E-Paper
Advertisement

OTT Movie : రిటైర్డ్ ఏజ్ లో పడుచు పిల్లతో పెళ్లి… కడుపుబ్బా నవ్వించే తెలుగు కామెడీ డ్రామా

OTT Movie : రిటైర్డ్ ఏజ్ లో పడుచు పిల్లతో పెళ్లి… కడుపుబ్బా నవ్వించే తెలుగు కామెడీ డ్రామా
Advertisement

OTT Movie : ‘అల్లరి’ సినిమాతో దర్శకుడిగా తన కంటూ ప్రత్యేకమైన గర్తయింపును తెచ్చుకున్నాడు రవిబాబు. నటుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. చాలా గ్యాప్ తరువాత ఓటీటీ కోసం ఓ కామెడీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘ఏనుగు తొండం ఘటికాచలం’ అనే పేరుతో ఈ సినిమాని కడుపుబ్బా నవ్వించే కామెడియన్స్ తో తెరకెక్కించాడు. ఈ రోజు నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా, టైటిల్ డిఫరెంట్ గా ఉండటంతో ఆడియన్స్ కూడా చూసేందుకు ఎగబడుతున్నారు. ఈ కథ రిటైరైన తర్వాత ఓ ముసలాయన, ఒక పడుచు అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కానీ అతని పిల్లలు అతన్ని డబ్బు కోసం చంపాలను కుంటారు. ఈ ట్రాక్ ని రవిబాబు తనదైన కామెడీ స్టైల్ లో నడిపించాడు. ఇది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

రవిబాబు దర్శకత్వమలో వచ్చిన ‘ఏనుగుతొండం ఘటికాచలం’ (Enuguthondam Ghatikachalam) మూవీ ఈటీవీ విన్ లో నవంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో నరేష్ వీకే, వర్షిణి సౌందరరాజన్, అలీ, రఘుబాబు, శ్రీకాంత్ అయ్యంగార్, కృష్ణ భ‌గ‌వాన్‌ వంటి హాస్య నటులు నటించారు. ఈటీవీ విన్ వరుసగా ఒరిజినల్ సిరీస్, సినిమాలతో ఓటీటీలో సందడి చేస్తోంది. 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్, కానిస్టేబుల్ కనకం సిరీస్ లు ఇప్పటికే ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. ఇప్పుడు ఫుల్ కామెడీ జానర్ లో వచ్చిన ఈ కామెడీ సినిమా, ఆడియన్స్ కి ఒక టానిక్ లా పనిచేస్తుంది.

Advertisement

Read Also : హాంటెడ్ బంగ్లాలో పోలీస్ స్టేషన్… పోలీసులను పారిపోయేలా చేసే దెయ్యం… క్రేజీ మలయాళ మిస్టరీ థ్రిల్లర్

కథలోకి వెళ్తే

ఒక రిటైర్డ్ ఎంప్లాయి అయినటువంటి ఘటికాచలం ఒంటరిగా బాధపడుతుంటాడు. అతని డబ్బు కోసమే కొడుకులు, కూతురు అతనితో మాట్లాడుతున్నారని గ్రహిస్తాడు. ఇక తండ్రిని చంపితే ఇన్యూరెన్స్ డబ్బులు తీసుకొవచ్చనే ఆలోచనలో పుత్ర రత్నాలు ఉంటారు. ఈ సమయంలో ఘటికాచలం తాను మళ్లి పెళ్లి చేసుకుంటానని అందరికీ షాకిస్తాడు. అనుకున్నట్లే తనకంటే ఎంతో వయసు తక్కువైన అమ్మాయితో పెళ్లి కూడా జరిగిపోతుంది. అయితే మరో షాకింగ్ ట్విస్ట్ వసుంది. పెళ్లి తర్వాత ఘటికాలం కనిపించకుండా పోతాడు. మరో వైపు అతని సంతానం ఇన్యూరెన్స్ డబ్బుల కోసం ప్రయత్నిస్తుంటారు. ఘటికాచలం ఎక్కడున్నాడనేది సస్పెన్స్ గా ఉంటుంది. ఇక క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏమిటి ? ఘటికాచలం మిస్సింగ్ వెనుక ఉన్న సీక్రెట్ ఏమిటి ? అనే విషయాలను, ఈ కామెడీ ఎంటర్టైనర్ సినిమాని చూసి తెలుసుకోండి.

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×