E-Paper
Advertisement

Family Drama OTT : ఏడుగురు పిల్లల బాధ్యత ఒక్కడిపైనే… ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన కథ

Family Drama OTT : ఏడుగురు పిల్లల బాధ్యత ఒక్కడిపైనే… ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన కథ
Advertisement

Family Drama OTT : ఓటీటీలో ఫ్యామిలీ అంతా కలిసి చూసే విధంగా ఉండే సినిమాలు, లేదా సిరీస్ లు చాలా తక్కువ. హర్రర్, క్రైమ్, యాక్షన్ జానర్లో మాత్రం లెక్కలేనన్ని సినిమాలు ఉంటాయి. ఎప్పుడైనా ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా ఒక మంచి సినిమాను చూడాలి అనుకుంటే, అలాంటి మూవీని వెతకడానికే టైమ్ అంతా సరిపోతుంది. మీకు కూడా అలాంటి మూవీ కావాలి అనుకుంటే దీనిపై ఒక లుక్కేయండి.

నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న హార్ట్ టచింగ్ ఫ్యామిలీ-డ్రామా ‘ఎ బ్రదర్ అండ్ 7 సిబ్లింగ్స్’ (A Brother and 7 Siblings). 2024లో విడుదలైన ఇండోనేషియా ఫ్యామిలీ డ్రామా చిత్రం. ఎమోషన్స్, కామెడీ, త్యాగం, కుటుంబ బంధాలతో నిండి ఉంటుంది ఈ మూవీ. సినిమా ఇండోనేషియా లోకల్ భాషలో తెరకెక్కింది, కానీ తెలుగు డబ్ వెర్షన్ Netflixలో అందుబాటులో ఉంది. సుమారు 120-130 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ మూవీకి IMDbలో 8.0 రేటింగ్ ఉంది. చాలా మంది ఈ సినిమాను చూసిన తర్వాత ఏడ్చారు, సంతోషపడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా కుటుంబం, బంధాల విలువను తెలియజేసేలా ఉంటుంది. ఒక్కసారి చూస్తే మర్చిపోలేము. అలాగే ఫ్యామిలీకి దూరంగా ఉంటే వెంటనే వాళ్ళను కలవాలి అన్పిస్తుంది దీన్ని చూశాక. మీరు గనుక ఇలాంటి సినిమాలను ఇష్టపడితే పొరపాటున కూడా మిస్ కాకుండా చూడండి.

Advertisement

Also Read :

కథలోకి వెళ్తే…

కథ ఇండోనేషియాలోని ఒక సాధారణ గ్రామీణ కుటుంబం చుట్టూ తిరుగుతుంది. పెద్ద అన్నయ్య రహ్మత్ తన 7 మంది తమ్ముళ్లు, చెల్లెళ్లను చూసుకుంటాడు. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత రహ్మత్ ఒక్కడే కుటుంబానికి ఆధారం అవుతాడు. అతను ఒక చిన్న ఉద్యోగం చేస్తూ, ఫ్యామిలీని పోషిస్తాడు. సిస్టర్స్ బ్రదర్స్ చదువు, వివాహాలు, కలలను నెరవేర్చడానికి రాత్రింబవళ్లు కష్టపడతాడు. చిన్న చెల్లెలు వివాహం కోసం రహ్మత్ డబ్బు సమకూర్చుకోవడం, ఒక తమ్ముడు ఉన్నత చదువు కోసం పోరాడటం, మరొక చెల్లెలు ఉద్యోగం సాధించడానికి ప్రయత్నించడం… ఇలాంటి సంఘటనలు కథను ముందుకు తీసుకెళ్తాయి.

Advertisement

అయితే అంతలోనే కలహాలు మొదలవుతాయి. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు, సంతోషాలు, హాస్యం, ఏడుపు అన్నీ సహజంగా చూపిస్తారు. మధ్యలో పెద్ద సమస్యలు వస్తాయి. ఆర్థిక కష్టాలు, రహ్మత్ ఆరోగ్య సమస్యలు, సోదర సోదరీమణులలో ఒకరు తప్పుదారి పట్టడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. అయినా రహ్మత్ తన సిస్టర్స్ బ్రదర్స్ కోసం అన్ని బలిదానాలు చేస్తాడు. క్లియర్ గా చెప్పాలంటే ఈ మూవీ చిరంజీవి ‘హిట్లర్’ లాగా ఉంటుంది. కాకపోతే అక్కడ అందరూ సిస్టర్స్, హీరో ఒక్కడే బ్రదర్. ఇందులో హీరోతో పాటు బ్రదర్స్, సిస్టర్స్ కూడా ఉంటారు. మరి ఫ్యామిలీ అంతా కలిసి తమ కోసం ఇంత చేసిన అన్నయ్య కోసం చివరికి ఏం చేశారు ? వాళ్ళ సమస్యలను ఎలా అధిగమించారు ? అన్నది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

Tags

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×