్ ఇలా ముగుస్తుంది.

Read Also : పెళ్లి కోసం అల్లాడే సాఫ్ట్వేర్… చక్కిలిగింతలు పెట్టే కన్నడ కామెడీ మూవీ

Related News

OTT Movie : పెళ్లి కాకుండానే టీనేజ్ అమ్మాయి ప్రెగ్నెంట్… చదువుకోవాల్సిన వయసులో ఇవేం పిచ్చి పనులు పాపా ?

OTT Movie : కన్న తల్లిని కడుపులో నుంచే తినేసే పిల్ల రాక్షసి… డాక్టర్ కు కూడా చుక్కలు చూపించే సైతాన్

OTT Movie : చావును ముందే పసిగట్టే యాప్… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… మైండ్ బెండయ్యే ట్విస్టులు

OTT Movie : భర్తపోయి బాధపడుతున్న అమ్మాయితో ఇదెక్కడి దిక్కుమాలిన పని ? సైకోకు అమ్మాయి ఇచ్చే షాక్ హైలెట్ భయ్యా

OTT Movie : పెళ్లి రోజే కాబోయే భర్త జంప్… మతి మరుపుతో ప్రియుడు కూడా… ఓటీటీలో దుమ్ము లేపుతున్న సరికొత్త లవ్ స్టోరీ

OTT Movie : మొగుడి మీద అనుమానం… మరో అమ్మాయిని భర్త రూమ్ లోకి పంపి… ఈ స్టోరీ మైండ్ బ్లోయింగ్

OTT Movie : 38 ఏళ్ళ ఆంటీతో 20 ఏళ్ళ అబ్బాయి… స్టూడెంట్ తోనే పని కానిచ్చే కథ… సింగిల్స్ కు పండగే

Big Stories

×