E-Paper
Advertisement

ప్రతి ఇంటి సమస్యను గొంతెత్తి చాటిన గొప్ప ప్రయత్నం… ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా

ప్రతి ఇంటి సమస్యను గొంతెత్తి చాటిన గొప్ప ప్రయత్నం… ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా
Advertisement

Social Drama OTT : భారతదేశంలో మహిళలకు ఎదురయ్యే ప్రధాన సమస్య మరుగుదొడ్లు. అవును ఇది అక్షర సత్యం. ఎప్పటి నుంచో ఇది పరిష్కారం కాని సమస్యగానే మిగిలిపోయింది. ప్రభుత్వం కూడా అడపా దడపా చర్యలతో మాత్రమే సరిపెట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఒక బాలీవుడ్ సినిమా మంచి మెసేజ్ ని ఇస్తోంది. ఆ సమస్య వల్ల వాళ్ళు పడే ఇబ్బందులను ఈ సినిమా ఎమోషనల్ గా చూపిస్తుంది. విమర్శకుల నుండి ఈ సినిమాకు మంచి రేటింగ్స్ వచ్చాయి కూడా. దీనికి ఇయండిబిలో 8.8 రేటింగ్ ఉందంటే సినిమా ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇందులో సంజయ్ మిశ్రా తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

ఈ సోషల్ డ్రామా సినిమా పేరు ‘జైయే ఆప్ కహాన్ జాయేంగే’ (Jaaiye Aap Kahan Jaayenge). ఈ చిత్రాన్ని నిఖిల్ రాజ్ సింగ్ దర్శకత్వం వహించగా, సంజయ్ మిశ్రా, మోనాల్ గజ్జర్, కరణ్ ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించారు. దీనికి సందేశ్ శాండిల్య సంగీతం అందించారు. ఆయన గతంలో ‘కభీ ఖుషీ కభీ గమ్’ వంటి పెద్ద సినిమాలకు పనిచేశారు. ఇది కేవలం వినోదం కోసమే కాకుండా, సమాజంలో మహిళల ఆరోగ్యానికి సంబంధించిన ఒక సీరియస్ సమస్యను చర్చించినందుకు గాను, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వంటి వేదికలపై ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రసార భారతి కొత్త ఓటిటి ప్లాట్‌ఫారమ్ ‘వేవ్స్’ (Waves) లో అందుబాటులో ఉంది. అక్కడ మీరు దీనిని ఉచితంగా చూడవచ్చు. సుమారు 1 గంట 45 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాను చూసి నేర్చుకోవాల్సింది కూడా చాలానే ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథ మిడిల్ క్లాస్ తండ్రి (సంజయ్ మిశ్రా), తన కూతురు (మోనాల్ గజ్జర్) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ ఊర్లలో గానీ, బయట టౌన్లలో గానీ ఆడవాళ్లు బయటికి వెళ్లినప్పుడు, వాళ్లకు కనీసం మర్యాదగా వెళ్లడానికి ఒక మరుగుదొడ్డి కూడా ఉండదు. ఒకవేళ ఉన్నా అవి అస్సలు వాడలేనంత గలీజుగా ఉంటాయి. ఈ సమస్య వల్ల తన కూతురు, అలాగే మిగతా ఆడవాళ్లు పడే నరకం చూసి ఆ తండ్రి మనసు కరిగిపోతుంది. కేవలం బాధపడి ఊరుకోకుండా, ఈ సమస్య మీద ఆ తండ్రి ఒక పోరాటం మొదలుపెడతాడు. సమాజంలో ఇదొక చిన్న విషయమని అందరూ కొట్టిపారేసినా, ఇది ఆడవాళ్ల ఆరోగ్యానికి, గౌరవానికి సంబంధించిన విషయమని ఆయన గట్టిగా నమ్ముతాడు.

ఒక పక్క అధికారులు పట్టించుకోకపోయినా, మరోపక్క లోకం వింతగా చూసినా లెక్కచేయకుండా ఆడవాళ్ల కోసం మరుగుదొడ్లు కట్టించాలని ఆయన పడే తాపత్రయం చూస్తే గుండె బరువెక్కిస్తుంది. చివరగా ఈ సినిమా కేవలం ఒక టాయిలెట్ గురించి మాత్రమే కాకుండా, ఒక తండ్రి తన కూతురి మీద ఉన్న ప్రేమతో వ్యవస్థనే ఎలా ప్రశ్నించాడు అనే కోణంలో సాగుతుంది. నవ్వుతూనే ఆలోచింపజేసేలా, కాస్త ఎమోషనల్‌గా ఈ సినిమాను తీశారు. ఆడవాళ్ల కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ, ప్రభుత్వం, ప్రజలు ఈ విషయంపై ఎలా స్పందించాలో ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది.

Advertisement

Read Also : ఖాకీలకే ముప్పుతిప్పలు పెట్టే కేసు… మూడు సీజన్లతో 7.9 ఐయండిబి రేటింగ్… నిజంగానే తోపు సిరీస్ మావా

Tags

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×