E-Paper
Advertisement

Crime Comedy OTT : పగలు గవర్నమెంట్ ఆఫీసర్.. రాత్రి మేల్ ఎస్కార్ట్ … క్లైమాక్స్ వరకు నవ్వులే నవ్వులు

Crime Comedy OTT : పగలు గవర్నమెంట్ ఆఫీసర్.. రాత్రి మేల్ ఎస్కార్ట్ … క్లైమాక్స్ వరకు నవ్వులే నవ్వులు
Advertisement

Crime Comedy OTT : ఓటీటీలో వెబ్ సిరీస్ లు ఇప్పుడు తెగ సందడి చేస్తున్నాయి. క్రైమ్ థ్రిల్లర్ల తరువాత, కామెడీ కంటెంట్ ను చూసేందుకు ఆడియన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ చాలా డిఫరెంట్ కంటెంట్ తో వచ్చింది. అటు క్రైమ్, ఇటు అడల్ట్ కామెడీతో సాగే ఈ కథ ఒక మిడిల్ క్లాస్ ప్రభుత్వ ఉద్యోగి చుట్టూ తిరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పులు తీర్చడానికి అతను ఒక మేల్ ఎస్కార్ట్ గా మారతాడు. ఆతరువాత కథ ఓ రేంజ్ లో పరుగులు పెడుతుంది.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

ఈ క్రైమ్ కామెడీ డ్రామా సిరీస్ పేరు ‘త్రిభువన్ మిశ్రా CA టాపర్’ (Tribhuvan Mishra CA Topper). 2024లో వచ్చిన ఈ సిరీస్‌ను మిర్జాపూర్ ఫేమ్ పునీత్ కృష్ణ క్రియేట్ చేశారు. అందుకే ఇందులో బూతులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇందులో మానవ్ కౌల్ (త్రిభువన్ మిశ్రాగా), తిలోత్తమా షోమ్, శుభ్రజ్యోతి భారత్ లీడ్ రోల్స్ లో నటించారు. త్రిభువన్ పాత్రలో మానవ్ కౌల్ అద్భుతంగా నటించాడు. ఒక సాదాసీదా ప్రభుత్వ ఉద్యోగిగా, అదే సమయంలో భయం భయంగా ఎస్కార్ట్ పనులు చేసే వ్యక్తిగా అతని నటన హైలైట్. ఇక గ్యాంగ్‌స్టర్ భార్యగా తిలోత్తమా షోమ్ నటనకు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇది అసలు వెర్షన్ హిందీలో ఉన్నప్పటికీ, నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది. మొత్తం 9 ఎపిసోడ్‌లు ఉన్న మొదటి సీజన్ ఒక సస్పెన్స్‌తో ముగిసింది. కథ ఇంకా పూర్తి కాలేదు కాబట్టి, రెండవ సీజన్ వచ్చే అవకాశం ఉంది. అయితే నెట్‌ఫ్లిక్స్ నుండి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

త్రిభువన్ మిశ్రా CAలో టాపర్. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ భార్యాపిల్లలతో పద్ధతిగా బతికే రకం. కానీ సీన్ రివర్స్ అయి, అప్పుల వాళ్లు ఇంటి మీద పడి పరువు తీస్తుంటే, ఏం చేయాలో తెలియక ఒక పిచ్చి ప్లాన్ వేస్తాడు. పగలు ఆఫీసులో ఫైళ్లతో కుస్తీ పడుతూ, రాత్రి పూట ‘మేల్ ఎస్కార్ట్’ (డబ్బుల కోసం ఆడవాళ్లతో గడిపేవాడు) గా అవతారం ఎత్తుతాడు. తనకి తెలిసిన లెక్కలతోనే ఈ సైడ్ బిజినెస్ ని కూడా ఒక రేంజ్‌కి తీసుకెళ్తాడు. ఇలా సాఫీగా సాగిపోతున్న టైమ్ లో, మిశ్రా ఒక లేడీ డాన్ బిందీ దగ్గరికి వెళ్తాడు. అక్కడే అసలు కథ మొదలవుతుంది. ఆ లేడీ డాన్ మొగుడు ఒక పెద్ద గ్యాంగ్‌స్టర్. త్రిభువన్ చేసే ఈ పాడు పని ఆ గ్యాంగ్‌కి తెలిసిపోతుంది.

ఇక ఒక పక్క పోలీసోళ్లు, ఇంకో పక్క తుపాకులు పట్టుకున్న రౌడీలు.. వీళ్లందరి మధ్యలో మన CA టాపర్ నలిగిపోతుంటాడు. ఆఫీసులో బాసుకి తెలియకూడదు, ఇంట్లో పెళ్లాంకి దొరక్కూడదు.. ఈ నరకంలో త్రిభువన్ పడే పాట్లు భలే కామెడీగా ఉంటాయి. అప్పులు తీర్చడానికి మొదలుపెట్టిన ఈ దందా, చివరికి ప్రాణాల మీదకు వస్తుంది. కథ క్లైమాక్స్ లో గ్యాంగ్‌స్టర్ల చేతికి మిశ్రా చిక్కుతాడా ? మిశ్రా చేసే పనులు అతని ఫ్యామిలీకి తెలుస్తుందా ? ఈ కథ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను, ఈ అడల్ట్ కామెడీ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also :  ఊపిరి సలపని రెస్క్యూ … లోయలో గల్లంతయ్యే ఫుట్ బాల్ టీమ్… ఐయండిబిలో 7.8 రేటింగ్

Tags

Related News

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

వచ్చేవారం నెట్ ఫ్లిక్స్ లో 3 సినిమాలు.. ఆ 2 మస్ట్ వాచ్!

అందరూ తక్కువ అంచనా వేసే లాయర్‌… కోర్టులో ఆమె వాదనలు వింటే మైండ్‌ బ్లాక్‌… మెంటలెక్కించే లీగల్‌ డ్రామా

Big Stories

Advertisement
×