BigTV English

Bengaluru Crime: బెడ్ రూమ్‌లో కెమెరా పెట్టి.. విదేశీయులతో ఆ పని చేయాలంటూ భార్యపై భర్త ఒత్తిడి, చివరికి…

Bengaluru Crime: బెడ్ రూమ్‌లో కెమెరా పెట్టి.. విదేశీయులతో ఆ పని చేయాలంటూ భార్యపై భర్త ఒత్తిడి, చివరికి…

Bengaluru Horror:

సమాజం రోజు రోజుకు మరింత దిగజారిపోతుంది. ఎవరిని నమ్మాలో? ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. బజారులో పోకిరీలే కాదు, కట్టుకున్న భర్తలు కూడా ఆడదాని శీలంతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా బెంగళూరులో ఇలాంటి కేసు బయటకు వచ్చింది. ఓ మహిళ ఏకంగా తన భర్త మీద షాకింగ్ కామెంట్స్ చేసింది. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ఈ ఫిర్యాదును చూసి పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇంతకీ ఆమె తన ఫిర్యాదులో ఏం చెప్పిందంటే..


బెడ్ రూమ్ లో కెమెరా పెట్టి.. ఆ పని చేయాలంటూ..

బెంగళూరుకు మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సంచలన విషయాలు వెల్లడించింది. తమ ప్రైవేట్ దృశ్యాలను రికార్డ్ చేయడానికి బెడ్ రూమ్ తన భర్త రహస్యంగా కెమెరాను అమర్చాడని చెప్పింది. ఆ వీడియోలను చూపించి తనను బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టినట్లు వివరించింది. విదేశాల్లో ఉన్న తన క్లయింట్లతో శారీరక సంబంధం పెట్టుకోవాలని  ఒత్తిడి చేసినట్లు వెల్లడించింది. ఈ ఫిర్యాదుకు సంబంధించి పుట్టెనహళ్లి పోలీస్ స్టేషన్‌ లో కేసు నమోదు అయ్యింది. కుట్ర, వేధింపుల ఆరోపణల ఆధారంగా సదరు మహిళ భర్త సయ్యద్ ఇనాముల్ హక్తో పాటు మరో ముగ్గురు వ్యక్తుల మీద FIR ఫైల్ చేశారు.

భార్యతో ఉన్న ప్రైవేట్ వీడియోలను ఫ్రెండ్స్ కు పంపి..

ఇక బెడ్ రూమ్ వీడియోలను సయ్యద్ తన భర్త ఫ్రెండ్స్ కు పంపినట్లు బాధితురాలు పోలీసులకు చెప్పింది. తాను చెప్పినట్లు వినకపోతే, ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదరించినట్లు వెల్లడించింది. “నా భర్త నాకు తెలియకుండా బెడ్ రూమ్ లో సీక్రెట్ కెమెరా పెట్టాడు. మేం కలిసి ఉన్న వీడియోలను చిత్రీకరించాడు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఫోటోలు, వీడియోలు కూడా రికార్డు చేశాడు. వాటిని విదేశాలలో ఉన్న  తన స్నేహితులతో పంచుకున్నాడు. అంతేకాదు, వారితో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేశాడు. చెప్పినట్లు వినకపోతే ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు” అని బాధితురాలు తన ఫిర్యాదులో వెల్లడించింది.


Read Also: సరస్సులో పర్యాటకుల పడవ ప్రయాణం.. ఒక్కసారిగా దూసుకొచ్చిన ఏనుగు..

మోసం చేసి పెళ్లి చేసుకున్న సయ్యద్!

ఇక సయ్యద్ కు ముందే ఒక పెళ్లి అయ్యింది. తన మొదటి పెళ్లి విషయాన్ని బాధితురాలి దగ్గర దాచిపెట్టి, ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజుల పాటు తనతో సరిగానే కాపురం చేశాడు. ఆ తర్వాత అతడి అసలు స్వరూపం బయటపెట్టాడు. శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. చివరకు బెడ్ రూమ్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టి, ప్రైవేట్ వీడియోస్ తీసి వేధింపులకు దిగాడు. తాజాగా ఆమె ఫిర్యాదు చేయడంతో పుట్టెనహళ్లి పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు మొదలు పెట్టారు.

Read Also: భలే ఆఫర్.. బికినీలో వస్తే పెట్రోల్ ఉచితం, ఆ తర్వాత జరిగింది తెలిస్తే నవ్వు ఆగదు!

Related News

Viral Video: మీకు మిక్చర్ అంటే బాగా ఇష్టమా? ఆ టేస్ట్‌కు కారణం ఇదే.. తింటే పోవడం పక్కా!

Free Fuel: భలే ఆఫర్.. బికినీలో వస్తే పెట్రోల్ ఉచితం, ఆ తర్వాత జరిగింది తెలిస్తే నవ్వు ఆగదు!

Viral News: చెక్కు మీద ప్రిన్సిపల్ రాసింది చూసి.. అంతా అవాక్కు, వీడి చదువు తగలెయ్య!

Nun Garba Dance: ‘నన్’ వేషంలో గర్బా డ్యాన్స్.. నెట్టింట వీడియా వైరల్.. ఇదేం పైత్యమంటూ కామెంట్స్

Watch Video: సికింద్రాబాద్ స్టేషన్‌లో రైలు నుంచి జారిపడ్డ ప్రయాణీకుడు.. కానిస్టేబుల్ చేసిన పనికి అంతా షాక్!

Indian Arrested: నేరం చేసిన 20 ఏళ్లకు అరెస్ట్.. అమెరికాలో భారతీయుడికి ఊహించని షాక్!

Viral Video: సంస్థలు వేరైనా అందరూ ఒక్కటై.. గర్బా డ్యాన్స్ తో అదరగొట్టిన ఫుడ్ డెలివరీ బాయ్స్.. నెట్టింట వీడియో వైరల్!

Big Stories

×