Family Drama Series OTT : అంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు, ఒకరికొకరు అండగా నిలబడడం. కానీ అదే కుటుంబంలో ఎవరూ ఊహించని ఒక చేదు నిజం బయటపడితే? ఆ బంధాలు ఎలా ముక్కలవుతాయి? అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిన సరికొత్త వెబ్ సిరీస్ ‘బ్రదర్స్ అండ్ సిస్టర్స్’ (Brothers and Sisters). ఇప్పుడు ఇది ఫ్యామిలీ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లో ఉండే ఎమోషన్స్ న్ ఇందులో చక్కాగా చూపించారు. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఈ సిరీస్ ను ఎక్కడ చూడచ్చు, దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే..
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన JioHotstar లో ‘బ్రదర్స్ అండ్ సిస్టర్స్’ (Brothers and Sisters) మే 27 నుండి ఈ ఫ్యామిలీ మిస్టరీ డ్రామా సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. మణివణ్ణన్ దర్శకత్వంలో ప్రశంసలు అందుకున్న ‘బ్రదర్స్ అండ్ సిస్టర్స్’ ఒక పక్కా ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. సమాజంలో ఎంతో పద్ధతిగా, సాంప్రదాయాలకు విలువ ఇచ్చే ఒక పెద్ద కుటుంబంలో దాగి ఉన్న రహస్యాలు బయటకు వచ్చినప్పుడు జరిగే పరిణామాలను ఈ సిరీస్ చాలా రియాలిటీగా, ఉత్కంఠభరితంగా చూపిస్తుంది. ఇది తమిళం అయినప్పటికీ, తెలుగు ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అయ్యేలా అద్భుతమైన ఎమోషన్స్‌తో దీనిని రూపొందించారు.ఇందులో బోస్ వెంకట్, గాయత్రి శాస్త్రి, రాజ్ అయ్యప్ప, నిఖిలా శంకర్, లూతుఫ్, కిషోర్జోనర్ లీడ్ రోల్స్ లో నటించారు. ఇది తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉంది.
ఈ కథ అంతా షణ్ముగ సుందరం అనే వ్యక్తి చుట్టూ తరుగుతుంది. షణ్ముగ సుందరం సమాజంలో ఎంతో గౌరవప్రదమైన వ్యక్తి. అతని మాటను ఇంట్లో ఎవరూ జవదాటరు. ఎంతో పద్ధతిగా, క్రమశిక్షణతో సాగిపోతున్న ఆ కుటుంబంలో ఒకరోజు ఊహించని తుఫాను చెలరేగుతుంది. షణ్ముగ సుందరానికి సంబంధించిన ఒక రహస్య వ్యవహారం (రెండో కుటుంబం) గురించిన షాకింగ్ నిజం అతని నలుగురు పిల్లలకు తెలుస్తుంది. అంతవరకు తమ తండ్రిని ఆదర్శంగా భావించిన ఆ తోబుట్టువులు (అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు) ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ కుటుంబం ఈ నిజాన్ని ఎలా తట్టుకుంది? ఈ గందరగోళ పరిస్థితుల మధ్య, కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవడానికి తోబుట్టువులందరూ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? తండ్రి చేసిన తప్పుకు వారు ఎలా స్పందించారు? చివరకు వారి మధ్య బంధాలు బలపడ్డాయా లేదా విడిపోయాయా? అనే ఆసక్తికరమైన, ఎమోషనల్ ట్విస్టులతో కథ ముందుకు సాగుతుంది.ప్రస్తుత కాలంలో వస్తున్న రొటీన్ క్రైమ్, లవ్ స్టోరీస్ కి భిన్నంగా, ‘బ్రదర్స్ అండ్ సిస్టర్స్’ కుటుంబ విలువలను, తోబుట్టువుల మధ్య ఉండే గాఢమైన బంధాన్ని చాలా చక్కగా చూపిస్తుంది. మీరు మంచి ఫ్యామిలీ డ్రామాను వీక్షించాలనుకుంటే, ఖచ్చితంగా ఇది మీకు నచ్చు తుంది.
Read Also : చరిత్రలోనే అత్యధిక పాపులారిటీ సాధించిన మహిళా సింగర్… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ డాక్యుమెంటరీ