E-Paper
Advertisement

గతం వెతుకుతూ గత్తర లేపే జోంబీ డిటెక్టివ్… కామెడీతో కేక పెట్టించే ఇన్వెస్టిగేషన్

గతం వెతుకుతూ గత్తర లేపే జోంబీ డిటెక్టివ్… కామెడీతో కేక పెట్టించే ఇన్వెస్టిగేషన్
Advertisement

Fantasy comedy Series OTT : సాధారణంగా జాంబీలు అంటే భయంకరంగా ఉంటారు. వాటిని చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది. అయితే ఒక కొరియన్ సిరీస్ దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. క్రూరంగా ఉండే జాంబీ పాత్రను చాలా అమాయకంగా, కామెడీగా చూపించడం ఈ డ్రామా ప్రత్యేకత. ఈ సిరీస్ లో హీరో ఒక జాంబీగా ఉంటూ, డిటెక్టివ్ గా కేసులను కూడా సాల్వ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో జరిగే సన్నివేశాలు నవ్వు తెప్పిస్తుంటాయి. ఇందులో రక్తపాతం, భయం లాంటివి పెద్దగా ఉండవు కాబట్టి జాంబీ సినిమాలంటే భయపడే వాళ్లు కూడా హాయిగా చూసేయొచ్చు.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ కొరియెన్ ఫాంటసీ కామెడీ సిరీస్ పేరు ‘జాంబీ డిటెక్టివ్’ (Zombie Detective). 2020 లో వచ్చిన ఈ సిరీస్ లో చోయ్ జిన్-హ్యుక్, పార్క్ జూ-హ్యూన్ లీడ్ రోల్స్ లో నటించారు. సిరీస్‌లో చోయ్ జిన్-హ్యుక్ నటన హైలైట్‌గా నిలుస్తుంది. అతను జాంబీలా ఉంటూ, మనుషుల మధ్య కలిసిపోవడానికి చేసే ప్రయత్నాలు ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి. ఇందులో సీరియస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఉన్నప్పటికీ, కథనం మొత్తం సరదాగా సాగిపోతుంది. ఈ సిరీస్ కేవలం 12 ఎపిసోడ్లలోనే ముగియడం వల్ల కథ ఎక్కడా సాగదీసినట్లు అనిపించదు. IMDbలో 7.3 రేటింగ్ పొందిన ఈ డ్రామా, కొరియన్ ఎంటర్టైన్మెంట్ రంగంలో ఒక సరికొత్త ప్రయోగానికి నాంది పలికింది. నెట్‌ఫ్లిక్స్ (Netflix) వికీ (Viki) ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్న ఈ సిరీస్, రొటీన్ క్రైమ్ థ్రిల్లర్లకు భిన్నంగా ఏదైనా కొత్తగా చూడాలనుకునే వారికి ఒక మంచి ఛాయిస్.

స్టోరీ ఏమిటంటే 

Advertisement

ఈ సిరీస్ లో హీరో స్పృహలోకి వచ్చేసరికే ఒక చెత్త కుప్పలో ఉంటాడు. అయితే అతనికి తాను ఇప్పుడు ఒక జాంబీగా మారిపోయానని అర్థమవుతుంది. తన గతమేమిటో అతనికి అస్సలు గుర్తుండదు. అయితే జాంబీల్లా క్రూరంగా మారకూడదని నిర్ణయించుకుని, ఏడాది పాటు కష్టపడి మనుషుల్లా నడవడం, మాట్లాడటం నేర్చుకుంటాడు. ఆ తర్వాత తన గతాన్ని వెతుక్కుంటూ నగరానికి వచ్చి, అనుకోకుండా ఒక ప్రైవేట్ డిటెక్టివ్ గుర్తింపును పొంది ఆ వృత్తిలోనే స్థిరపడతాడు. అతని దగ్గర సున్-జి అనే ఒక అమ్మాయి అసిస్టెంట్‌గా చేరుతుంది. మొదట్లో అతనికి, ఆమెకి మధ్య గొడవలు జరిగినా, తర్వాత అతను ఒక జాంబీ అని ఆమెకు తెలిసిపోతుంది. అయినా భయపడకుండా, అతనికి ఉన్న నిజాయితీని చూసి అతని గతాన్ని కనిపెట్టడంలో సహాయం చేయడానికి ముందుకు వస్తుంది.

ఇక వీళ్ళిద్దరూ కలిసి డిటెక్టివ్ ఏజెన్సీ పేరుతో రకరకాల కేసులను ఛేదిస్తూ ఉంటారు. ఈ ప్రయాణంలో వాళ్ళకి ఒక ప్రమాదకరమైన నేరగాడి గురించి తెలుస్తుంది. ఆ క్రిమినల్ కి, హీరో జాంబీగా మారడానికి ఏదో సంబంధం ఉందని అర్థమవుతుంది. ఆ మిస్టరీని ఛేదించే క్రమంలో వచ్చే మలుపులు, జాంబీగా అతను పడే ఇబ్బందులు నవ్వు తెప్పిస్తూనే ఆకట్టుకుంటాయి. చివరకు అతను తన గతాన్ని ఎలా తెలుసుకున్నాడు ? జాంబీగా సమాజంలో ఎలా బ్రతికాడు ? అతను జాంబీగా ఎలా మారాడు ? అనే విషయాలను ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : భర్తను వదిలి ప్రియుడితో ప్రేమాయణం… కళ్ళు తెరిపించే క్లైమాక్స్

Tags

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×