E-Paper
Advertisement

దేవుడికి పూజలు చేస్తుంటే మధ్యలో దెయ్యం గోల ఒకటి… బాబోయ్ ప్యాంటు తడిపించే సీన్లు

దేవుడికి పూజలు చేస్తుంటే మధ్యలో దెయ్యం గోల ఒకటి… బాబోయ్ ప్యాంటు తడిపించే సీన్లు
Advertisement

Indonesian supernatural horror movie OTT : ఇండోనేషియన్ హారర్ సినిమా అంటేనే భయం పుట్టించేలా ఉంటాయి. 1998లో ఇండోనేషియాలోని జరిగిన యథార్థ సంఘటనల నేపథ్యంలో ఒక దెయ్యం సినిమా రూపొందింది. ప్రార్థన సమయంలో ముస్లింల ఏకాగ్రతను దెబ్బతీసే దెయ్యం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఒక్కసారిగా తెర మీద దెయ్యం వచ్చి పడటం, వింత వింత అరుపులతో ఈ సినిమా చూస్తున్నంత సేపు కుర్చీలో కుదురుగా కూర్చోలేం. భయంతో ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుంది. రాత్రిపూట లైట్లు ఆపేసి ఈ సినిమా చూస్తే, పక్కన ఎవరైనా ఉన్నా కూడా భయమేస్తుంది.

ఎక్కడ చూడచ్చు అంటే

2023లో వచ్చిన ఈ ఇండోనేషియా సూపర్ నేచురల్ హారర్ మూవీ పేరు ‘ఖాన్జాబ్’ (Khanzab). హారర్ జానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రానికి అంగ్గి ఉంబారా దర్శకత్వం వహించగా, యాసమిన్ జాసెమ్, తికా బ్రవాని ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని డీ కంపెనీ, ఉంబారా బ్రదర్స్ ఫిల్మ్ నిర్మించాయి. సుమారు 1 గంట 45 నిమిషాల నిడివి కలిగిన ఈ సినిమా ఐఎండిబి లో 4.6 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది, కానీ ప్రధానంగా ఇండోనేషియన్ భాషలోనే లభిస్తోంది. 2019లో వచ్చిన ‘మక్ముమ్’ (Makmum) చిత్రంతో దీనికి దగ్గరి సంబంధం ఉండటంతో, హారర్ ప్రియుల్లో ఈ సినిమా మంచి ఆసక్తిని రేకెత్తించింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

బన్యువాంగి అనే ఊళ్లో రాహయు అనే అమ్మాయి ఉండేది. 1998 టైంలో ఆ ఊళ్లో మంత్రగాళ్లని ఏరిపారేసే గొడవలు జరిగాయి. ఆ గొడవల్లో జనం రాహయు తండ్రిని మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో దారుణంగా చంపేస్తారు. కళ్ల ముందే నాన్న పోవడంతో ఆ పిల్ల మనసు పాడైపోయి, ఊరొదిలి వేరే చోటికి వెళ్ళిపోతుంది. కానీ ఊరు మారినా ఆమె మనసులో ఉన్న ఆ పాత భయం, బాధ మాత్రం అస్సలు పోదు. కొన్నాళ్లకి ఆ పిల్ల నమాజ్ చేసుకోవడం మొదలుపెడుతుంది. కానీ ఆమె నమాజ్ లో కూర్చున్నప్పుడల్లా ‘ఖాన్జాబ్’ అనే ఒక కంత్రీ దెయ్యం తగులుకుంటుంది. మనం దేవుడిని తలుచుకుంటుంటే, ఈ దెయ్యం వచ్చి ఏకాగ్రత దెబ్బతీస్తుంటుంది. అది మామూలు దెయ్యం కాదు, మనిషిని పిచ్చోడిని చేసే రకం. రాహయు చుట్టూ భయంకరమైన వింతలు జరగడం మొదలై, ఆమెను పిచ్చెక్కించే రేంజ్ కి వెళ్తాయి. చివరికి ఆ దెయ్యం బారి నుండి రాహయు ఎలా బయటపడింది? అసలు ఆ దెయ్యం ఆమెనే ఎందుకు టార్గెట్ చేసింది? తన నాన్న చావుకి, ఈ దెయ్యానికి ఏమైనా లింకు ఉందా? అనేది అసలు కథ. మనసులో భయం ఉంటే దెయ్యం ఎలా ఆడుకుంటుందో ఈ సినిమాలో భలే చూపించారు.

Read Also : భర్తను పంచుకున్న యువతితో భార్య పెంచుకున్న బంధం… ఒకే పురుషుని కోసం ఇద్దరు స్త్రీల ఆరాటం

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×