OTT Movie : కామెడీతో సరదాగా సాగిపోయే సినిమాలను, ఫ్యామిలీతో కలసి చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అందులోనూ మలయాళం సినిమాలను వాలకుండా చూస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మలయాళం సినిమా, కామెడీతో కడుపుబ్బా నవ్విస్తుంది. ఒక లాటరీ టికెట్ ఈ సినిమా స్టోరీని నడిపిస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
కేశు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న డ్రైవింగ్ స్కూల్ యజమాని. తన భార్య రత్నమ్మ, ఇద్దరు పిల్లలు, ముసలి తల్లితో సాధారణ జీవితం గడుపుతుంటాడు. అతని సిస్టర్స్, వాళ్ళ భర్తలు కుటుంబ ఆస్తిలో వాటా కోసం అతన్ని ఇబ్బంది పెడుతుంటారు. కేశు తన తండ్రి మరణం తర్వాత కుటుంబ బాధ్యతలను మోసినందుకు తన తండ్రిని నిందిస్తూ ఉంటాడు.కానీ అతని తల్లి తన భర్త బూడిదను రామేశ్వరంలో నిమజ్జనం చేయమని కోరుతుంది. ఈ క్రమంలో ఆస్తి విభజనపై నిర్ణయం తీసుకునే ముందు, కేశు తన కుటుంబంతో సహా రామేశ్వరం పర్యటనకు బయలుదేరతాడు. ఈ ప్రయాణంలో అతను ఒక లాటరీ టికెట్ ద్వారా 12 కోట్ల రూపాయలు గెలుచుకున్నట్లు తెలుసుకుంటాడు. ఇది అతని జీవితాన్ని ఒక్కసారిగా మార్చేస్తుంది. అయితే, ఈ విషయం తన స్వార్థపరులైన బంధువులకు తెలియకుండా ఉంచాలని కేశు నిర్ణయించుకుంటాడు. తన భార్య, పిల్లలతో కలిసి రహస్యంగా తప్పించుకోవాలని ప్లాన్ చేస్తాడు.
కానీ అతని కుమార్తె ఉషకు విషయం తెలిసి, తన ప్రియుడికి సమాచారం ఇవ్వడంతో ఈ ప్లాన్ విఫలమవుతుంది. వారు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, కేశు లాటరీ గెలిచిన విషయం ఊరంతా తెలిసిపోతుంది. అయితే కేశు తన గెలిచిన లాటరీ టికెట్‌ను కోల్పోయినట్లు గుర్తిస్తాడు. దీంతో రత్నమ్మ షాక్‌లో మాటలు కోల్పోతుంది. ఈ గందరగోళంలో, కేశు తన మాజీ ప్రేయసి లీల గురించి గుర్తు చేసుకుంటాడు. దీనితో రత్నమ్మ అతనిపై అనుమానం పెంచుకుంటుంది. ఇంతలో కేశు సిస్టర్స్, బావమరిదులు లాటరీ టికెట్ కోసం అనేక ప్రయత్నాలు చేస్తారు. చివరకు ఆ లాటరీ టికెట్ దొరుకుతుందా ? అతని కష్టాలు తీరుతాయా? అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : క్షణక్షణానికో ట్విస్ట్, ఊహించని టర్న్స్… ఈ సిరీస్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లవర్స్ కి విజువల్ ఫీస్ట్
జియో హాట్ స్టార్ (Jio hotstar) లో
ఈ మలయాళ కామెడీ మూవీ పేరు ‘కేశు ఈ వీడింటే నాథన్’ (Keshu Ee Veedinte Nadhan). 2021లో విడుదలైన ఈ సినిమాకి నదీర్షా దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో దిలీప్ ప్రధాన పాత్రలో నటించగా, ఊర్వశి, నస్లెన్, కలభవన్ షాజోన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా కేశవన్ అనే 60 ఏళ్ల డ్రైవింగ్ స్కూల్ ని నడిపే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. థియేటర్ లలో ఈ సినిమాను విడుదల కోసం ప్లాన్ చేసినప్పటికీ, కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఓటీటీ లో నేరుగా విడుదలైంది. జియో హాట్ స్టార్ (Jio hotstar) లో ఈ మూవీ స్ట్రీమింగ్ వుతోంది.