Weather News:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం మారింది. పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తిరుపతి చిత్తూరు అన్నమయ్య వైఎస్సాఆర్ కడప జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
వాతావరణ శాఖ అధికారులు ఈ అల్పపీడనం తీవ్రత పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఇది రేపటికి వాయుగుండంగా బలపడుతుందని అంచనా వేశారు. ఆపై రెండు రోజుల్లో అంటే నవంబర్ 26, 2025 నాటికి ఇది తుఫాన్ గా మారుతుందని తెలిపారు. తుఫానుగా మారిన తర్వాత దాని కదలిక తీరం దాటే ప్రాంతంపై మరింత స్పష్టత వస్తుందని అధికారులు వెల్లడించారు. తుఫాను పయనించే దిశ బలం ఆధారంగా రాష్ట్రంలో వర్ష తీవ్రత ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ అల్పపీడనం ప్రభావం ప్రస్తుతం రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలపై ఎక్కువగా ఉంది. తిరుపతిలో పవిత్ర పుణ్యక్షేత్రం పరిసరాల్లో భారీ వర్షం కురుస్తోంది. తిరుమల ఘాట్ రోడ్లలో కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉంది. చిత్తూరు జిల్లాలో వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. అన్నమయ్య వైఎస్సాఆర్ కడప జిల్లాల్లోని పలు గ్రామాలు నీటి ముంపునకు గురయ్యాయి. అధికార యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టింది. సహాయక బృందాలు ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
వాతావరణ శాఖ అధికారులు మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలో వేటకు వెళ్లవద్దని సూచించారు. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు వెంటనే తీరానికి చేరుకోవాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. ముఖ్యంగా తుఫానుగా మారే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదు. పాత శిథిల భవనాల్లో నివసించేవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడవచ్చు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
రాబోయే రెండు మూడు రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. ఈ జిల్లాల కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా అత్యవసర కేంద్రాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలా సహాయం అందించడానికి సిద్ధంగా ఉంది.
ALSO READ: Raj Tharun: సినిమా చూడండి.. నచ్చకపోతే డబ్బులు తిరిగిచ్చేస్తా, సినిమాపై అంత కాన్ఫిడెన్స్ ఏంటి?