E-Paper
Advertisement

యూఫోరియా సీజన్ 3 క్లైమాక్స్ ఎక్స్ప్లెనేషన్… చివరికి జరిగింది ఇదే

యూఫోరియా సీజన్ 3 క్లైమాక్స్ ఎక్స్ప్లెనేషన్… చివరికి జరిగింది ఇదే
Advertisement

Euphoria Season 3 Ending Explained : నాలుగు సంవత్సరాల వెయిటింగ్ తర్వాత వచ్చిన టీన్ సైకలాజికల్ ‘యూఫోరియా’ సీజన్ 3 చివరి ఎపిసోడ్ ప్రేక్షకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మరి ఈ చివరి సీజన్లో జరిగింది ఏంటి ? క్లైమాక్స్ లో ఏమైంది ? ఈ సిరీస్ ను ఏ ఓటీటీలో చూడొచ్చు ? వంటి విషయాలను తెలుసుకుందాం పదండి.

‘యుఫోరియా’ సీజన్ 3 ఎండింగ్

సామ్ లెవిన్సన్ రూపొందించిన ఈ సైకలాజికల్ డ్రామా ‘యుఫోరియా’ సీజన్ 3 మే 31న ఆదివారం ఫైనల్ ఎపిసోడ్‌ తో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ చివరి ఎపిసోడ్ నలుగురు ప్రధాన పాత్రల మరణంతో షాక్ వేవ్‌ను సృష్టించింది. ‘ఇన్ గాడ్ వి ట్రస్ట్’ అనే టైటిల్‌తో వచ్చిన 90 నిమిషాల ఈ ఎపిసోడ్ సిరీస్ అంతటా నడిపిన ఉద్రిక్తతను షాకిచ్చే ట్విస్ట్ తో ఎండ్ చేసింది. జెండయా పోషించిన రూ బెన్నెట్ పాత్ర ఈ సీజన్‌ లో కూడా భావోద్వేగానికి కేంద్రంగా నిలిచింది. రూ DEAకి సమాచారకర్తగా పని చేస్తూ డ్రగ్స్ అండర్‌ వరల్డ్‌ లో లోతుగా మునిగిపోతుంది. ఆమె గతం ఆమెను వెంటాడి చివరికి విషాదకరమైన ముగింపుకు దారి తీస్తుంది.

Advertisement

ఫైనల్ ఎపిసోడ్‌ లో డ్రగ్ లార్డ్ అలమో రూకి సహాయం చేస్తున్నట్లు నటించి పెర్కోసెట్ సీసా ఇస్తాడు. రూ ఆ మాత్రలు వేసుకుని నిద్రపోతుంది. మరుసటి రోజు అలీ ఆమెను స్పృహ లేని స్థితిలో చూసి షాక్ అవుతుంది. మాత్రల్లో అధిక మోతాదు ఫెంటనైల్ కలిపి ఉందన్న విషయం తెలుస్తుంది. దానివల్లే రూ మరణిస్తుంది. ఈ సన్నివేశం ప్రేక్షకులను తీవ్రంగా కదిలిస్తుంది.

ఇతర పాత్రల విషాద ముగింపు
రూ మాత్రమే కాదు, సీజన్ 3లో మరో ముగ్గురు కీలక పాత్రలు ప్రాణాలు కోల్పోయాయి. నేట్ జాకబ్స్ దారుణమైన మరణం కాసీ, మ్యాడీల జీవితాలను పూర్తిగా మార్చేసింది. ఒకప్పుడు స్నేహితులైన వారు ఇప్పుడు ఒక ఇంట్లో కలిసి నివసిస్తూ, నేట్ మరణం వెనుక ఉన్న రహస్యాన్ని ఎవరికీ తెలియకుండా కాపాడుకోవాలని నిర్ణయించుకుంటారు. లారీ -అలమో కూడా ఈ విషపూరిత సంబంధాలకు బలి అవుతారు.

ఎమోషనల్ ఎండింగ్ – ఆధ్యాత్మిక సందేశం

Advertisement

సిరీస్ చివరి సన్నివేశాలు గాఢమైన ఆధ్యాత్మిక భావనతో ముగుస్తాయి. అలీ రూ గతంలో సందర్శించిన గ్రామీణ కుటుంబం వద్దకు వెళ్తాడు. డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని రూను గౌరవిస్తాడు. దర్శనంలో రూ నవ్వుతూ ప్రత్యక్షమవడం ఆమె చివరకు శాంతిని పొందిందని సూచిస్తుంది. ఈ ముగింపు దుఃఖం, విశ్వాసం, ప్రతీకారం, మోక్షం మధ్య సంఘర్షణను అందంగా చూపిస్తుంది.

నటీనటులు

జెండయా (రూ బెన్నెట్) ఈ సిరీస్‌కు ఎప్పటిలాగే హార్ట్ గా నిలిచింది. హంటర్ షాఫర్, జాకబ్ ఎలోర్డి, సిడ్నీ స్వీనీ, అలెక్సా డెమీ, మాడ్ అపటో, కోల్మన్ డొమింగో వంటి తారాగణం శక్తివంతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కొత్త ముఖాలు కూడా సీజన్ 3లో కీలక పాత్రలు పోషించాయి. ‘యూఫోరియా’ టీనేజ్ జీవితాల్లోని డ్రగ్స్, వ్యామోహం, ట్రామా, ప్రేమ, విశ్వాసఘాతాలను నిర్భయంగా చూపించిన సిరీస్‌గా చరిత్రలో నిలిచిపోయింది. ఈ షాకింగ్ ఫైనల్‌తో సిరీస్ ముగిసినా… దాని ప్రభావం మాత్రం చాలా కాలం మన మనసుల్లో మిగిలిపోతుంది.

ఎక్కడ చూడచ్చో తెలుసా ?

పాపులర్ హాలీవుడ్ టీన్ సైకలాజికల్ డ్రామా సిరీస్, ఇది భారతదేశంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అయిన జియోహాట్‌స్టార్ (JioHotstar) లో ప్రస్తుతం పూర్తి ఎపిసోడ్‌లతో స్ట్రీమింగ్ అవుతోంది. 2026 ఏప్రిల్ 15న ప్రారంభమైన ఈ మూడవ సీజన్ చివరి 8వ ఎపిసోడ్ జూన్ 1న విడుదలవడంతో ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే ముగిసింది. ఇందులో డ్రగ్స్, తీవ్రమైన బోల్డ్ కంటెంట్ ఉన్నందున, దీనిని కేవలం 18+ (పెద్దలు మాత్రమే) చూడాలని సదరు ఓటీటీ సూచించింది.
Tags

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×