E-Paper
Advertisement

రెండువందల ఏళ్ల రాక్షసుడితో కాంట్రాక్ట్ మ్యారేజ్… ప్రతి ఎపిసోడ్ పిచ్చెక్కించే రొమాంటిక్ సిరీస్

రెండువందల ఏళ్ల రాక్షసుడితో కాంట్రాక్ట్ మ్యారేజ్… ప్రతి ఎపిసోడ్  పిచ్చెక్కించే రొమాంటిక్ సిరీస్

Fantasy romantic comedy OTT : డెమన్ల ప్రపంచం, ఆత్మల ఒప్పందాలు ఉంటే, ఏదో భయంకరమైన స్టోరీ అనుకుంటాం. కానీ ఈ కొరియన్ సిరీస్ లో ఇవన్నీ ఉన్నా సరదాగా సాగిపోతుంది. ఈ కథ 200 ఏళ్లుగా మనుషులతో ఒప్పందాలు చేసుకుంటూ, వాళ్ళ ఆత్మలను తెసుకెళ్ళే ఒక డెమన్ చుట్టూ తిరుగుతుంది. హీరోయిన్ కొన్ని కారణాల వల్ల ఆ డెమన్ ను కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తుంది. క్లైమాక్స్ వరకు సిరీస్ క్రేజీగా సాగుతుంది. ఇందులో వీళ్ళ మధ్య ఉండే క్రేజీ కెమిస్ట్రీ చూసి యూత్‌ పిచ్చెక్కిపోయారు. ఇది ప్రపంచవ్యాప్తంగా టాప్ ట్రెండింగ్‌లో నిలిచి, కొరియన్ డ్రామా ఇష్టపడే వారికి ఒక మస్ట్ వాచ్ సిరీస్‌గా మారింది. దీని పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్

ఈ కొరియన్ ఫాంటసీ రొమాంటిక్ కామెడీ డ్రామా పేరు ‘మై డెమన్’ (My Demon). 2023లో వచ్చిన ఈ సిరీస్ లో సాంగ్ కాంగ్, కిమ్ యూ-జుంగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ ప్రధానంగా దాని విజువల్స్, ఫ్యాషన్ కోసం విపరీతమైన గుర్తింపు పొందింది. హీరోయిన్ కిమ్ యూ-జుంగ్ వేసుకునే క్లాసీ దుస్తులు, హీరో సాంగ్ కాంగ్ స్టైలిష్ కోట్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. 2023 SBS డ్రామా అవార్డ్స్‌లో ఈ జోడీకి ‘బెస్ట్ కపుల్’ అవార్డు రావడమే కాకుండా, వాళ్ళ నటనకు గాను ప్రత్యేక పురస్కారాలు కూడా లభించాయి. మరో విశేషమేమిటంటే, ఈ డ్రామా కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా, ఫాంటసీ ఎలిమెంట్స్ ని అద్భుతంగా చూపిస్తుంది. 16 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

ఇందులో హీరో జియోంగ్ గు-వోన్ ఒక డెమన్. అతను సుమారు రెండు వందల ఏళ్ల నుండి భూమి మీద డెమన్ గా చలామణి అవుతున్నాడు. మనుషుల దగ్గరికి వెళ్లి నీ కోరిక తీరుస్తా, కానీ పదేళ్ల తర్వాత నీ ప్రాణం తీసుకెళ్తా అని అగ్రిమెంట్లు రాపించుకుని వాళ్ల ఆత్మలను నరకానికి పంపిస్తుంటాడు. అతను చూడటానికి చాలా హ్యాండ్సమ్‌గా ఉంటాడు. కానీ మనసు, మమకారం అనేవి అస్సలు ఉండవు. తన పని తాను చేసుకుంటూ ఫుల్ యాటిట్యూడ్‌తో బతికేస్తుంటాడు.

ఇక హీరోయిన్ దో దో-హీ ఒక పెద్ద బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. అందరూ తనని చంపాలని ప్లాన్ చేస్తుంటే, ఒకరోజు చావబోయి మన హీరో కంట్లో పడుతుంది. ఆ టైమ్‌లో జరిగిన ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల హీరో చేతి మీద ఉన్న ‘డెమన్ ట్యాటూ’ హీరోయిన్ చేతి మీదకి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా హీరో మామూలు మనిషి అయిపోతాడు. అతని పవర్స్ అన్నీ హీరోయిన్ చేతిలోకి వెళ్లడంతో, ఆమె టచ్ చేస్తే తప్ప అతను తన పవర్స్‌ని వాడలేడు.

ఇక తన పవర్స్ కాపాడుకోవడానికి హీరోయిన్ వెనకాలే తిరగడం మొదలుపెడతాడు మనోడు. అటు హీరోయిన్ కూడా తనని చంపాలని చూస్తున్న విలన్ల నుండి తప్పించుకోవడానికి హీరోని బాడీగార్డ్ గా పెట్టుకుంటుంది. అలా ఇద్దరూ కలిసి ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుంటారు. మొదట్లో ఒకరినొకరు తిట్టుకుంటూ, గొడవ పడుతూ ఉన్నా.. మెల్లగా ఒకరి మీద ఒకరికి మనసు మళ్లుతుంది. హీరో హీరోయిన్ల మధ్య ఉన్న గత జన్మల కనెక్షన్ కథలో బయటికి వస్తుంది. దీంతో స్టోరీ మరింత ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. చివరికి ప్రాణాలు తీసే రాక్షసుడి నుండి, ఒక ప్రాణం కోసం ఆరాటపడే ప్రేమికుడిగా ఎలా మారాడన్నదే ఈ కథ క్లైమాక్స్. చూడటం మొదలు పెడితే దీనిని అలా చూస్తూ ఉండిపోతారు. సిరీస్ అంత సరదాగా ఉంటుంది.

Read Also : గతం వెతుకుతూ గత్తర లేపే జోంబీ డిటెక్టివ్… కామెడీతో కేక పెట్టించే ఇన్వెస్టిగేషన్

Tags

Related News

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

క్రైమ్ నుంచి రొమాన్స్ వరకు… ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే

Big Stories

×