E-Paper
Advertisement

Visakha Crime: మహిళ గొంతు నులిమి.. ఆ తర్వాత బంగారం దోచేశాడు, విశాఖలో దారుణం

Visakha Crime: మహిళ గొంతు నులిమి..  ఆ తర్వాత బంగారం దోచేశాడు, విశాఖలో దారుణం
Advertisement

Visakha Crime: దొంగలు రూటు మార్చారు.. వారి చూపంతా ఇప్పుడు బంగారంపై పడింది. ఎవరైనా మహిళలు బంగారు ఆభరణాలు పెట్టుకుని బయటకు వెళ్తేచాలు. దొంగల చూపు వారిపైనే ఉంటున్నాయి. ఆ తర్వాత వారి గురించి తెలుసుకుని చంపేయడం జరుగుతోంది. అలాంటి ఘటన ఒకటి విశాఖ సిటీలో చోటు చేసుకుంది.

విశాఖలో దారుణం.. బంగారం కోసం మహిళ హత్య

Advertisement

ఒకప్పుడు బంగారం కోసం దొంగతనాలు జరిగేవి. ఎవరైనా మహిళలు బంగారం ఆభరణాలు ధరించి బయటకు వెళ్తే.. రాత్రికి లేకుండా వారం రోజుల తర్వాత వారి వారిల్లు గులయ్యే సందర్భాలు ఉండేవి. ఇప్పుడు కూడా అంతే.. కాకపోతే హత్యలు జరుగుతున్నాయి. ఈ తరహా ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా పెరుగుతోంది.

విశాఖ సిటీలోని ఆరిలోవలోని కనకదుర్గనగర్‌ ప్రాంతంలో రమణ-లక్ష్మి దంపతులు ఉంటున్నారు. రమణ జీవీఎంసీలోని ఉద్యాన విభాగంలో ఉద్యోగం చేస్తున్నాడు. లక్ష్మి ఇంట్లోనే ఉండేది. ఈ దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. వీరంతా సమీపంలోని ఇంట్లో ఉంటున్నారు. బుధవారం ఉదయం 9 గంటలకు డ్యూటీకి వెళ్లిపోయాడు రమణ.

Advertisement

పట్టపగలు దారుణం.. ఇంట్లోకి దూకి మహిళ గొంతు నులిమి చంపేశాడు

ఇంట్లో లక్ష్మి ఒక్కరే ఉంది. ఈ విషయం తెలుసుకున్న దుండగుడు పదిన్నర గంటలకు రమణ ఇంట్లోకి ప్రవేశించాడు. లక్ష్మిపై దాడి చేసి గొంతు నులిమి చంపేశాడు దుండగుడు. ఆ తర్వాత ఆమె ఒంటిపై 8 తులాల బంగారు ఆభరణాలు, బీరువాలో ఐదు లక్షల క్యాష్ తీసుకుని అక్కడి నుంచి సైలెంట్‌గా వెళ్లిపోయాడు. ఇరుగుపొరుగువారు మాత్రం తెలిసినవారని అనుకున్నారు.

మళ్లీ తలుపు దగ్గరకు వేసి వెళ్లిపోయాడు. సాయంత్రం ఐదు గంటలకు ఇంటి కొచ్చాడు రమణ. భార్యని పదే పదే పిలిచినా ఎలాంటి స్పందించరాలేదు. తలుపు ఓపెన్ చేసేసరికి అచేతనంగా భార్య పడి ఉంది. ఆమె ఒంటిపై ఆభరణాలు లేకపోవడంతో వెంటనే కూతురు, కొడుకు, అల్లుడికి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత ఆరిలోవ పోలీసులు సమాచారం ఇవ్వడంతో వెంటనే అంబులెన్స్‌ పంపించారు.

ALSO READ: బెంగళూరులో ఘోర ప్రమాదం, స్కూల్ బస్సు కింద పడి ఇద్దరు చిన్నారుల మృతి!

అంబులెన్స్‌ సిబ్బంది వచ్చేసరికి లక్ష్మి ఈలోకాన్ని విడిచిపెట్టేసింది. ఘటన జరిగిన ప్రాంతానికి చేసుకున్న క్లూస్‌ టీం ఆధారాలను సేకరించింది. రెక్కీ చేసి ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని ఓ అంచనాకు వచ్చారు పోలీసులు. రమణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రమణ ఇంట్లోని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పదిన్నర గంటల సమయంలో దుండగుడు ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లో అన్నీ పరిశీలించిన తర్వాత మళ్లీ 11 గంటల సమయంలో వెళ్లిపోయాడు. నెత్తిపై టోపీ, ముఖానికి మాస్క్‌ ధరించినట్టు ఫుటేజ్‌లో కనిపిస్తోంది. ఆరిలోవ ప్రాంతంలోని ఫుటేజ్‌ని పరిశీలిస్తున్నారు పోలీసులు. స్థానికంగా ఉండే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడా? లేకుంటే బయట నుంచి ఎవరైనా వచ్చారా? అనేది తెలియాల్సివుంది.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×