E-Paper
Advertisement

Mystery Thriller OTT: పాపి మీద పగ పెంచుకునే పాస్టర్… లెక్కకు అందని ఇన్వెస్టిగేషన్… దిమాక్ కరాబయ్యే ట్విస్టులు

Mystery Thriller OTT: పాపి మీద పగ పెంచుకునే పాస్టర్… లెక్కకు అందని ఇన్వెస్టిగేషన్… దిమాక్ కరాబయ్యే ట్విస్టులు
Advertisement

Mystery Thriller OTT : గత ఏడాది వచ్చిన ఒక కొరియెన్ సినిమా మైండ్ బెండ్ చేసే కంటెంట్ తో వచ్చింది. ఒక పాప మిస్సింగ్ కేసు చుట్టూ తిరిగే ఈ స్టోరీ క్లైమాక్స్ వరకు కన్ఫ్యూస్ చేస్తుంది. ఒక చర్చ్ ఫాదర్ ఈ కథను మలుపులు తిప్పుతూ ఉంటాడు. భక్తి అనేది మనిషికి ధైర్యాన్ని ఇస్తాయా లేక కళ్లకు గంతలు కట్టి తప్పుడు దారిలో నడిపిస్తాయా అనే పాయింట్‌ తో ఈ సినిమా నడుస్తుంది. బుర్ర ఉన్నోళ్ళు చూడాల్సిన సినిమా ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ కొరియన్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు ‘రివిలేషన్స్’ (Revelations). ఈ సినిమాకు ‘ట్రైన్ టు బుసాన్’ డైరెక్టర్ యాన్ సాంగ్-హో దర్శకత్వం వహించగా, ఆస్కార్ విన్నర్ అల్ఫోన్సో క్వారోన్ (గ్రావిటీ, రోమా సినిమాల డైరెక్టర్) ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. కొరియన్ సినిమాకు హాలీవుడ్ లెవల్ టెక్నీషియన్ తోడవ్వడం ఇందులో విశేషం. ర్యూ జున్-యోల్, షిన్ హ్యూన్-బీన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది థియేటర్లలో కాకుండా నేరుగా నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో 2025 మార్చి 21 నుంచి, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 190 దేశాల్లో స్ట్రీమ్ అవుతోంది

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఒక చర్చి నడిపే పాస్టర్ దగ్గరికి ఒక చిన్న పాప వస్తుంటుంది. అయితే ఒకరోజు ఆ పాప సడన్‌గా కనిపించకుండా పోతుంది. ఎవడు తీసుకెళ్లాడో తెలీక తల పట్టుకున్న టైంలో, ఆ దేవుడే వచ్చి తనకు ఒక హింట్ ఇచ్చాడని ఆ పాస్టర్ నమ్ముతాడు. ఆ ఊర్లో ఉండే ఒక వ్యక్తిని చూసి ఇతనే ఆ పాపి అని, దేవుడు తనతో చెప్పాడని ఫిక్స్ అయిపోతాడు. ఇక అప్పటినుంచి ఆ వ్యక్తి వెంటపడతాడు ఆ పాస్టర్. మరోపక్క ఒక లేడీ డిటెక్టివ్ ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తుంటుంది. అసలే ఆమెకు తన చెల్లెలిని ఎవడో చంపేశాడన్న కసి, బాధ లోపల రగులుతుంటాయి. ఇక ఈ పాస్టర్ చెబుతున్నది నిజమా లేక భ్రమలో ఉండి సాటి మనిషి మీద పగ తీర్చుకుంటున్నాడా అని ఆమెకు డౌట్ వస్తుంది. దేవుడు చెప్పాడని ఒకడ్ని దోషిగా తేల్చేయడం కరెక్టా? లేక కంటికి కనిపిస్తున్న సాక్ష్యాలను నమ్మాలా? అనే డైలమాలో ఆమె ఉంటుంది. వీళ్లిద్దరి మధ్య జరిగే ఈ మైండ్ గేమ్ లో అసలు ఆ పాప ఏమైంది? ఆ పాస్టర్ కి నిజంగానే దేవుడు కనబడ్డాడా ? లేక అతనికి పిచ్చి పట్టిందా? ఆ డిటెక్టివ్ నిజమైన నిందితుడిని ఎలా పట్టుకుంది ? అనే విషయాలతో ఈ సినిమా ఉత్కంఠంగా సాగుతుంది.

Read Also :  కోరిక తీర్చి మాయం చేసే టీచర్… టెన్షన్ పెట్టించే ఒక్కో స్టూడెంట్ మిస్సింగ్ కేసు… అదిరిపోయే కొరియన్ మిస్టరి

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×