BigTV English

OTT Movie: 13 సంవత్సరాల లవ్ స్టోరీ … ప్రియురాలు వేరొకడితో… మామూలుగా లేదబ్బా ఈ స్టోరీ

OTT Movie: 13 సంవత్సరాల లవ్ స్టోరీ … ప్రియురాలు వేరొకడితో… మామూలుగా లేదబ్బా ఈ స్టోరీ

OTT Movie : ఓటిటిలో మలయాళం సినిమాలను మిస్ కాకుండా చూస్తున్నారు మూవీ లవర్స్. సింపుల్ స్టోరీలను చక్కగా పరిచయం చేయడంలో ఈ దర్శకులు ఒక అడుగు ముందే ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో, ఒక పెళ్లి ని ఆపే క్రమంలో మూవీ స్టోరీ తిరుగుతుంది. ఇందులో బాసిల్ జోసెఫ్ తో సహా ప్రముఖ నటులు నటించారు. సినిమా మొత్తం కామెడీతో సరదాగా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…


స్టోరీలోకి వెళితే

కూడంతోండ అనే గ్రామంలో పవిత్రన్ (సూరజ్ వెంజరమూడు), అభిలాష్ (సైజు కురుప్), కిరణ్ (బాసిల్ జోసెఫ్), అమల్ (అశ్విన్ విజయన్) తమ స్నేహితుడు బిబీష్ (అభిరామ్ రాధాకృష్ణన్) రహస్యంగా చంద్రిక (నిరంజన అనూప్)తో వివాహం చేసుకోబోతున్నాడని తెలుసుకుని షాక్ అవుతారు. బిబీష్ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచడంతో, వీళ్ళంతా ఈ పెళ్లి గురించి అసలు విషయాలు తెలుసుకోవాలని అనుకుంటారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, అభి (సైజు కురుప్), చంద్రికను స్కూల్ రోజుల నుండి రహస్యంగా ప్రేమిస్తుంటాడు. దాదాపు పదమూడు సంవత్సరాలుగా వన్ సైడ్ లవ్ చేస్తుంటాడు. చంద్రిక పెళ్లి ఫిక్స్ అయినప్పుడు చాలా బాధపడతాడు. ఈ క్రమంలో  అభి స్నేహితులు ఆమెను అతనితో కలపడానికి, బిబీష్‌ను చెడ్డవాడిగా చూపించే ప్రయత్నం చేస్తారు.


అదే సమయంలో మరో లవ్ స్టోరీ కూడా మొదలౌతుంది.  పవిత్రన్ కూడా చంద్రిక సోదరి సుజినను ప్రేమిస్తాడు. ఆమె సూచనలతో బిబీష్ వివాహానికి ఆటకం కలిగిస్తుంటాడు.  వీళ్ళంతా గ్రూపులుగా మారి ఒకటే లక్ష్యంగా, పెళ్లి ఆపడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ సంఘటనలు గందరగోళాలకు దారి తీసి కడుపుబ్బా నవ్విస్తాయి. చివరికి చంద్రిక ఎవరిని పెళ్లి చేసుకుంటుంది ? బిబీష్ పెళ్లిని ఎందుకు రహస్యంగా చేసుకోవాలనుకుంటున్నాడు ? చివరికి ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మలయాళ కామెడీ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : పిసినారికి 12 కోట్ల లాటరీ… ఈ ఫ్యామిలీ కామెడీకి పొట్ట చెక్కలయ్యేలా ఉందే

 

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ మలయాళ కామెడీ మూవీ పేరు ‘ఎంకిలం చంద్రిక’ (Enkilum Chandrike). 2023 లో విడుదలైన ఈ సినిమాకి ఆదిత్యన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. ఫ్రైడే ఫిల్మ్ హౌస్ బ్యానర్‌పై విజయ్ బాబు దీనిని నిర్మించారు. ఇందులో సూరజ్ వెంజరమూడు, బాసిల్ జోసెఫ్, సైజు కురుప్, అశ్విన్ విజయన్, నిరంజన అనూప్, తన్వి రామ్ ప్రధాన పాత్రలు పోషించారు. మనోరమా మ్యాక్స్ (Mnorama MAX) అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

Related News

OTT Movie : షార్ట్ ఫిలిం పేరుతో బీచ్ కి తీసుకెళ్లి… టీనేజ్ అమ్మాయితో ఆ పని… మస్ట్ వాచ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie :సిటీ జనాల్ని చితగ్గొట్టే డిమాన్స్… సూపర్ హీరోలనూ వదలకుండా దబిడి దిబిడే

OTT Movie : ఈ వారం ఓటీటీలోకి అడుగు పెట్టిన సిరీస్ లు… ఒక్కోటి ఒక్కో జానర్ లో

OTT Movie : తలపై రెడ్ లైన్స్… తలరాత కాదు ఎఫైర్స్ కౌంట్… ఇండియాలో వైరల్ కొరియన్ సిరీస్ స్ట్రీమింగ్ షురూ

OTT Movie : పిల్లోడిని చంపి సూట్ కేసులో… మైండ్ బెండయ్యే కొరియన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

OTT Movie : రెంటుకొచ్చి పక్కింటి అమ్మాయితో… కారు పెట్టిన కార్చిచ్చు… దిమాక్ కరాబ్ ట్విస్టులు సామీ

OTT Movie : అమ్మాయి ఫోన్ కి ఆ పాడు వీడియోలు… ఆ సౌండ్ వింటేనే డాక్టర్ కి దడదడ… మస్ట్ వాచ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : పిల్లల ముందే తల్లిపై అఘాయిత్యం… సైతాన్ లా మారే కిరాతక పోలీస్… క్లైమాక్స్ లో ఊచకోతే

Big Stories

×