E-Paper
Advertisement

ఆ ఇంట్లో ఏదో ఉంది… మంత్రగత్తె మాయలో పడ్డ తోబుట్టువులు… ప్రాణాలతో బయటపడతారా?

ఆ ఇంట్లో ఏదో ఉంది… మంత్రగత్తె మాయలో పడ్డ తోబుట్టువులు… ప్రాణాలతో బయటపడతారా?
Advertisement

Fantasy horror movie on OTT : ఓటీటీలో హారర్ సినిమాలు ఎక్కువే. వీటిని చూసేవాళ్ళు కూడా తక్కువేం కాదు. దెయ్యాలు, మంత్రగత్తె లాంటి ఫాంటసీ హారర్ లను పిల్లలు కూడా ఎక్కువగా చూస్తుంటారు. ఇలాంటి కంటెంట్ తో ఒక మూవీ ఓటీటిలో ఆకట్టుకుంటోంది. ఇది రెగ్యులర్ దయ్యం సినిమాల్లాగా టక్కున భయపెట్టే రకం కాదు. ఇదొక రకమైన పిచ్చెక్కించే ఫాంటసీ థ్రిల్లర్. అడవిలో ఆకలితో అల్లాడిపోయే అక్కాతమ్ముళ్లు, ఒక వింత మంత్రగత్తె ఇంట్లో ఇరుక్కుని ప్రాణాలు కాపాడుకోవడానికి పడే పాట్లు ఇందులో చూపిస్తారు. సినిమా అంతా ఏదో తెలియని భయం వెన్నాడుతూనే ఉంటుంది. ఫ్రేమ్స్ అన్నీ ఏదో పీడకలలాగా వింతగా కనిపిస్తాయి. కాస్త ఓపిగ్గా, డిఫరెంట్ విజువల్స్ ఇష్టపడేవాళ్లకి ఇది ఒక మంచి కిక్కు ఇచ్చే సినిమా. 2020లో వచ్చిన దీని పేరు గ్రెటెల్ & హాన్సెల్ (Gretel & Hansel). కేవలం ఐదు మిలియన్ డాలర్ల తక్కువ బడ్జెట్‌తో నిర్మించినప్పటికీ, ఇందులోని లైటింగ్, కెమెరా పనితనం దీనిని హాలీవుడ్ టాప్ క్లాస్ సినిమాల సరసన నిలబెట్టాయి.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

గ్రెటెల్ & హాన్సెల్ ప్రపంచవ్యాప్తంగా 2020 జనవరి 31న థియేటర్లలో విడుదలైంది. థియేటర్లలో విడుదలైన కొన్ని నెలల తర్వాత, అంటే 2020 ఏప్రిల్ 7న ఈ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా Amazon Prime Video లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనిని ఓజ్‌గుడ్ పెర్కిన్స్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని ప్రధాన ఆకర్షణ దాని విజువల్ స్టైల్. దర్శకుడు ఓజ్ పెర్కిన్స్ ఈ చిత్రాన్ని ఒక సాధారణ హారర్ సినిమాలా కాకుండా, ఒక భయంకరమైన పెయింటింగ్‌లా తీర్చిదిద్దారు. ముఖ్యంగా సినిమాలో కనిపించే ఆ త్రికోణాకారపు ఇల్లు డిజైన్, ఐర్లాండ్‌లోని దట్టమైన అడవులు ప్రేక్షకులకు ఒక వింతైన అనుభూతిని ఇస్తాయి.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

చాలా కాలం క్రితం ఒక గ్రామంలో గ్రెటెల్, హాన్సెల్ అనే అక్కాతమ్ముళ్లు ఉండేవారు. ఇంట్లో తిండి లేక, పేదరికం భరించలేక వాళ్ళు బాగా ఇబ్బంది పడుతుంటారు. అయితే ఒకరోజు ఆకలితో అడవిలోకి వెళ్లిన వాళ్ళకి ఒక వింతైన ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇంటి లోపల టేబుల్ నిండా రకరకాల ఆహార పదార్థాలు ఉండటం చూసి, ఆకలి తట్టుకోలేక ఇద్దరూ కడుపునిండా తింటారు. ఆ ఇంటి యజమాని అయిన ఒక వృద్ధురాలు ఒక మంత్రగత్తె. వాళ్ళని ఇంట్లోనే ఉండమని ఆశ్రయం ఇస్తుంది. ఆ ఇంట్లో ఉన్న కొద్దీ రోజులకు గ్రెటెల్‌కు కొన్ని వింత అనుభవాలు ఎదురవుతాయి. ఆ వృద్ధురాలు తనకు తెలియని శక్తులను నేర్పిస్తున్నట్లు, అలాగే తన తమ్ముడు హాన్సెల్ ప్రవర్తన మారుతున్నట్లు ఆమె గమనిస్తుంది.

ఇక ఆ మంత్రగత్తె పిల్లలను చంపి తింటుందని, తన శక్తులను పెంచుకోవడానికి గ్రెటెల్‌ను తన శిష్యురాలిగా మార్చుకోవాలని చూస్తోందని గ్రెటెల్ అర్థం చేసుకుంటుంది. హాన్సెల్‌ను బలి ఇచ్చేందుకు ఆ మంత్రగత్తె ప్రయత్నించినప్పుడు గ్రెటెల్ అప్రమత్తమవుతుంది. గ్రెటెల్ తనలో దాగి ఉన్న మంత్రశక్తులను ఉపయోగించి ఆ మంత్రగత్తెను ఎదిరిస్తుంది. చివరికి గ్రెటెల్ మంత్రగత్తె బారి నుంచి బయటపడుతుందా ? మంత్రగత్తె చేతిలో అక్కాతమ్ముళ్లు బలి అవుతారా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : దేవుడికి పూజలు చేస్తుంటే మధ్యలో దెయ్యం గోల ఒకటి… బాబోయ్ ప్యాంటు తడిపించే సీన్లు

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×