BigTV English
Advertisement

This Week Releases: సినీ లవర్స్‌కు పండగే.. అక్టోబర్ తొలి వారంలో అరడజను సినిమాలు వచ్చేస్తున్నాయ్!

This Week Releases: సినీ లవర్స్‌కు పండగే.. అక్టోబర్ తొలి వారంలో అరడజను సినిమాలు వచ్చేస్తున్నాయ్!

This Week Releases: సెప్టెంబర్ చివరి వారంలో యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ నటించిన ‘దేవర’ విడుదలతో థియేటర్లలో దద్దరిల్లాయి. భారీ అంచనాల మధ్య విడుదవుతున్న ఈ సినిమాతో పోటీ ఎందుకులే అని ఎక్కువగా చిత్రాలు గతవారంలో విడుదలకు ఆసక్తి చూపించలేదు. కేవలం కార్తి హీరోగా నటించిన ‘సత్యం సుందరం’ మాత్రమే ‘దేవర’తో పోటీకి దిగి విజయం అందుకుంది. ఇక అక్టోబర్ మొదటి వారమంతా పలు చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. దాదాపు అరడజను చిన్న సినిమాలను ఒకేసారి సెన్సార్ చేసి వాటికి సర్టిఫికెట్లు అందించింది సెన్సార్ బోర్డ్.


మిస్టర్ సెలబ్రిటీ

రైటర్స్‌గా ఎన్నో ఏళ్ల నుండి టాలీవుడ్‌లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు పరుచూరి బ్రదర్స్. ఇప్పుడు ఈ పరుచూరి ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం కానున్నాడు వారి వారసుడు పరుచూరి సుదర్శన్. తన మొదటి సినిమా ‘మిస్టర్ సెలబ్రిటీ’.. అక్టోబర్ 4న థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యూ/ఏ సెర్టిఫికెట్ ఇచ్చింది. ‘మిస్టర్ సెలబ్రిటీ’లో నాజర్, వరలక్ష్మి శరత్‌కుమార్ లాంటి క్రేజీ యాక్టర్స్ కూడా ఉన్నారు.


Mr Celebrity
Mr Celebrity

రామ్‌నగర్ బన్నీ

ఈవారం విడుదల అవుతున్న ఎన్నో చిన్న సినిమాల్లో కాస్త ఎక్కువ హైప్ క్రియేట్ చేసిన మూవీ ‘రామ్‌నగర్ బన్నీ’. బుల్లితెర మెగాస్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాకర్ వారసుడు చంద్రహాస్ హీరోగా పరిచయవుతున్న ఈ మూవీ ఇప్పటికీ బాగానే బజ్ క్రియేట్ చేసింది. తన కొడుకును హీరోగా లాంచ్ చేయడం కోసం ప్రభాకర్.. నిర్మాతగా మారాడు. ‘రామ్‌నగర్ బన్నీ’ సినిమాకు చాలామంది బుల్లితెర సెలబ్రిటీల సపోర్ట్ ఉంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది.

Ramnagar Bunny
Ramnagar Bunny

కాళి

ఇక మెడికల్ క్రైమ్ థ్రిల్లర్‌తో ఇద్దరు యంగ్ హీరోలు.. ఇతర యంగ్ హీరోలతో పోటీపడడానికి వచ్చేస్తున్నారు. నరేశ్ అగస్త్య, ప్రిన్స్ కలిసి నటించిన సినిమానే ‘కాళి’. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాను అందరూ చూడవచ్చని ‘యూ’ సెర్టిఫికెట్ అందించింది.

Kali
Kali

బహిర్భూమి

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కే కథలకు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. అలాగే ఒక మంచి విలేజ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన చిత్రమే ‘బహిర్భూమి’. సింగర్, ర్యాపర్ అయిన నోయెల్.. ఈ విలేజ్ డ్రామాలో హీరోగా నటించాడు. రామ్ ప్రసాద్ కొండూరు దీనికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా వైలెన్స్, బ్లడ్ బాత్ ఎక్కువగా ఉన్న కారణంగా సెన్సార్ బోర్డ్.. ‘బహిర్భుమి’కి ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చింది.

Bahirbhoomi
Bahirbhoomi

పెట్టా ర్యాప్

ప్రభుదేవా కేవలం డ్యాన్సర్‌గా మాత్రమే కాదు.. దర్శకుడిగా, నటుడిగా, హీరోగా కూడా గుర్తింపు సాధించాడు. ఇక తను డ్యాన్సర్‌గా ఎంత బిజీగా ఉన్నా మధ్యమధ్యలో ఆన్ స్క్రీన్ కనిపించి ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉంటారు. ఇటీవల ఆయన హీరోగా నటించిన ‘పెట్టా ర్యాప్’ సినిమా కూడా అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ప్రభుదేవాకు జోడీగా వేదిక నటించింది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘పెట్టా ర్యాప్’కు సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది.

Petta Rap
Petta Rap

దక్షిణ

అక్టోబర్ 4న ‘పెట్టా ర్యాప్’తో పాటు మరొక డబ్బింగ్ సినిమా కూడా థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది. అదే ‘దక్షిణ’. సాయి ధన్సిక, రిషవ్ బాసు, స్నేహి సింగ్, అంకిత ములేర్, మగ్నా చౌదరీ లీడ్ రోల్స్‌లో నటించిన ‘దక్షిణ’.. తెలుగులో విడుదవుతున్న చిన్న సినిమాలతో పోటీకి దిగడానికి సిద్ధమయ్యింది. ఓషో తులసీరామ్ దీనికి దర్శకత్వం వహించారు. ఇదొక సైకో కిల్లర్ కథ. అందుకే ఈ మూవీలో ఉన్న వైలెన్స్‌కు సెన్సార్ బోర్డ్.. ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చింది.

Dhakshina
Dhakshina

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×