E-Paper
Advertisement

Aditya Dhar: క్రికెటర్ కావాల్సిన వాడు.. బాక్సాఫీస్ ధురంధరుడయ్యాడు.. ఇదే స్టోరీ!

Aditya Dhar: క్రికెటర్ కావాల్సిన వాడు.. బాక్సాఫీస్ ధురంధరుడయ్యాడు.. ఇదే స్టోరీ!
Advertisement

Aditya Dhar: ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ‘ధురంధర్’ (Dhurandhar) డైరెక్టర్ ఆదిత్య ధర్ (Aditya Dhar) పేరు ఏ విధంగా మారుమోగుతుందో తెలియంది కాదు. రణవీర్ సింగ్, మాధవన్ లాంటి స్టార్లతో ఆయన తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మొదటి పార్ట్ ఎలా అయితే ప్రభంజనం సృష్టించిందో.. తాజాగా థియేటర్లలోకి వచ్చిన రెండో పార్ట్ కూడా అస్సలు తగ్గేదేలే అనేలా విజయదుంధుబి మోగిస్తోంది. అయితే ఈ సక్సెస్ వెనుక ఆదిత్య ధర్‌ ఓ పోరాటమే చేశారు. అదేంటంటే..

Also Read- Rakasa: డ్యాన్స్ రాని వారి కోసం ‘స్నేక్ డ్యాన్స్’.. ప్రమోషన్స్ కోసం పెద్ద ప్లానే వేశారుగా!

క్రికెట్ గ్రౌండ్ నుంచి కెమెరా వెనక్కి..

Advertisement

1983లో ఢిల్లీలోని ఒక కాశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించిన ఆదిత్య ధర్.. నిజానికి ఒక గొప్ప క్రికెటర్ కావాలని కలలు కన్నారు. కానీ, క్రీడల్లో ఉండే ఇంటర్నల్ పాలిటిక్స్ కారణంగా ఆ కల నెరవేరలేదు. నిరాశ చెందకుండా తన రూటు మార్చుకున్న ఆయన, ముంబైకి చేరుకుని అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. 2019లో వచ్చిన ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ సినిమాతో ఆదిత్య ధర్ ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిపోయారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడమే కాకుండా ఆయనకు జాతీయ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. ఇక వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. 2021లో ప్రముఖ హీరోయిన్ యామీ గౌతమ్‌ను ఆయన వివాహం చేసుకున్నారు. 2024లో వీరికి ఒక కుమారుడు కూడా జన్మించాడు.

Also Read- Ram Charan: బాబాయ్ సినిమా వదిలేసి, బాలీవుడ్ సినిమాపై ప్రశంసలు.. ఇదేం బాలేదు చరణ్!

ఆదిత్య ధర్ చెప్పే మాట ఇదే..

Advertisement

ఎటువంటి ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్, ఫిల్మ్ కనెక్షన్స్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి, స్టార్ డైరెక్టర్‌గా పేరొందడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందులోనూ ఆయన దర్శకుడిగా మొదలు పెట్టిన ఫస్ట్ ఫిల్మ్ అనూహ్య కారణాలతో క్యాన్సిల్ అయింది. అయినా కూడా ఆదిత్య ధర్ వెనక్కి తగ్గలేదు. ఇంకా గట్టిగా సాధన చేయడం మొదలు పెట్టారు. ఫస్ట్ సినిమాకు ముందు ఇండియన్ ఆర్మీతో చాలా టైమ్ ఆయన గడిపారు. ఇండియన్ ఆర్మీలో ఉన్న వారి స్టోరీస్ తెలుసుకుని, వారి బంధువులను సంప్రదించి ఎన్నో విషయాలను తెలుసుకున్నారు. ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ సినిమాతో తిరుగులేని సక్సెస్ అందుకున్న ఆదిత్య ధర్ ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఆ సినిమా సక్సెస్ తర్వాత స్వయంగా ఓ బ్యానర్ కూడా స్థాపించారు. ఆ బ్యానర్‌లో ఎన్నో సినిమాలకు ఆయన నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఆయన ఎప్పుడూ చెప్పేది ఒక్కటే మాట.. ‘షార్ట్ కట్స్ వెతికేవాళ్లు త్వరగా గమ్యాన్ని చేరవచ్చు కానీ, అక్కడ ఎక్కువ కాలం నిలబడలేరు. అదే కష్టపడి మెట్లు ఎక్కి వెళ్లేవాడికి ప్రతి అడుగులోనూ ఒక అనుభవం దొరుకుతుంది. ఆ అనుభవమే వాడిని సక్సెస్‌లో ఎక్కువకాలం నిలబడేలా చేస్తుంది’ అని. అదే ఇప్పుడు నిజమవుతోంది.

Also Read- Rashmika Mandanna: ఈ అనుభూతిని వర్ణించలేను.. ఇది ఆరంభం మాత్రమే!

Related News

పిల్లలు ఉన్నా.. లేకపోయినా ఒకే అనుకున్నాం..కానీ: సమంత

ఫౌజీ అసలు వస్తుందా? ప్రభాస్ సినిమా చుట్టూ పెరుగుతున్న సస్పెన్స్!

ఫ్యాన్స్ అంటే సెలబ్రేషన్స్ మాత్రమే కాదు..మనసులు గెలిచిన అల్లు అర్జున్ ఫ్యాన్స్!

మనవడి కోసం నాగబాబు సంచలన నిర్ణయం!

అప్పుడే ఏడాది..క్యూట్ పిక్ తో కొడుకుకి స్పెషల్ విషెస్ చెప్పిన వరుణ్ తేజ్ !

ఫ్యాన్స్ కి విజయ్ దేవరకొండ పిలుపు!

నిఖిల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘స్వయంబు’ రిలీజ్ అప్పడే..?

‘సర్దార్ 2’ ట్విట్టర్ రివ్యూ.. కార్తీ అకౌంట్లో హిట్ పడిందా..?

Big Stories

Advertisement
×