E-Paper
Advertisement

Family Drama OTT : తప్పిపోయిన ఆవు కోసం కంగారుపడే పిల్లాడు… ఓటీటీలోకి వచ్చిన ఓ పల్లెటూరి కథ

Family Drama OTT : తప్పిపోయిన ఆవు కోసం కంగారుపడే పిల్లాడు… ఓటీటీలోకి వచ్చిన ఓ పల్లెటూరి కథ
Advertisement

Family Drama OTT : ఆడియన్స్ కు మంచి అనుభూతినిచ్చే సినిమా ఒకటి ఓటీటీలోకి వచ్చింది. ఈ కథ అంతా ఒక మారుమూల పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. గర్భవతిగా ఉన్న ఆవు తప్పిపోవడంతో ఈ సినిమా ఆసక్తికరంగా తిరుగుతుంది. ఇక ఈ సినిమా పల్లెటూరి వాతావరణాన్ని సహజంగా చూపించిన తీరుకు ప్రశంసలు కూడా అందుకుంటోంది. ఈ సినిమాను పిల్లలతో కలసి చూస్తే మరింత బాగుంటుంది.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ ఫీల్ గుడ్ కన్నడ మూవీ పేరు ‘వలవార’ (Valavaara). సతన్ గౌడ దర్శకత్వం వహించిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో వేదిక్ కౌశల్ (కుందేశి), షయన్ (కొసుడి), మాలతేష్ హెచ్.వి (తండ్రి), హర్షిత గౌడ (తల్లి) ప్రధాన పాత్రల్లో నటించారు. దీనికి మణికాంత్ కద్రి సంగీతం అందించగా, బాలరాజ్ గౌడ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. ఈ సినిమా 2026 జనవరి 30న థియేటర్లలో విడుదలైన తర్వాత, మార్చి 20 నుంచి Sun NXT ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాలో పాత్రల మాటలు రియలిస్టిక్ ఉండటం కోసం సింక్ సౌండ్ (Sync Sound) టెక్నాలజీ వాడారు. దీనివల్ల అడవిలోని కీచురాళ్ల శబ్దాలు, గాలి చప్పుడు వంటివి ప్రేక్షకులకు చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తాయి.

స్టోరీ ఏమిటంటే

Advertisement

కర్ణాటకలో సకలేశ్‌పుర కొండల మధ్య ఉండే ఒక చిన్న పల్లెటూరిలో ఒక పేద రైతు కుటుంబం ఉంటుంది. ఆ ఇంట్లో కుందేశి అనే పిల్లాడు, అతని అన్నయ్య కొసుడి ఉంటారు. వాళ్ల నాన్న కొంచెం ముక్కోపి మనిషి, ఏ చిన్న తప్పు చేసినా తోలు తీస్తాడు. ఒకరోజు ఇంట్లో అందరూ గర్భంతో ఉన్న ఆవును జాగ్రత్తగా చూసుకోమని చెప్పి బయటకెళ్తే, ఈ అన్నదమ్ములు ఇద్దరూ ఆ ఆవును మేత కోసం అడవిలోకి తీసుకెళ్తారు. అక్కడ ఆడుకుంటూ ఆవు సంగతి మరచిపోతారు. అయితే ఆ టైంలో ఆ ఆవు కాస్తా తప్పిపోతుంది. ఇక అక్కడి నుంచి అసలు సినిమా మొదలవుతుంది. నాన్న ఇంటికి వచ్చేలోపు ఆ ఆవును ఎలాగైనా వెతికి పట్టుకోవాలని ఆ పిల్లలు పడే తాపత్రయం అంతా ఇంతా కాదు. అడవిలో చెట్లు, గుట్టలు గాలిస్తూ.. ఆకలిని, అలసటను మర్చిపోయి వాళ్ళు పడే కష్టం చూస్తే ఎవరికైనా కళ్లు చెమర్చుతాయి. చివరికి ఆ పిల్లలు ఆవును కనిపెట్టారా ? తన తండ్రి కోపం నుంచి తప్పించుకున్నారా ? అనేదే మిగిలిన కథ.

Read Also : పాపి మీద పగ పెంచుకునే పాస్టర్… లెక్కకు అందని ఇన్వెస్టిగేషన్… దిమాక్ కరాబయ్యే ట్విస్టులు

Tags

Related News

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

14,000 ఏళ్ల వయసున్న టీచర్… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులున్న క్లాసిక్ సై-ఫై మూవీ

మనుషులంటేనే పడని మిస్టీరియస్ మనిషి… దిమ్మతిరిగే ట్విస్టులున్న మలయాళం థ్రిల్లర్

బిజీ మార్కెట్ లో మహిళ దారుణ హత్య… రా అండ్ రస్టిక్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×