E-Paper
Advertisement

Big Shock to KCR in Gajwel: కేసీఆర్‌పై ఆగ్రహం.. గజ్వేల్‌లో కథ రివర్స్..!

Big Shock to KCR in Gajwel: కేసీఆర్‌పై ఆగ్రహం.. గజ్వేల్‌లో కథ రివర్స్..!

Big Shock to KCR in Gajwel: గజ్వేల్ ఎమ్మెల్యే అధికారంలో లేకపోతే ఫామ్ హౌస్‌కే పరిమితం అవుతున్నారని అక్కడి ఓటర్లు, ప్రతి పక్షాలు ఫైర్ అవుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అధికారం ఇస్తే హైదరాబాదులో ఉండి పాలన సాగిస్తా.. లేదంటే ఫామ్‌హౌస్‌లోనే పడుకుంటా అన్నట్లు వ్యవహరించడం గులాబీ పార్టీ శ్రేణులకు కూడా మింగుడుపడటం లేదంట.. ఆరోగ్య పరంగా ఏవైనా సమస్యలు ఉంటే వాటిని బహిర్గతం చేస్తే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని, అయితే అవేమీ లేకుండా ఆయన మోనోపోల్‌లా వ్యవహరిస్తుండటంపై అందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కేసీఆర్ టార్గెట్‌గా కాంగ్రెస్, బీజేపీ విమర్శలు
ఉమ్మడి మెదక్ జిల్లాలోని గజ్వేల్ రాజకీయాలు గరం గరంగా మారుతున్నాయి. గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ సీఎం కేసీఆర్ టార్గెట్‌గా కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు చేస్తుంటే…ఇటు మల్లన్నసాగర్ నిర్వాసితులు లేఖలతో పైర్ అవుతున్నారట. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లి నియోజకవర్గ సమస్యలపై మాట్లాడలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నా.. ఉలుకు పలుకు లేకపోవడంతో వారు అసహానానికి గురవుతున్నారట. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో గజ్వేల్ హాట్ టాపిక్ గా మారింది

గజ్వేల్ నుంచి వరుసగా మూడోసారి గెలిచిన గులాబీబాస్..
మాజీ సీఎం కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా గెలిచారు. రెండు సార్లు సీఎంగా రాష్ట్రాన్ని శాసించిన ఆయన మూడోసారి పోర్టీ ఓటమి పాలవ్వడంతో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం లేదు. గతంలోనూ బడ్జెట్ సమావేశాలకు ఇలా వెళ్లి అలా వచ్చేశారు. ఈ సారి కూడా అసెంబ్లీ సమావేశాలకు హారవవుతారని అనుకుంటే మొదటి రోజు వెళ్లి నిముషాల వ్యవధిలో బయటకు వచ్చేశారు. మళ్ళీ మరుసటి రోజు నుంచి ఆయన అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నారు. ఈ అంశమే ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆస్త్రంగా మారింది. అసెంబ్లీకి కేసీఆర్ రావాలని శాసనసభలో సీఎం రేవంత్ సహా, మంత్రులు పట్టుబడుతున్నారు. అదే డిమాండ్‌తో గజ్వేల్‌లో కాంగ్రెస్ నేతలు ఏకంగా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్‌నే ముట్టడించారు.

ఫాంహౌస్ ముందు ధర్నా చేసిన ఆంక్షారెడ్డి, నర్సారెడ్డి..
సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు ఫామ్‌హౌస్ ముందు ధర్నాకు దిగారు. గేటు ముందు రెడ్ కార్పెట్ వేసి పూలు చల్లి కేసీఆర్ బచటరేకి రావాలని డిమాండ్ చేశారు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజల ఓట్లతో గెలిచిన కేసీఆర్‌కి వారి సమస్యలతో పని లేదా అని ప్రశ్నించారు. అసెంబ్లీకి హాజరుకావా? గజ్వేల్ ప్రజలవి ఓట్లు కావా? అంటూ ప్లకార్డులు పట్టుకున్నారు. ఒక వేళ అసెంబ్లీకి కేసీఆర్ వెళ్ళకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రతిపక్ష నేత హోదా నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ముందు బీజేపీ ధర్నా..
బీజేపీ నేతలు గజ్వేల్ లో ధర్నా చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. రెండేళ్ల నుండి నియోజకవర్గంలో ఉంటూ ఫామ్ హౌజు కే పరిమితమైన కేసీఆర్ పై ఇటు ఓటరు అటు ప్రతిపక్ష నాయకులు ఆందోళనలు, నిరసనలు చేస్తున్నా మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు చీమకుట్టినట్లైనా లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ ఎమ్మెల్యే కేసీఆర్ కాకపోతే బాగుండేదని గజ్వేల్ వాసులు వాపోతున్నారు

కాంగ్రెస్ ధర్నానే ఖండించిన ప్రతాప్ రెడ్డి..
ఫామ్ హౌస్ ఎదుట కాంగ్రెస్ నేతల ధర్నాను గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జ్ ప్రతాప్ రెడ్డి ఖండించారు. కాంగ్రెస్ నాయకులు ఒక వేళ ధర్నా చేస్తే సీఎం రేవంత్ ఇంటి ముందు ధర్నా చేయాలి కానీ కేసీఆర్ ఫామ్ హౌస్ ఎదుట ధర్నాకి దిగడమేంటని ఆయన కౌంటర్ ఇచ్చారు. మల్లన్నసాగర్ నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం, గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ మంత్రులు గజ్వేల్ వస్తే వారిని అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు.

ఫామ్ హౌస్‌తో పాటు నందినగర్ నివాసానికి లేఖలు
కాంగ్రెస్, బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఈ వార్ నడుస్తుంటే మల్లన్నసాగర్ నిర్వాసితులు లేఖతో మరోసారి వార్తల్లోకెక్కారు. పల్లెపహడ్, వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, లక్ష్మపూర్, రాంపూర్, ఎర్రవల్లి, సింగారం ముంపు గ్రామాల ప్రజలు తమ సమస్యలపై అసెంబ్లీకి వెళ్లి కేసీఆర్ మాట్లాడాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీకి వెళ్లకుండా, నియోజకవర్గ సమస్యలు పరిష్కరించకుండా నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ ఉండటం ఎందుకని నిలదీశారు.. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌తో పాటు హైదరాబాద్ లోని నందినగర్ నివాసానికి లేఖను స్పీడ్ పోస్ట్ లో పంపారు మల్లన్నసాగర్ నిర్వాసితులు. మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డితో అసెంబ్లీలో మాట్లాడి తమకు న్యాయం చేయాలని లేఖలో పేర్కొన్నారు.

Also Read: ‘రాష్ట్రానికి పట్టిన దరిద్రం.. రోజా, కొడాలి నాని, పేర్ని నాని’

ఇలా గజ్వేల్ రాజకీయం మొత్తం కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ తిరుగుతోంది. మరో వైపు గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కూడా ఖాళీగా ఉండటంతో అక్కడ కూడా త్వరలోనే కాంగ్రెస్ ఆందోళనలకు సిద్ధమవుతోంది. మొత్తానికి గజ్వేల్‌లో పరిస్థితుల్ని క్యాష్ చేసుకునే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ.

Story By Apparao, Bigtv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×