E-Paper
Advertisement

Big Tv Kissik Talks : కన్నీళ్లు తెప్పిస్తున్న ప్రియాంక స్టోరీ.. నమ్మి మోసపోయాను..

Big Tv Kissik Talks : కన్నీళ్లు తెప్పిస్తున్న ప్రియాంక స్టోరీ.. నమ్మి మోసపోయాను..
Advertisement

Big Tv Kissik Talks :తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న  టాప్ తెలుగు న్యూస్ ఛానెల్ బిగ్ టీవీ.. జనాలకు నిత్యం వార్తలను అందించడంతో పాటుగా ఎంటర్టైన్ చేయడంలో కూడా ఈ ఛానల్ ముందు ఉంటుంది. ఇప్పటికే ఎన్నో ప్రోగ్రామ్ లను అందిస్తుంది. ఇటీవల ఈ ఛానెల్ కిస్సిక్ టాక్ షోను ప్రారంభించారు.. ఈ షో ని స్టార్ట్ చేసిన అతి కొద్ది రోజుల్లోనే మంచి రెస్పాన్స్ ను అందుకోవడం విశేషం. జబర్దస్త్ యాంకర్ వర్ష ఈ షో కి హోస్టుగా వ్యవహరిస్తున్నారు.. ఇప్పటికే ఎంతోమంది ఇంటర్వ్యూ ఇచ్చారు. తాజాగా ఈ షోకు సీరియల్ హీరోయిన్ ప్రియాంక నల్కారి గెస్ట్ గా వచ్చాడు. ఇందులో తన గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు.. జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం ఇలాంటి విషయాలన్నిటిని ఆమె పంచుకున్నారు. ప్రస్తుతం ఈ షో కి సంబంధించిన ప్రోమో ని బిగ్ టీవీ రిలీజ్ చేసింది.. ఆ ప్రోమోలో ప్రియాంక ఎమోషనల్ స్టోరీని బయటపెట్టి కన్నీళ్లు పెట్టుకుంది.. ఆమె ఎలాంటి విషయాల గురించి పంచుకుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

తమిళ ఇండస్ట్రీలో సక్సెస్..

ఒకప్పుడు తెలుగులో వరుసగా సీరియల్స్ చేసిన ముద్దుగుమ్మ ప్రియాంక ఆ తర్వాత గ్యాప్ తీసుకొని తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అక్కడ వరుసగా సీరియల్స్ చేసి అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. అయితే తెలుగులో రాని గుర్తింపు ఆమెకు తమిళంలో రావడంతో అక్కడే ఎక్కువగా సీరియస్ చేస్తూ ప్రేక్షకులను అలరించింది. అంతే కాదు ఎన్నో సీరియల్స్లలో నటించి అవార్డులను కూడా అందుకున్న విషయాన్ని ఈ షో ద్వారా ఆమె బయట పెట్టింది. తెలుగు ఇండస్ట్రీలు ఇప్పటివరకు నాకు తెలిసి అవార్డులు ఏ సీరియల్కు ఇవ్వలేదు కానీ తమిళ్ ఇండస్ట్రీ మాత్రం నన్ను బాగా గుర్తించింది అని పొగడ్తల వర్షం కురిపించింది. తెలుగులో ఇప్పటికైనా నా టాలెంట్ ని గుర్తించి అవార్డులు ఇస్తారేమో చూడాలి అని ఆమె తన మనసులోని మాటను బయటపెట్టింది.

ప్రేమించి తప్పు చెయ్యొద్దు..

Advertisement

ఈ ముద్దుగుమ్మ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే కొద్ది రోజులకి ఆమె మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్న విషయం కూడా తెలిసిందే. తన విడాకుల గురించి ఈ షోలో బయటపెట్టింది. ఎవరిని గుడ్డిగా నమ్మి ప్రేమించవద్దు. నీకోసం జీవితాంతం నిలబడతానని ప్రామిస్ చేసిన వాళ్ల పై పూర్తి నమ్మకం వచ్చిన తర్వాత ప్రేమించండి అని సలహా ఇచ్చింది. నేను జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఇదే అని ప్రియాంక అన్నారు.

నేను జీవితంలో పెళ్లి చేసుకోను..

ఒకసారి మోసపోయిన తర్వాత మళ్లీ మళ్లీ మోసపోవడానికి నాకు ఓపిక లేదు అని ప్రియాంక తన జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో కష్టాలను, అనుభవించిన బాధలను బయటపెట్టింది. తన జీవితంలో అనుకొని సంఘటన ద్వారా చాలా కృంగిపోయాను అని కన్నీళ్లు పెట్టుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకుని నేను చేసిన తప్పుని ఎవ్వరూ చేయకండి.. ఇక జీవితంలో నా లైఫ్ లోకి మరో వ్యక్తి రాడు అని ఆమె తేల్చి చెప్పింది. నాకు ఒంటరి లైఫ్ చాలా బాగా నచ్చింది.. ఇక జీవితంలో నేను పెళ్లి చేసుకోనని ఫిక్స్ అయిపోయాను అని ప్రియాంక చెప్పుకొచ్చారు.. ఒంటరిగా ఉంటేనే ఎటువంటి బాధలు ఉండవు అని చెప్తూ ఆమె రెండవ పెళ్లి చేసుకోను అని క్లారిటీ ఇచ్చారు.. మొత్తానికి ఈ ప్రోమో వీడియో బాగా వైరల్ అవుతుంది. ఇక ఎపిసోడ్లో ఎలాంటి విషయాలను షేర్ చేసిందో చూడాలి..

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×