E-Paper
Advertisement

తండ్రి పరువు కోసం కొడుకు వేట… కోర్టులో మొదలయ్యే అసలైన ఆట… ఐయండిబిలో అదిరిపోయే రేటింగ్

తండ్రి పరువు కోసం కొడుకు వేట…  కోర్టులో మొదలయ్యే అసలైన ఆట… ఐయండిబిలో అదిరిపోయే రేటింగ్
Advertisement

Family Drama OTT : కోర్ట్ రూమ్ డ్రామాలు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. కోర్టులో తికమక పెట్టే వాదనలతో కథలు హీటెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాతీ నుంచి ఒక సినిమా గత ఏడాది హోలీ పండుగ నాడు వచ్చింది. ఈ సినిమా 2025లో విడుదలైన అన్ని గుజరాతీ సినిమాల్లోకెల్లా అతిపెద్ద ఓపెనింగ్ సాధించింది. కేవలం గుజరాత్‌లోనే కాకుండా ముంబై వంటి నగరాల్లో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఇది ఒక తండ్రి, కొడుకుల ఎమోషనల్ డ్రామా. తండ్రి లంచగొండి కేసులో అరెస్ట్ అవ్వడంతో, అతన్ని కాపాడేందుకు కొడుకు రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో కథ ఆసక్తికరంగా సాగుతుంది.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

ఈ గుజరాతీ కోర్టు రూమ్ డ్రామా పేరు ‘ఆల్ ది బెస్ట్ పాండ్యా’ (All the Best Pandya). రాహుల్ భోలే, వినీత్ కనోజియా ఈ సినిమాకి దర్శకులుగా పని చేశారు. ఈ సినిమాను సరిగ్గా మార్చి 14, 2025న హోలీ పండుగ రోజున విడుదల చేశారు. పండుగ సెలవులు కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. గుజరాతీ సూపర్ స్టార్ మల్హర్ థాకర్, సీనియర్ నటుడు దర్శన్ జరీవాలా కలిసి నటించడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. థియేటర్లలో సక్సెస్ అయిన తర్వాత, 2025 జూన్ 19న ఈ సినిమా ShemarooMe ఓటిటి ప్లాట్‌ ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాను సుమారు ₹5 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద 15 కోట్లకి పైగా వసూళ్లతో నిర్మాతలకు లాభాన్ని తెచ్చిపెట్టి సూపర్ హిట్ గా నిలిచింది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఈ కథలో తండ్రి హస్ముఖ్ పాండ్యా చాలా పద్ధతిగా బతికే మనిషి, అస్సలు అబద్ధం చెప్పడు. కానీ కొడుకు అక్షయ్ పాండ్యా మాత్రం దానికి రివర్స్. వీళ్లిద్దరికీ అస్సలు పడదు, ఇంట్లో ఉంటే చాలు ఎప్పుడూ టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకుంటూనే ఉంటారు. చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ ఒకరినొకరు అస్సలు అర్థం చేసుకోరు. అంతా సాఫీగా సాగిపోతున్న టైమ్ లో, నిజాయితీగా ఉండే తండ్రి హస్ముఖ్‌పై ఎవరో కావాలని కుట్ర చేసి, ఒక పెద్ద లంచం కేసులో ఇరికిస్తారు. దాంతో ఆయన పరువు పోవడమే కాకుండా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఎప్పుడూ తండ్రితో గొడవపడే అక్షయ్, తన తండ్రి తప్పు చేయలేదని నమ్మి, ఆయన్ని కాపాడుకోవడానికి తానే స్వయంగా రంగంలోకి దిగుతాడు.
ఇప్పుడు అక్షయ్ లాయర్ అవతారం ఎత్తి కోర్టులో తన తండ్రి కోసం గట్టిగా పోరాడతాడు. ఆ గొడవల మధ్యే ఒకరిపై ఒకరికి ఉన్న అసలైన ప్రేమ ఏంటో వాళ్లకు అర్థమవుతుంది. తండ్రి విలువ కొడుక్కి, కొడుకు బాధ్యత తండ్రికి తెలిసి వస్తుంది. చివరికి అక్షయ్ తన తెలివితేటలతో తండ్రిని ఆ కేసు నుంచి ఎలా బయట పడేశాడనేదే ఈ సినిమా క్లైమాక్స్.

Read Also :  పగలు గవర్నమెంట్ ఆఫీసర్.. రాత్రి మేల్ ఎస్కార్ట్ … క్లైమాక్స్ వరకు నవ్వులే నవ్వులు

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×