BigTV English

Pooja Hegde : రామ్ చరణ్ కు జోడిగా పూజా హెగ్డే.. సినిమా మాత్రం కాదు…

Pooja Hegde : రామ్ చరణ్ కు జోడిగా పూజా హెగ్డే.. సినిమా మాత్రం కాదు…

Pooja Hegde : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. గత కొన్నేళ్లుగా ఈమె ఖాతాలో సరైన హిట్ సినిమా పడలేదు. కానీ ఈమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఒకవైపు ఫ్లాప్ సినిమాలు పలకరిస్తున్నా కూడా.. మరోవైపు కొత్త సినిమాల కోసం దర్శకనిర్మాతలు ఈమె డేట్ నీ లాక్ చేసుకుంటున్నారు. అంటే ఈ అమ్మడు క్రేజ్ ఎంత ఉందో ఊహించవచ్చు.. హిందీ లో ఈమె స్టార్ హీరోలతోనే సినిమాలు చేసింది. కానీ ఒక్కటంటే ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయింది. ఇక రీసెంట్ గా ఈమె తమిళ హీరో సూర్య నటించిన ‘రెట్రో’ లో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే ఈ సినిమా కూడా పూజకు నిరాశనే మిగిలించింది. అయితే ఇప్పుడు ఈమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.


రామ్ చరణ్ కు జోడిగా పూజా హెగ్డే..

టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు కాంబినేషన్లో పెద్ది అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో బిజీగా ఉంది. అయితే ఈ సినిమా గురించి నిత్యం ఏదో ఒక వార్త నెట్టింట వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం ఓ స్టార్ హీరోయిన్ ని మేకర్స్ సంప్రదిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఐటెం సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకోసం ఆమె మూడు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నట్టు సమాచారం. చాలా మంది హీరోయిన్లు సినిమాల్లో పూర్తి స్థాయి రోల్స్ చేసి కూడా ఈ రేంజ్ రెమ్యూనరేషన్ ని అందుకోవడం లేదు. అలా పూజా హెగ్డే కేవలం ఐటెం సాంగ్ కి అందుకుందంటే ఆమె రేంజ్ ఫ్లాప్స్ కారణంగా కొంచెం కూడా తగ్గలేదు.. రామ్ చరణ్ తో కలిసి రంగస్థలంలో ఓ ఐటమ్ సాంగ్ ని చేశారు పూజా హెగ్డే.. ఇప్పుడు మరోసారి ఆ కాంబో రిపీట్ అవ్వడంతో జనాల్లో ఆసక్తి మొదలైంది. ఈ మూవీలో పూజ స్పెషల్ అప్పీయరెన్స్ గా నిలుస్తుంది ఏమో చూడాలి..


Also Read : చిరు ‘విశ్వంభర’ మరింత వెనక్కి.. రిలీజ్ పై క్లారిటీ వచ్చేదెప్పుడో..

పూజా హెగ్డే సినిమాలు.. 

గత రెండు మూడేళ్లుగా పూజ హెగ్డే ఖాతాలో ఒక్క హిట్ సినిమా పడలేదు. చేతిలో హిట్ సినిమా లేకపోయినా పూజ రెమ్యూనిరేషన్ లో మాత్రం వెనక్కి తగ్గట్లేదు. రీసెంట్ గా తమిళ స్టార్ హీరో సూర్య సరసన రెట్రో మూవీలో నటించింది. ఆ మూవీ తమిళ్ లో మంచి టాక్ ను సొంతం చేసుకున్న తెలుగులో మాత్రం డిజాస్టర్ అయింది. పాపం బ్యాడ్ లక్ ఆమెని అలా వెంటాడుతుంది. అయితే ఫ్లాప్స్ లో ఉన్న హీరోయిన్స్ ఒక్కోసారి ఐటెం సాంగ్స్ చేసి మళ్ళీ యూత్ ఆడియన్స్ కి చేరువ అవుతుంటారు. పూజ హీరోయిన్ గా కన్నా ఐటెం పాపగానే ఎక్కువగా కనిపిస్తుంది. మొన్న రజినీకాంత్ నటించిన కూలి సినిమాలో ఐటమ్ సాంగ్ చేసింది. ఇప్పుడు రామ్ చరణ్ తో ఐటెం సాంగ్ చేయబోతుంది. మొత్తానికి హీరోయిన్ కన్నా ఐటెం పాపగా బాగా ఫేమస్ అవుతుంది పూజా హెగ్డే..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×