E-Paper
Advertisement

OTT Movie : అమెరికాలో పగ తీర్చుకోవాలనుకునే అచ్చ తెలుగు లేడీ డాన్… కడుపుబ్బా నవ్వించే కామెడీ డ్రామా

OTT Movie : అమెరికాలో పగ తీర్చుకోవాలనుకునే అచ్చ తెలుగు లేడీ డాన్… కడుపుబ్బా నవ్వించే కామెడీ డ్రామా
Advertisement

OTT Movie : ప్రముఖ యాంకర్ ఝాన్సీ లేడి డాన్‌గా నటించిన మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. రివేంజ్ తీర్చుకోవడానికి అమెరికా వెళ్లే స్టోరీతో వచ్చిన ఈ సినిమా, కథా సుధా వీక్లి సిరీస్ లో భాగంగా, విలేజ్ బ్యాక్‌డ్రాప్ లో తెరకెక్కింది. ప్రతివారం ఈటీవీ విన్ ఓటీటీలో ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ కథలు రక రకాల జానర్లలో వస్తున్నాయి. ఈ కథలు ఎక్కువగా స్వచ్చమైన పల్లెటూరి వాతావరణంలో రూపొందుతున్నాయి. ఓటీటీలలోకి వచ్చే సినిమాలతో పాటు, ఈ మినీ సినిమాలు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆదివారం ఝాన్సీ లీడ్ రోల్ లో ఈ కామెడీ సినిమా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. దీని పేరు ఏమిటి ? కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ ఆదివారం (2025 నవంబర్ 16) ఓటీటీలోకి వచ్చిన ఈ తెలుగు కామెడీ సినిమా పేరు ‘ఇగో’ (Ego). యోహిత్ రెడ్డి దర్శకత్వంలో యాంకర్ ఝాన్సీ లేడి డాన్‌గా నటించగా, చరణ్ పెరి, భాను తేజ్ కదిమిసెట్టి, అశోక్ సీపల్లి, అసురఖాళీ పవన్, ఆషిష్ కెన్నెడి, సూర్య గౌడ్, అజయిల్పి కిస్కింద ఇందులో ముఖ్య పాత్రల్లో నటించారు. ఉదయ సద్దాల నిర్మాతగా వ్యవహరించగా బీఎన్ ఆదిత్య సంగీతం అందించారు. ఈ సినిమా ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also : మానసిక రోగం ఉన్న అమ్మాయిపై మనసు… పెళ్లి చేసుకుందాం అనుకుంటే మెంటలెక్కించే ట్విస్ట్

స్టోరీ ఏమిటంటే

సారక్క అనే రౌడీ లేడీ డాన్ గతంలో తనకు చాలా బాధలు కలిగించిన ఒక పాత శత్రువుపై ప్రతీకారం తీర్చుకోవాలని ఎప్పటి నుంచో మనసులో పెట్టుకుని ఉంటుంది. ఆయితే ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో తెలీకుండా ఉంటుంది. అయితే ఆ శత్రువు అమెరికాలో ఉంటాడని ఓరోజు న్యూస్ పేపర్‌లో వచ్చిన ఆర్టికల్ ద్వారా తెలుసుకుంటుంది. ఆ శత్రువు ఇప్పుడు విదేశాల్లో సెటిల్ అయి హాయిగా ఉంటాడు. సారక్క అతన్ని అక్కడికి వెళ్లి పట్టుకోవాలంటే వీసా కావాలి, వీసా కోసం IELTS అనే ఇంగ్లీష్ టెస్ట్ రాయాల్సి వస్తుంది. దీంతో రఫ్ అండ్ టఫ్ గ్యాంగ్‌స్టర్ మహిళ ఇంగ్లీష్ లెర్నింగ్ క్లాసులు జాయిన్ అవుతుంది. ఇక్కడే ఫుల్ కామెడీ మొదలవుతుంది. గ్రామర్ మిస్టేక్స్, ట్యూటర్‌తో గొడవలు, రోజూ ప్రాక్టీస్ చేస్తూ ఈగో వల్ల తప్పులు చేస్తూ ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తుంది. సారక్క చివరికి పరీక్ష క్లియర్ చేసి విదేశాలకు వెళ్తుందా ? శత్రువుపై రివేంజ్ తీర్చుకుంటుంటుందా ? ఇంతకీ వీళ్ళ మధ్య వైరం ఏమిటి ?  అనే విషయాలను, ఈ మినీ మూవీని చూసి తెలుసుకోండి.

Advertisement

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×