OTT Movie : మలయాళ సినిమాల్లో హారర్ అంటే కేవలం భయపెట్టడమే కాదు, చరిత్ర, సంస్కృతి మిక్స్ చేసి రూపొందిస్తుంటారు. ఈ నేపథ్యంలో వచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఒక సినిమా బెస్ట్ హారర్ థ్రిల్లర్ గా పేరు తెచ్చుకుంది. ఇందులో ఒక జంట, ఒక అసాధారణ బాక్స్ ను తెరిచినప్పడు స్టోరీ భయాంకరమైన సంఘటనలతో మలుపు తిరుగుతుంది. పృథ్వీరాజ్ కెరీర్ లోనే బెస్ట్ హారర్ సినిమాగా దీనిని చెప్పుకోవచ్చు. స్టోరీ అంత చిల్లింగ్ థ్రిల్ ని ఇస్తుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో చూడచ్చు ? అనే వివరాల్లోకి వెళ్తే …
పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియా ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మలయాళం హారర్ సినిమా పేరు ‘ఎజ్రా’ (Ezra). జయ్ కె. డైరెక్ట్ చేసిన ఈ సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ లో తోవినో థామస్, సుజిత్ శంకర్, విజయరాఘవన్, సుదీవ్ నాయర్ లు కూడా సపోర్టింగ్ రోల్స్ లో నటించారు. 2017 ఫిబ్రవరీ 10న ఈ సినిమా థియేటర్లలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఐయండిబిలో 6.6/10 రేటింగ్ తో ఇప్పుడు జియో హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్‌తో ఈ సినిమా స్ట్రీమింగ్‌లో ఉంది.
రంజన్ (పృథ్వీరాజ్), ప్రియా (ప్రియా ఆనంద్) జంట కొచ్చి నుంచి ముంబైకి షిఫ్ట్ అవుతారు. కొచ్చి మార్కెట్‌లో ప్రియా ఒక పాత అంటిక్ బాక్స్ కొంటుంది. అది చూడటానికి అందంగా ఉంటుంది. కానీ ఆ బాక్స్ ఇంట్లో పెట్టగానే రాత్రిపూట వింత సౌండ్స్, వస్తువులు తమంతట తాముగా కదలడం, ప్రియా మీద దాడులు మొదలవుతాయి. రంజన్ మొదట్లో ఇదంతా ఆమె ఇమాజినేషన్ అనుకుంటాడు. కానీ ప్రియా ఒక్కసారిగా పూర్తిగా మారిపోతుంది. ఎవరో ఆమె శరీరంలోకి ఎంటర్ అయినట్టు ప్రవర్తిస్తుంది. రంజన్ తన ఫ్రెండ్ మార్క్వెస్ సాయంతో ఆ బాక్స్ హిస్టరీ తెలుసుకుంటాడు. అందులో 70 ఏళ్ల క్రితం చనిపోయిన ఒక యువకుడి ఆత్మ ఉందని, అది రివెంజ్ కోసం ప్రియాను పాసెస్ చేసిందని తెలుస్తుంది.
Read Also : హైకింగ్ కోసం వెళ్లి అమ్మాయిలు మిస్సింగ్… క్షణక్షణం ఉత్కంఠ… అదిరిపోయే సస్పెన్స్ థ్రిల్లర్
ఇక ఫ్లాష్‌బ్యాక్‌లో 1940 కాలం నాటి కొచ్చిలో జరిగిన ఒక ట్రాజెడీ ఓపెన్ అవుతుంది. అబ్రహం ఎజ్రా అనే రిచ్ అబ్బాయి, రోజీ అనే క్రిస్టియన్ అమ్మాయి మధ్య లవ్ స్టోరీ నడుస్తుంది. మతం వల్ల వాళ్ల ప్రేమకు అడ్డంకలు వచ్చి భయంకరమైన ట్రాజెడీ జరుగుతుంది. ఎజ్రా ఆత్మ ఆ ఆ బాక్స్‌లో బంధించబడి ఉంటుంది. 70 ఏళ్లుగా ఎవరో ఒకరు బాక్స్ తెరిస్తే రివెంజ్ తీర్చుకోవడానికి చూస్తుంటుంది. ఇప్పుడు ప్రియా దాని టార్గెట్ అయిపోయింది. దానిని వదిలించుకోవడానికి రంజన్ చర్చ్ ఫాస్టర్ తో ఎక్సార్సిజమ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ ఆత్మ అంత సులువుగా వదలదు. క్లైమాక్స్ లో ఫుల్ టెన్షన్, షాకింగ్ ట్విస్ట్లతో స్టోరీ నడుస్తుంది. చివరికి రంజన్ ఈ ఆత్మను వదిలించు కుంటాడా ? తన భార్యను కాపాడుకుంటాడా ? అనే విషయాలను, ఈ మలయాళం హారర్ సినిమాను చూసి తెలుసుకోండి.