E-Paper
Advertisement

OTT Movie : మంచి వాడిగా నటిస్తూ మతిపోగొట్టే పనులు… మస్ట్ వాచ్ మలయాళం థ్రిల్లర్

OTT Movie : మంచి వాడిగా నటిస్తూ మతిపోగొట్టే పనులు… మస్ట్ వాచ్ మలయాళం థ్రిల్లర్
Advertisement

OTT Movie : కళ్ల ముందు మంచివాళ్లుగా నటిస్తూ, వెనుక చెడ్డ పనులు చేసే వాళ్లను ప్రతీ ఒక్కరూ తమ లైఫ్ లో ఏదో ఒక టైమ్ లో చూసే ఉంటారు. కానీ ఇంట్లో ఉన్నవాళ్లే అందరి ముందు బాగా నటించే చెడ్డ వాళ్లయితే… ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అన్నట్టుగా ఉంటుంది. వాళ్ళ గురించి బయట వాళ్ళకి చెప్పినా నమ్మరు. అందుకే ఇంటి మనిషి వల్ల ఇంట్లో వాళ్ళే నలిగిపోతూ ఉంటారు. ఇలాంటి స్టోరీ లైన్ తో రూపొందిన ఓ మంచి మలయాళ మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. ఆ మూవీ పేరేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో

డాన్ పాలతర రాసి, ఎడిట్ చేసి, దర్శకత్వం వహించిన ఇంటెన్స్ మలయాళ డ్రామా థ్రిల్లర్ ‘Family (2023)’. క్రైస్తవ కమ్యూనిటీలోని డార్క్ సైడ్‌ను ఎక్స్‌పోజ్ చేసే మూవీ ఇది. వినయ్ ఫోర్ట్ (సోనీ), దివ్య ప్రభ, మాథ్యూ థామస్, నిల్జా కె. బేబీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రస్తుతం Amazon Prime Videoలో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. ఇది థ్రిల్లర్ మూవీ లవర్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన పవర్‌ఫుల్, డిస్టర్బింగ్ ఫిల్మ్. వినయ్ ఫోర్ట్ పర్ఫార్మెన్స్ ఇందులో అద్భుతంగా ఉంటుంది. సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్ అదుర్స్. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో (రాటర్‌డామ్, IFFK) ఈ సినిమా బెస్ట్ ఫిల్మ్ అవార్డ్స్ గెలిచింది. IMDbలో రేటింగ్ 6.0 ఉంది. కానీ మూవీపై విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

Advertisement

Read Also :  ఓటీటీ అలర్ట్… డిజిటల్ కష్టాలు గట్టెక్కిన మలయాళం మూవీ… ఎట్టకేలకు సైలెంట్ గా స్ట్రీమింగ్

స్టోరీలోకి వెళ్తే..

కేరళలోని ఇడుక్కి జిల్లాలోని ఒక రూరల్ క్రిస్టియన్ విలేజ్‌లో నడుస్తుంది ఈ మూవీ స్టోరీ మొత్తం. సోనీ (వినయ్ ఫోర్ట్) కు దేవుడంటే భక్తి, భయం. పిల్లలకు ట్యూషన్ చెప్పడం, వాలంటీర్ యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేయడం, చర్చి మ్యాటర్స్‌లో హెల్ప్ చేయడం వంటివి చేస్తూ గ్రామంలో అందరి నోట్లో నాలుకలా మెలుగుతాడు. ఓ మంచి క్రిస్టియన్, ఇంటెలెక్చువల్‌ వ్యక్తిగా కన్పిస్తాడు చూసేవాళ్ళకి. కానీ ఈ పబ్లిక్ ఇమేజ్ వెనుక ఒక నార్సిసిస్ట్, మానిప్యులేటర్, హాబిట్యువల్ అబ్యూజర్ దాగి ఉన్నాడన్న విషయం ఎవ్వరికీ తెలియదు. ఈ క్రమంలోనే కథలో ఒక ట్రాజెడీ జరుగుతుంది. తరువాతే సోనీ అసలు స్వరూపం నెమ్మదిగా బయట పడుతుంది. ఆ టైమ్ లో ఫ్యామిలీ, చర్చి, కమ్యూనిటీ అతన్ని కాపాడడానికి, అతని చుట్టూ రక్షణ కవచంలా నిలుస్తాయి. ఒక ప్రిడేటర్‌ను ప్రొటెక్ట్ చేస్తూ, విక్టిమ్స్‌ను నోరు తెరవనివ్వరు. మినిమల్ డైలాగ్స్, నేచురల్ సౌండ్స్‌తో డాన్ పాలతర మూవీ సాగుతున్నంత సేపూ టెన్షన్ క్రియేట్ చేశాడు. చిన్న పిల్లలపై వేధింపులు, రిలిజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ హిపోక్రసీ, ఫ్యామిలీ వాల్యూస్ వంటి థీమ్స్ ఇందులో ఉంటాయి. అయితే ఇంతకీ సోనీ చేసే చెడ్డ పనులు ఎలా బయట పడతాయి? అతని నిజ స్వరూపం ఎవరికైనా తెలుస్తుందా లేదా ? అన్నది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×