E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Day 67 : రాజు కోసం కింగ్ సైజ్ విందు… ఎట్టకేలకు తీరిన తనూజా కోరిక… పాపం డెమోన్

Bigg Boss 9 Telugu Day 67 : రాజు కోసం కింగ్ సైజ్ విందు… ఎట్టకేలకు తీరిన తనూజా కోరిక… పాపం డెమోన్
Advertisement

Bigg Boss 9 Telugu Day 67 : బిగ్ బాస్ డే 67లో ఎట్టకేలకు తనూజా అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. 10 వీక్స్ తర్వాత కెప్టెన్ గా గెలిచి, హౌస్ లో తన కోరికను నెరవేర్చుకుంది. మరి ఈరోజటి ఎపిసోడ్ లో ఏం జరిగింది? కెప్టెన్సీ టాస్క్ ఏంటి? అనేది వివరంగా తెలుసుకుందాం.

బిగ్ బాస్ హౌస్ లో వారెవ్వా చెఫ్ సందడి 

రాజు, రాణులకు విందు భోజనం ఏర్పాటు చేయడానికి వారెవ్వా చెఫ్ సంజయ్ తుమ్మాను హౌస్ లోకి పంపించారు బిగ్ బాస్. ఆయన పవర్ చెఫ్ ప్రణవ్ తో కలిసి కింగ్స్ నిఖిల్, కళ్యాణ్, క్వీన్ రీతూ చౌదరికి ఘుమఘుమలాడే వెజ్ తో పాటు నాన్ వెజ్ భోజనం వడ్డించారు. రాజు రాణులు తిన్నాక మిగిలింది కమాండర్స్ కు, వాళ్ళు తిన్నాక మిగిలింది ప్రజలకు అంటూ కండిషన్ పెట్టారు బిగ్ బాస్. దీంతో ఇమ్మాన్యుయేల్, సుమన్ శెట్టి మాకెందుకు బిగ్ బాస్ ఇలాంటి శిక్ష? మేమేమన్నా చెత్త కుప్పలో దొరికామా ? అంటూ హడావిడి చేశారు. కానీ చివరికి అందరికీ కడుపు నిండా ఆరగించే ఛాన్స్ వచ్చింది. దీంతో ఆనందంగా చెఫ్ కు బైబై చెప్పారు హౌస్ మేట్స్.

బీబీ రాజ్యంలో రచ్చ

Advertisement

రాజులు, రాణుల తీరుతో అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రజలు పోరాటానికి దిగారు. జనాలంతా తిరుగుబాటు చేయడంతో ఎటూ పాలుపోక కింగ్స్ అండ్ క్వీన్ వాళ్ళ ఆశలను తెలుసుకుని, కష్టాలను తీర్చే పనిలో పడ్డారు. దీంతో దిగొచ్చిన ప్రజలు రాజుకు మూడు షరతులు పెట్టారు. ప్రజలను సమానంగా చూడాలి, కమాండర్లు వాళ్ళ పనులు వాళ్ళే చూసుకోవాలి, రాజ్యంలోకి ఇద్దరు చొప్పున ప్రజల ఎంట్రీ ఉండాలి అన్నవే ఆ కండిషన్స్. ఈ క్రమంలో భరణి, ఇమ్మాన్యుయేల్, గౌరవ్, సుమన్ శెట్టి చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. మొత్తానికి రాణి రాజులు సైతం ఆ కండిషన్స్ కు ఒప్పుకున్నారు. దీంతో కమాండర్లు కూడా తిరుగుబాటు స్టార్ట్ చేశారు. కానీ కింగ్ దిగిరాకపోవడంతో చివరికి వాళ్ళే వచ్చి తమ కష్టాలను మొరపెట్టుకున్నారు. ఆఖరికి దీనికి కారణమైన సుమన్ శెట్టి, ఇమ్మూలకు రాణి పనిష్మెంట్ ఇవ్వడంతో దీనికి ఫుల్ స్టాప్ పడింది.

కొత్త రాణి తనూజా 

రాజు కళ్యాణ్, రాణి రీతూ తమలో ఒకరి స్థానాన్ని రిస్క్ చేసి, గేమ్ ఆడాల్సి ఉంటుంది. గెలిస్తే తమ ప్లేస్ లోనే ఉంటారు. లేదా కమాండర్ గా మారతారు. కళ్యాణ్ గేమ్ ఆడడానికి సిద్ధం కాగా, ప్రజలు అతనితో పోటీ పడడానికి ఇద్దరు కమాండర్లను సెలెక్ట్ చేయాలి అన్నది ట్విస్ట్ ఇక్కడ. కమాండర్లు వెళ్ళి తమను సెలెక్ట్ చేయమని ప్రజలకు రిక్వెస్ట్ పెట్టుకున్నారు. దీంతో ప్రజలు తనూజా, దివ్యను కంటెండర్స్ గా సెలెక్ట్ చేశారు. కానీ ప్రజల్లో ఒక్కరు కూడా డెమోన్ కు సపోర్ట్ చేయలేదు. ‘గత ఏడు వారాల నుంచి నేను అస్సలు కెప్టెన్సీ రేసులో లేను. ఆల్రెడీ కెప్టెన్ అయ్యాను అని అందరూ నన్ను తీసి పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పుడు నాకు సుపోర్ట్ చేస్తే, నేను మీకు నెక్స్ట్ సపోర్ట్ చేస్తాను. ఇంతకన్నా ఏమీ చెప్పలేను” అని మొర పెట్టుకున్నాడు డెమోన్. కానీ ప్రజల్లో గౌరవ్ తప్ప ఒక్కరు కూడా తనను సపోర్ట్ చేయకపోవడంతో తెగ బాధ పడ్డాడు. అంతేకాకుండా “నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు” అంటూ అందరినీ ప్రశ్నించాడు.

Advertisement

ఇక కళ్యాణ్ తనకు పోటీగా తనూజాను ఎంచుకోవడంతో, దివ్య సంచాలక్ అయ్యింది. వీళ్లిద్దరికీ ‘రేస్ అఫ్ ఫ్లోర్’ అనే టాస్క్ పెట్టారు బిగ్ బాస్. ఒక్కొక్కరూ తమికిచ్చిన క్యూబ్స్ ను తీసుకుని, ఫ్లోర్ స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు పుష్ చేయాలి. తరువాత ఫ్రేమ్స్ లో కింద నుంచి పైవరకు సేమ్ కలర్ లేకుండా చూసుకోవాలి. ఈ టాస్క్ లో తనూజా విన్ అయ్యి, కొత్త రాణిగా నిలిచింది.

Read also : మరో అమ్మాయితో అడ్డంగా బుక్కయ్యే కాబోయే భర్త… ఆమె ఇచ్చే షాక్ కు బుర్రపాడు… లవర్స్ డోంట్ మిస్

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×