OTT Movie : ‘ఎంకి పెళ్ళి సుబ్బు చావుకొచ్చింది’ ఈ సామెత ఏదో ఒక సన్నివేశంలో వాడుతుంటాం. అయితే ఒక కన్నడ సినిమాకి, ఈ సామెత కరెక్ట్ గా మాచ్ అవుతుంది. ఇందులో హీరో పెళ్ళి కోసం తపించి పోతుంటాడు. అయితే అతని పెళ్ళి రకరకాల కారణాలతో వాయిదా పడుతుంటుంది. చివరికి అతనికి పెళ్ళి జరుగుతుందా ? బ్రహ్మ చారిగా ఉండిపోతాడా ? అనేది కథ క్లైమాక్స్ లో తెలుస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘ఉండెనామ’ 2023లో విడుదలైన కన్నడ కామెడీ చిత్రం. కె.ఎల్. రాజశేఖర్ దీనికి దర్శకత్వం వహించారు. కొమల్ కుమార్, ధన్యా బాలకృష్ణ, తబ్లా నాని, హరీష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఏసినిమా ఏప్రిల్ 14, 2023న థియేటర్లలో విడుదలైంది. సుమారు 2 గంటల 7 నిమిషాల రన్‌టైమ్ తో IMDbలో 6.7/10 రేటింగ్ పొందింది. ఇది 2023 జూన్ 2 నుంచి SunNXTలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ కథ కర్ణాటకలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో ప్రారంభమవుతుంది. వెంకటేష్ అలియాస్ వెంకీ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తుంటాడు. అతనికి త్వరగా వివాహం చేసుకోవాలనే తపన ఉంటుంది. కానీ అతని తండ్రి ఒక జ్యోతిష్యుడు కావడంతో జాతకం ఆధారంగా ప్రతి అమ్మాయిని రిజెక్ట్ చేస్తుంటాడు. దీంతో వెంకీ నిరాశలో మునిగిపోతాడు. ఎందుకంటే అతని వయసు కూడా పెరగిపోతుంటుంది. మరో పక్క స్నేహితులు కూడా వివాహం చేసుకుని సెటిల్ అవుతున్నారు. కానీ అతను ఇంకా ఒంటరిగానే ఉంటాడు.
ఈ సమయంలో వెంకీ ఒక అసాధారణ నిర్ణయం తీసుకుంటాడు. అతను దివ్య అనే ఒక అమ్మాయిని తప్పుదోవ పట్టించి, వివాహం చేసుకోవాలని ప్లాన్ చేస్తాడు. వెంకీ తన స్నేహితుల సహాయంతో ఒక పథకం వేస్తాడు. దివ్యను ఒప్పించి వివాహం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అయితే అతని ప్లాన్ అనుకున్నంత సులభంగా జరగదు. దివ్య తన జీవిత లక్ష్యాలు, కుటుంబ బాధ్యతలతో బిజీగా ఉంటుంది. అంతేకాకుండా వెంకీ ప్రవర్తన ఆమెకు అనుమానాస్పదంగా కనిపిస్తుంది. ఈ గందరగోళంలో ఊహించని ట్విస్ట్‌గా లాక్‌డౌన్ విధించబడుతుంది.
ఈ లాక్‌డౌన్ కారణంగా వెంకీ, దివ్య, వెంకీ స్నేహితులు, ఈ రెండు కుటుంబాలు ఒకే ఇంట్లో చిక్కుకుంటారు. ఇక్కడ నుంచి కథ పూర్తిగా కామెడీ రగడగా మారుతుంది. వెంకీ తన ప్లాన్ దాచడానికి ప్రయత్నిస్తూ, అనేక కామెడీ సన్నివేశాలను సృష్టిస్తాడు. చివరికి వెంకీ పెళ్ళి దివ్యతో జరుగుతుందా ? పెళ్ళి కోసం వెంకీ వేసిన పథకం ఏమిటి ? ఈ పథకం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి ? అనే వియహయాలను, ఈ కన్నడ కామెడీ సినిమాని చూసి తెలుసుకోండి.
Read Also : నాలుగడుగుల అంకుల్ తో ఆరడుగుల ఆంటీ డేటింగ్ …. వద్దంటూనే వదలకుండా ఆ పని … క్లైమాక్స్ వరకు అరుపులే